వైశాఖ పురాణం – 28వ అధ్యాయం – అక్షయ తృతీయ విశిష్టత
వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 28వ అధ్యాయం అక్షయ తృతీయ పండుగ యొక్క విశిష్టత గురించి వివరిస్తుంది. నారదుడు అంబరీషుడికి ఈ విషయాలను వివరిస్తాడు. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడవ రోజు జరుపుకుంటారు. ఈ రోజు చాలా శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది.
ఈ అధ్యాయంలో, నారదుడు అక్షయ తృతీయ పండుగ యొక్క మూలం, ప్రాముఖ్యత గురించి వివరిస్తాడు. ఈ రోజు చంద్రుడు, సూర్యుడు (Lord Sun) ఒకే రాశిలో ఉండటం వల్ల చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, కొత్త ఇంటిని నిర్మించడం వంటి శుభకార్యాలు చేయడం చాలా మంచిది. అక్షయ తృతీయ రోజున దానం చేయడం చాలా పుణ్యం. ఈ రోజున దానం చేసిన వారికి ఎన్నడూ క్షీణించని సంపద లభిస్తుందని నమ్ముతారు.
ఈ అధ్యాయంలో నారదుడు అక్షయ తృతీయ రోజున చేయాల్సిన కొన్ని ముఖ్యమైన ఆచారాలను కూడా వివరిస్తాడు. ఈ రోజున ఉదయం పద్మాలతో స్నానం చేయడం, పసుపు, కుంకుమతో భగవంతుడిని పూజించడం, పవిత్ర మంత్రాలను (Mantra) జపించడం వంటివి చేయాలి. వైశాఖ పురాణం – 28వ అధ్యాయం (Vaisakha Puranam – Day 28) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 28
వైశాఖ పురాణం – 28వ అధ్యాయం – అక్షయ తృతీయ విశిష్టత
నారద మహాముని (Narada Muni) అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తదియ అక్షయ తృతీయ (Akshaya Tritiya) అని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన దానం సర్వపాపహరము. శ్రీహరి (Sri Hari) పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల (Tarpana) నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృ దేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి యీ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము.
పూర్వము ఇంద్రునకు బలి చక్రవర్తితో (Bali Chakravarthi) పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను.
ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపమును అనుసరించి ముని పత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడను వాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థ పిండముచే నవమానింపబడి శపించిన ఇంద్రుడు ముని పత్నిని బలవంతముగ ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన ముని శిష్యులు పరిహసించిరి.
ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత (Meru Parvat) గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు (Brihaspati) దేవతలకు యింద్రుని పరిస్థితిని వివరించి యింద్రుడు శచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నాడని చెప్పెను.
అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి ఇంద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని యింద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని యింద్రుడు వారితో చెప్పెను.
ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు ఏమి చేయవలయునా అని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.
ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమగు వైశాఖ మాసము (Vaisakha Masam) గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిధులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి (Shukla Paksha) తృతీయా తిధి చాల శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో ఇంద్రుద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి యింద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరిపూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో గలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని (Amaravati) గెలుచుకొని ప్రవేశించెను.
అప్పుడు దేవతలు యజ్ఞ యాగాదులయందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలును యధాపూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని యిచ్చి సార్ధక నామము కలిగియున్నది.
అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.
వైశాఖ పురాణం 28 వ అధ్యాయం సమాప్తం.
Read more Puranas: