వైశాఖ పురాణం – 30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 30వ అధ్యాయం వైశాఖ మాసంలో పుష్కరిణి (Pushkarini) స్నానం యొక్క పుణ్య మహిమ గురించి వివరిస్తుంది. నారదుడు ఈ విషయాలను ధర్మరాజు అంబరీషుడికి వివరిస్తాడు. పుష్కరిణి అంటే పవిత్రమైన సరస్సు. వైశాఖ మాసంలో సూర్యుడు మేష రాశిలోకి (Mesha Rasi), చంద్రుడు పూర్ణిమ దశలోకి ప్రవేశిస్తాయి. ఈ కారణంగా పుష్కరిణి జలాలకు ఎనలేని శక్తి చేకూరుతుంది.
ఈ అధ్యాయం పుష్కరిణి స్నానం యొక్క అనేక ప్రయోజనాలను వివరిస్తుంది. వైశాఖ మాసంలో (Vaisakha Masam) పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి, శరీరం, మనస్సు పవిత్రమవుతాయి. అంతేకాకుండా, ఈ స్నానం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, దీర్ఘాయుష్షు లభిస్తుంది. మాత్రమే కాకుండా, మన కోరికలు నెరవేరుతాయి, సకల సంపదలు కూడా కలుగుతాయి. వైశాఖ పురాణం – 30వ అధ్యాయం (Vaisakha Puranam – Day 30) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 30
వైశాఖ పురాణం – 30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
నారద మహర్షి (Narada Muni) రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత (Vaisakha Vrut) మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవ మహారాజా వైశాఖ శుక్ల పక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి (Trayodashi), చతుర్దశి (Chaturdashi), పూర్ణిమ (Purnima) అను నీ మూడు తిధులును ‘పుష్కరిణీ’ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియను నది సర్వ పాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేని వారు ఈ మూడు తిధి నందు వైశాఖ స్నానాదులను చేసినను వారికి మూడు తిధుల యందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును.
త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు (Lord Vishnu) ఆవహించి యుండును. చతుర్దశి యందు సర్వ యజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశి యందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా.
బ్రహ్మ హత్య సురపానము మున్నగు పాపములను చేసిన వారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును. దేవాసురులు క్షీర సాగరమును మధించు చుండగా ఏకాదశి (Ekadashi) యందు అమృతము జనించినది. ద్వాదశి నాడు సర్వోత్తముడు దయా నిధియగు శ్రీమన్నారాయణుడు అమృతమును దానవులనుండి కాపాడెను. త్రయోదశి నాడు దేవతలకు అమృతమును ఇచ్చెను. దేవతలతో వివాద పడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశి యందు సంహరించెను. పూర్ణిమ నాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ అను మూడు తిధులకును, “ఈ మూడు తిధులను మానవులకు వారు చేసిన సర్వ పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇచ్చును.
వైశాఖమాసము ముప్పై దినములును వైశాఖ మాస వ్రత స్నానదాన జపాదులను చేయలేక పొయినవారు. ఈ మూడు తిధుల యందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము. ఈ మూడు తిధుల యందును స్నానాదికమును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడి నీటి స్నానమును చేసిన వారు పదునాలుగు మన్వంతరములను, దడచునంత వరకు నరకమును పొందుదురు. పితృ దేవతలకు, దేవతలకు పెరుగన్నము నీయనివారు పిశాచములై పంచభూతములు ఉన్నంతవరకు బాధపడుచుందురు.
వైశాఖమాస వ్రతమును నియమ నిష్ఠలతో ఆచరించినవారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి (Sri Hari) సాయుజ్యమును పొందుచున్నారు. వైశాఖ మాసముల నెల నాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిధుల యందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము నంది శ్రీహరి సాయుజ్యమునందుదురు. ఈ మాస వ్రతము నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని, గురువును పూజింపనివారికి మేము శాపముల నిత్తుము. అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు, లేని వారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడిచేసిరి. కావున ఈ మూడు తిధుల సముదాయము అంత్య పుష్కరిణి నామ ధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును.
పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును (పప్పును), పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును (పప్పును), పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ మూడు దినముల యందును గీతా పఠనము చేసిన వారు ప్రతి దినము అశ్వమేధ యాగము (Ashwamedha Yagna) చేసినంత పుణ్యము నందుదురు.
ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలనుపడదు. పూర్ణిమ నాడు సహస్ర నామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు ఎన్నికల్పములు గడచినను శ్రీహరి లోకమునందే యుందురు. శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున ఈ మూడు దినములందు భాగవతమును (Bhagavata Purana) ఏ మాత్రము చదివినను బ్రహ్మ పదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, సిద్ధులుగను, బ్రహ్మ పదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించినవారు.
వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు. మూడు కోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను అని యనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి.
అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్ల పక్షమున అంత్య పుష్కరిణి కాలమున సూర్యోదయము కంటె ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగు వానిలో స్నానమాడిన వారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయము కంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖ మాసమున శుక్లపక్షము (Shukla Paksha) చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిధులు సర్వ పాపహరములు సుమా. నాయనా! శ్రుతదేవా నీవు అడిగిన వైశాఖ మహిమను, నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు.
వైశాఖ మహిమను చెప్పుమని కైలాసమున పార్వతి అడుగగా శివుడు (Lord Siva) నూరు దివ్య సంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తి కొలది వైశాఖ మహిమను చెప్పిరి. రాజా! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుత కీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను.
శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యెను.అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను.
నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను.ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి ఇంటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి, ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును.
వైశాఖ పురాణం ఆఖరి అధ్యాయము సంపూర్ణం.
Read more Puranas: