వైశాఖ పురాణం – 6 వ అధ్యాయం – జలదాన మహత్మ్యము – గృహగోధికా కథ
వైశాఖ పురాణం (Vaisakha Puranam) లోని ఆరవ అధ్యాయం జలదానం యొక్క మహిమను వివరిస్తుంది. ఈ అధ్యాయంలో, గృహగోధిక అనే ఒక పేద స్త్రీ యొక్క కథను వివరిస్తారు. ఆమె తన భర్త మరణించిన తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. ఒక రోజు, ఆమె ఒక సాధువును కలుస్తుంది. ఆ సాధువు ఆమెకు జలదానం చేయమని సలహా ఇస్తాడు. గృహగోధిక తన వంతు ప్రయత్నం చేసి, ప్రతిరోజూ పక్షులకు, జంతువులకు నీరు పెడుతుంది.
కొంతకాలం తర్వాత, గృహగోధిక కలలో శ్రీ మహావిష్ణువు (Lord Vishnu) కనిపిస్తారు. శ్రీ మహావిష్ణువు ఆమె జలదానం చేసిన పుణ్యానికి సంతోషించి, ఆమెకు కోరిన వరాలను ఇస్తారు. గృహగోధిక తన భర్తను తిరిగి పొందాలని కోరుకుంటుంది. శ్రీ మహావిష్ణువు ఆమె కోరికను తీర్చి, ఆమె భర్తను తిరిగి బ్రతికించిస్తారు. ఈ కథ ద్వారా జలదానం యొక్క మహిమను మనం తెలుసుకోవచ్చు. ఒక చిన్న పని కూడా చాలా పుణ్యం కలిగిస్తుందని, దేవుడు దానిని తప్పకుండా అంగీకరిస్తాడని ఈ కథ తెలియజేస్తుంది. వైశాఖ పురాణం – 6 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 6) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 6
జలదాన మహత్మ్యము – గృహగోధికా కథ
" శ్రీభగవానువాచ
యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ ।
సోఽహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ॥
స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి ।"
నారదుని (Narada Muni) మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస (Vaisakha Masam) విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో నుత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు (Brahmin) పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.
పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానములను అనేకము గావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములను (Stars) అన్నియు లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ది చెందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవ దత్తము సులభము. అట్టి జలమును దానము ఇచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మ పుత్రుడగు వశిష్ఠుడు (Vasishtha) ఆ మహా రాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని అనేక మార్లు ఆ రాజునకు చెప్పెను.
నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే ఏవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగ వైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరూ ప్రసిద్దులను మరియు ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.
ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను (Eagle), కుక్కగ (Dog) అనేక మార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలా దేశమును పాలించు శ్రుతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండు బల్లిగా (Lizard) జన్మించెను. అచ్చట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనమును గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.
మిధిలా (Mithila) దేశ రాజ గృహమునకు శ్రుతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి ఏదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి తీసుకొని వచ్చెను. అతనికి మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ! నీవు ఎందులకు ఇట్లు దుఃఖించుచున్నావు. నీవు ఏ పని చేసి ఇట్టి దశను అందితివి? ఇట్లు ఎల అరచుచున్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకు ఈ దశ ఎల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.
శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగద (Hemangada) మహారాజు మహాత్మా! నేను ఇక్ష్వాకు కులమున (Ikshvaku Dynasty) జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర (Veda Shastra) విశారదుడను. భూమి యందలి రేణువులెన్ని ఉండునో, నీటియందు జలబిందువు లెన్నియుండునో, ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వ విధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను, ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, ఏడూ మార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లు కొనుచుండగా కొన్ని నీటి తుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాప భారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను ఇరువది ఏడుమార్లు బల్లిగా జన్మించవలసి ఉయున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కలిగెనో ఎరుగజాలను.
దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్ప కోరుచున్నానని ప్రార్థించెను. శ్రుతదేవ మహాముని హేమాంగదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను. రాజా! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమును ఎవనికి దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జల దానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును కూడ పాటింపలేదు. హోమము (Homam) చేయదలచినవారు మంత్ర పూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లు కాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగు వారికి దానమీయక అయోగ్యులగు వారికి దానముల నిచ్చితివి. అ పాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా! వైశాఖమాస వ్రతమును (Vrut) చేయలేదు. జల దానమును చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను, సుగంధాది గుణములున్నను ముండ్లు కల వృక్షము నెవరాదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది.
అందువలన నది పూజార్హమైనది. తులసియు(Tulasi) మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును, తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా? అట్టి పూజలవలన ఫలితముండునా? అనాధలు, అంగవైకల్యము కలవారు దయ చూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు.
తపము, జ్ఞ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు (Sri Hari) మిక్కిలి ఇష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు అట్టి వారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే అగును. ఈ విధముగ చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు, అంధులు – ప్రజ్ఞా జ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫలముండునా? గ్రుడ్డి వానికేమి కనిపించును? అతడు ఏమి చెప్పగలడు? కావున జ్ఞాన హీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్దించును?
తీర్థములు కేవలం జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము, సేవ చేసినచో శిలా రూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారియుపదేశములను పాటించినచో విషాదముండదు. యిష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అంఋతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వం సిద్ది కలుగును. హేమాంగద మహారాజా! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులు అగువారిని సేవింపలేదు. కావున నీకు ఇట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖమాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకు ఇత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిషత్ వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.
ఆ పుణ్యఫలమును పొందిన అంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు, శ్ర్తదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము ఎక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలు అందరును హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్య లోకమున పదివేల సంవత్సరములు ఉండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కుల గురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మముల అన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యమును పొందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వ పాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాస వ్రతమును, వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస వ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికా వృత్తాంతమును వివరించెను.
ఆరవ అధ్యాయము సమాప్తము.
sssds