వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 3

వైశాఖ పురాణం – 3 వ అధ్యాయం –  అక్షయ తృతీయ విశిష్టత

Vaisakha Puranam - Day 3

వైశాఖ పురాణం  (Vaisakha Puranam) యొక్క మూడవ అధ్యాయం అక్షయ తృతీయ పండుగ యొక్క విశిష్టత గురించి వివరిస్తుంది. సూర్యుడు చంద్రునితో కలిసి ఉండే ఈ రోజున చేసే పుణ్యాలు, దానాలు అక్షయంగా, అంటే ఎప్పటికీ నిలిచేలా ఉంటాయని నమ్ముతారు. అందుకే దీనికి అక్షయ తృతీయ (Akshaya Tritiya) అనే పేరు వచ్చింది. ఈ రోజున గంగా స్నానం చేయడం, పుణ్య గంగ జలాన్ని (Ganga Jal) తలపై చల్లుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతే కాకుండా దానం చేయడానికి కూడా ఇది చాలా మంచి రోజు. ముఖ్యంగా బియ్యం, నెయ్యి, పెరుగు, శనగపప్పు, బెల్లం వంటి వాటిని దానం చేయడం మంచి ఫలితాలని ఇస్తుంది.

కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, విద్యలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి, ఇతర శుభకార్యాలు చేపట్టడానికి కూడా ఇది చాలా శుభప్రదమైన రోజు. అదేవిధంగా ఈ రోజున లక్ష్మీదేవిని (Lakshmi Devi) పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. సంక్షిప్తంగా చెప్పాలంటే అక్షయ తృతీయ పుణ్య, దానాలకు, కొత్త ప్రారంభాలకు అత్యంత విశిష్టమైన రోజు. వైశాఖ పురాణం – 3 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 3) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 3

అక్షయ తృతీయ (Akshaya Tritiya) విశిష్టత

నారద మహాముని (Narada Muni) అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తదియ అక్షయ తృతీయ అని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన దానం సర్వపాపహరము. శ్రీహరి (Sri Hari) పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల (Pitru Tarpanam) నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి ఈ మహిమ వచ్చిన కారణమును చెప్పెదను వినుము.

పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో (Bali Chakravarthi) పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు (Lord Indra) వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భమున ఉన్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము అడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపమును అనుసరించి ముని పత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడనువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థ పిండముచే అవమానింపబడి శపించిన ఇంద్రుడు ముని పత్నిని బలవంతముగ అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూసిన ముని శిష్యులు పరిహసించిరి.

ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత (Meru Parvat) గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని (Brihaspati) చేరి యింద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుని పరిస్థితిని వివరించి ఇంద్రుడు శచీ సహితుడై మేరు పర్వత గుహలో ఉన్నాడని చెప్పెను. అప్పుడు వారు అందరను మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని ఇంద్రుడు వారితో చెప్పెను.

ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు యేమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.

ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి యిష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిధులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిధి చాల శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుని  వైశాఖ ధర్మములను ఆచరింపినచో ఇంద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరి పూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి.

ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో కలసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని (Amaravati) గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదుల యందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞ యాగములను వేదాధ్యయనాదులను (Veda) కొనసాగించిరి. పితృ దేవతలును యధా పూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృ దేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వ జీవులకును భుక్తిని, ముక్తిని ఇచ్చి సార్ధక నామము కలిగియున్నది.

అని శ్రుత దేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.

 వైశాఖ పురాణము మూడవ అధ్యాయము సంపూర్ణం.

Read more Puranas:

Leave a Comment