వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 29

వైశాఖ పురాణం – 29వ అధ్యాయం – శునీ మోక్ష ప్రాప్తి

Vaisakha Puranam - Day 29

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 29వ అధ్యాయం మనకు ఓ అద్భుతమైన భక్తి కథను వివరిస్తుంది. నారదుడు ఈ కథను ధర్మరాజు అంబరీషుడికి చెబుతాడు. కథలో ధర్మం, భక్తి యొక్క శక్తి ప్రధానంగా ఉంటాయి.

శునీ అనే పేరుగల ఒక కుక్క ఉండేది. ఆమె చాలా భక్తి కలిగినది, ఎల్లప్పుడూ విష్ణు భగవానుడిని పూజించేది. ఒకరోజు అడవిలో తిరుగుతున్నప్పుడు, బలహీనంగా, నడవలేని స్థితిలో ఉన్న ఒక ఋషిని చూసింది. దయామయి అయిన శునీ, ఆ ఋషికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. తన నోటిలో ఋషిని ఎత్తుకుని, ఒక ఆశ్రమానికి తీసుకెళ్ళింది. ఆశ్రమంలోని ఇతర ఋషులు శునీ యొక్క దయ చూసి ఆశ్చర్యపోయారు. వారు ఆమెను ఋషికి సేవ చేయమని కోరారు.

శునీ ఋషికి చాలా శ్రద్ధగా సేవ చేసింది. ఆమె ఋషికి ఆహారం తినిపించేది, అతని స్నానం చేయించేది, అతనికి మసాజ్ చేసేది. చివరికి కొన్ని సంవత్సరాల తరువాత ఋషి మరణించాడు. తన ప్రియ ఋషి మరణానికి శునీ చాలా బాధపడింది. ఆమె ఋషి సమాధి పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంది. శునీ యొక్క అచంచల భక్తికి మెచ్చి, భగవాన్ విష్ణువు ప్రత్యక్షమై, ఆమెకు మోక్షం ప్రసాదించాడు. అలా శునీ స్వర్గలోకానికి చేరుకుని, అక్కడ ఆనందంగా జీవించింది. వైశాఖ పురాణం – 29వ అధ్యాయం (Vaisakha Puranam – Day 29) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 29

వైశాఖ పురాణం – 29వ అధ్యాయం – శునీ మోక్ష ప్రాప్తి

నారదుడు (Narada Muni) అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను.

మహారాజా! అన్ని తిధులలో వైశాఖ మాసమున (Vaisakha Masam) శ్లుక్ల పక్షమున (Shukla Paksha)  వచ్చు ద్వాదశీ తిధి (Dwadashi) సర్వ పాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని (Sri Hari) సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగువానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతఃకాల స్నానము చేసినచో గ్రహణ కాలమున గంగా తీరమున (Ganga River) వేయి గోవుల నిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్న దానము విశిష్ట ఫలము కలుగును. ఈనాడు యముని పితృ దేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జల కలశమును దధ్యన్నమును యిచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది. 

అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామ (Shaligram) దానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో అభిషేకించుట, పానకము ఇచ్చుట, దోసపండ్ల రసమును, చెరకు గడను, మామిడి పండును, ద్రాక్షా ఫలములను దానము చేయుట ప్రశస్తము. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను వినుము.

పూర్వము కాశ్మీరదేశమున (Kashmir) దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలినియను అందమైన కుమార్తె కలదు. అతడామెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు గొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమెయనిన పడదు. ఆమెకును అతడన్న పడదు. ఈ విధముగ వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసికొను ఉపాయములను చెప్పుడని భర్తృ పరిత్యక్తలగు స్త్రీలను అడిగెను. వారును మేము మా భర్తలకు చేసినదానిని చెప్పినట్లు చేయుము. మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు-మాకులను వశీకరణకై యిచ్చుయోగిని వివరములను చెప్పిరి. 

మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనము నిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి యుంగరమునిచ్చెను. యోగినియు నామొకొక మంత్రము నుపదేశించెను. అన్ని ప్రాణులును స్వాధీనమయ్యెడి చూర్ణము నిచ్చుచున్నాను. దీనిని నీ భర్తచే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము. ఇందు వలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమును ఇచ్చెను.

మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తానుకట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధికలిగెను. మరికొన్ని దినములకు యేమియును అనలేనివాడు చేయలేనివాడును అయ్యెను. దురాచారురాలగు ఆమె భర్త మరణించినచో తాను అలంకారములను విడువ వలసి వచ్చునని బాధపడెను. మరల యోగి వద్దకు పోయెను. ఆమె ఇచ్చిన దానిని భర్తచే తినిపించెను. వాని ఆరోగ్యము బాగుపడెను. కాని ఆమె స్వేచ్చగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. 

యమలోకమును (Yama Loka) చేరి పెక్కు చిత్రవిచిత్రములగు హింసలననుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపముననున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీర దేశమున పద్మ బంధువను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా నుండెను. ఇట్లు ముప్పది సంవత్సరములు గడచినవి.

ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో బాటు వచ్చిన కుక్క తులసి (Tulasi) అరుగు క్రింద పండుకొనియున్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపై నుండి జారి క్రిండపడుకొన్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కల్గెను. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తపము కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటిని చెప్పి విప్రోత్తమా! దీనురాలైన నాపై దయ యుంచి వైశాఖ శుద్ద ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యములను, పుణ్య ఫలమును నాకు ధార పోసి రక్షింపుమని బహు విధములుగ వేడుకొనెను. 

కుక్క మాటలాడుట యేమని యాశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని, తాను ద్వాదశినాడు చేసిన ప్రాతఃకాల నదీస్నానము పూజ, కథశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలము నిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున ఉన్న మాలిని మరల పెక్కు విధములుగ దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడు అంగీకరింపలేదు.

అప్పుడాకుక్క మిక్కిలి దీనముగా దయాశాలీ! పద్మబంధూ! నన్ను దయజూడుము గృహస్థు తను పోషింపదగినవారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ యింటిలోని బలులను ఉచ్చిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగియున్నవి. కావున నేను నీకు పోష్యరాలను. రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు (Lord Vishnu) మనము పోష్యులమై రక్షింపదగినవారమైనట్లుగ నేనును నీచే రక్షింపబడదగినదాననని బహువిధములుగ ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి యేమని పుత్రుని యడిగెను. 

పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్కమాటలను విని యాశ్చర్యపడెను. పుత్రుని జూచి నాయనా! నీవిట్లు పలుకరాదు. సజ్జనులు యిట్లు మాటలాడరు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. 

చంద్రుడు, సూర్యుడు (Lord Sun), వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు, సజ్జనులు పరోపకారమునకై మాత్రమే ఉన్నారు. వారు చేయు పనులన్నియును పరోపకారములే. వారి కోరకై యేమియు నుండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దధీచి దేవతలకు దయతో తన వెన్నముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శిబి చక్రవర్తి (Shibi Chakravarti) ఆకలి గల డేగకు తన మాంసము నిచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్ప రక్షణకై తనను గౠడునకు అర్పించుకొనెను.

 కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై యుండవలయును. మనస్సు పరిశుద్దముగ నున్నప్పుడు దైవము వర్షించును. మనశ్శుద్దిలేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండ వెన్నెలనంతటను ప్రసరింపజేయుచున్నాడు కదా! కావున నేను దీనురాలై అడుగుచున్న యీ కుక్కను నా పుణ్య కార్యముల ఫలములను ఇచ్చి ఉద్దరింతును అని పలికెను.

ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్య కార్యాల ఫలమును కుక్కకు ధారపోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను. అతడు ఇట్లు పలుకుచుండగా నా కుక్క రూపమును విడిచి దివ్యభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్య విమానను నెక్కి పోయెను. స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవము నుండి పుట్టి ఊర్వశిగా (Urvashi) ప్రసిద్దినందెను. 

యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలె ప్రకాశించునట్టి సర్వోత్తమమగునట్టి, యెట్టివారికైన మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమునందెను. త్రిలోకసుందరిగా ప్రసిద్ది చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశీ తిధిని పుణ్యములను వృద్ది చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్య తిధిగా లోకములలో ప్రసిద్దినొందించెను. ఆ ద్వాదశీ తిధి కొన్ని కోట్ల సూర్య చంద్ర గ్రహణముల (Grahana) కంటె సమస్త యజ్ఞయాగాదుల కంటె అధికమైన పుణ్య రూపము కలదై త్రిలోక ప్రసిద్దమయ్యెను.

అని శ్రుత దేవుడు శ్రుతకీర్తికి వైశాఖ (Vaisakha)శుద్ద ద్వాదశీ మహిమను వివరించెనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను.

వైశాఖ పురాణం ఇరవై తొమ్మిదో అధ్యాయం సంపూర్ణం.

Read more Puranas:

Leave a Comment