వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 26

వైశాఖ పురాణం – 26 వ అధ్యాయం – వాల్మీకి జన్మ

Vaisakha Puranam - Day 26

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 26వ అధ్యాయం ఋషి వాల్మీకి జననం గురించిన కథ. నారదుడు ఈ కథను అంబరీషుడికి వివరిస్తాడు. ఒకప్పుడు రోచనుడు అనే అహంకారంతో ఉండే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎక్కువ మాట్లాడేవాడు, గర్వంతో ఉండేవాడు. ఒక వైశాఖ మాసంలో (Vaisakha Masam) జయంతుడు అనే మరో బ్రాహ్మణుడు వచ్చి వైశాఖ వ్రతం గురించి ప్రజలకు బోధించాడు. రోచనుడు కూడా ఈ బోధనలు విన్నాడు కానీ, అహంకారం వల్ల పెద్దగా పట్టించుకోలేదు.

కొంతకాలానికి అడవిలో తిరుగుతున్న రోచనుడు ఒక అందమైన స్త్రీని చూశాడు. ఆమెను తన భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె ఒక ఋషి కుమార్తె అని, తండ్రి అనుమతి లేకుండా పెళ్లి చేసుకోలేనని చెప్పింది. రోచనుడు ఆమె మాట వినక బలవంతంగా తీసుకెళ్లాడు. ఋషి కోపంతో రోచనుడిని శపించాడు. “మాటలతోనే జీవిస్తావు, ప్రపంచాన్ని సృష్టిస్తావు కానీ ఎవరూ నమ్మరు” అని.

శాపంతో బాధపడుతూ తన తప్పును గ్రహించిన రోచనుడు, క్షమపణ కోసం ఋషిని వెతికి అడవిలో తిరుగుతాడు. చివరికి క్షమాపణ కోసం ఋషిని కలుసుకున్నాడు. ఋషి రోచనుడి భక్తికి మెచ్చి శాపం నుండి విముక్తి కలిగించాడు. కానీ, ఒక భాగం మిగిలిపోయింది – మాటలతో ప్రపంచాన్ని సృష్టిస్తాడు కానీ ఎవరూ నమ్మరు. మిగిలిన శాపం నుండి విముక్తి పొందడానికి తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రామాయణ కావ్య రచనకు ఆదేశించాడు. వైశాఖ పురాణం – 26వ అధ్యాయం (Vaisakha Puranam – Day 26) నందు ఈ క్రింది విధముగా . . .

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||

Vaisakha Puranam – Day 26

వైశాఖ పురాణం – 26 వ అధ్యాయం – వాల్మీకి జన్మ

నారద మహర్షి (Narada Muni) అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవ ముని శ్రుతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను.

తమ ఏదురుగ నున్న మఱ్ఱి చెట్టు కూలుట దాని తొఱ్ఱ నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి ‘ఓయీ! నీవెవరవు? నీకిట్టి దశయేల వచ్చినది. విముక్తియేల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగ జెప్పుమని యడిగెను.

శంఖుడు ఇట్లు అడుగగానే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్ప నారంభించెను. ఆర్యా! నేను ప్రయాగ (Prayag) క్షేత్రమున నుండు బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూప యౌవనములు విద్యా, సంపదలు కలవని గర్వించువాడను. చాలమంది పుత్రులు అహంకారము కలవాడను నాపేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును (Sandhyavandanam) చేసినట్లు నటించెడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్దలేదు. ఇట్లు కొంతకాలము గడచెను.

ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణ ఉత్తముడు వచ్చి మా ఊరిలో నున్నవారికి వైశాఖ వ్రతమును (Vaisakha Vrut), ధర్మములను మున్నగువానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరును కొన్నివేల మంది వైశాఖ వ్రతము నాచరించుచు ప్రాతఃకాల స్నానము, శ్రీహరి పూజ, కథా శ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి (Sri Hari) కథలను మౌనముగ శ్రద్దాసక్తులతో వినుచుండిరి. 

నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోని వారందరికిని ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేఋ ఒకరిని  పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికథా (Harikatha) ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని.

ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని. మరణించితిని. మిక్కిలి వేడిగ ఉన్న నీటిలోను, సీసముతోను నిండి ఉన్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి, ఎనుబది నాలుగు లక్షల జీవరాశుల యందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మఱ్ఱి చెట్టు తొఱ్ఱలో ఆహారములేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని. దైవికముగ నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనై దివ్య రూపమునందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించితిని. 

స్వామీ! మీరు నాకు యే జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును యే విధముగను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా! స్వామీ! సజ్జనులు దయావంతులునగు వారు నిత్యము పరోపకారపరాయణులే కదా! స్వామీ! నాకు సదా ధర్మబుద్ది కలుగునట్లును, విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా, ధనమదము కలవారికి దరిద్రులు మంచినడవడికగల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగ ప్రార్థించుచు నమస్కరించి యట్లే యుండెను.

శంఖ మునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రుని గావించెను. ధ్యాన స్తిమితుడై కొంతకాలము ఉంది వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయీ! వైశాఖమాస మహిమను వినుట వలన శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నియు పోయినవి. నీవు దశార్ణ దేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా (Brahman) జన్మింతువు. వేద శాస్త్రదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల నందు ఇష్టము కలవాడై విష్ణు (Lord Vishnu) ప్రియములగు వైశాఖ ధర్మములన్నిటిని పెక్కు మార్లు చేయగలవు. 

సుఖ దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై గురుభక్తి, ఇంద్రియజయము కలవాడై సదా విష్ణు కధాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వ బంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయనా భయపడకుము. నీకు నా అనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగ గాని, భయమున గాని, కోపమువలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వపాపములును నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములును శ్రీహరి పదమును చేరుదురు సుమా.

ఇట్టి స్థితిలో శ్రద్దా భక్తులతో జితేంద్రియులై జిత క్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలుగదు? శ్రీహరిపై భక్తియే కలిగి సర్వ ధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు పూతనవలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సహవాసము సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మనా సేవింపవలయును. శ్లోకమున దోషములు ఉన్నను శ్రీహరి నామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి ముక్తినందుదురు. ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా!

శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయౌవనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ (Vaikunta) ప్రాప్తినిచ్చును. అట్టి భక్త సులభుని దయాళువును విడిచి మరియెవరిని శరణు కోరుదుము. కావున దయా నిధి జ్ఞానగమ్యుడు, భక్త వత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని (Srimannarayana) శరణు పొందుము. నాయనా వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటిని యధాశక్తిగ నాచరింపుము. జగన్నాధుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములను ఇచ్చును అని శంఖుడు దివ్య రూపధారి నుద్దేశించి పలికెను.

ఆ దివ్య పురుషుడు కిరాతుని జూచి యాశ్చర్యపడి మరల శంఖునితో నిట్లనెను. శంఖమహామునీ! దయాస్వభావముగల నీచే ననుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ యనుగ్రహమున నుత్తమ గతిని పొందగలను. అని పలికి శంఖుని యనుజ్ఞ నంది స్వర్గమునకు (Heaven) పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు నుపచారములను భక్తియుక్తుడై ఆచరించెను.

శంఖ మునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను. బ్రహ్మ ముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్దుడు అగు కిరాతునకు తారకమగు ‘రామా’ అను రెండక్షరముల మంత్రమును ఉపదేశించెను. నాయనా! శ్రీహరి యొక్క ఒకొక్క పేరును అన్ని వేదములకంటె నుత్తమము అట్టి భగవన్నామములన్నిటి కంటె సహస్రనామములుత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటియే సమానము. కావున రామనామముచే (Rama Nama) నిత్యము జపింపుము. వైశాఖధర్మములను బ్రదికియున్నంతవరకు నాచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగ జన్మించి వాల్మీకియని (Valmiki) భూలోకమున ప్రసిద్దినందగలవు.

అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగ ప్రయాణమయ్యెను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారముల నాచరించి కొంతదూరమనుసరించి వెళ్లెను. వెళ్లుచున్న శంఖమునిని విడుచుట  బాధాకరముగ నుండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై యుండెను. అతడు ఆ యడవిలో మనోహరమైన తోటను నాటి నీడను ఇచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. 

మహిమాన్వితములగు వైశాఖ ధర్మముల నాచరించుచుండెను. అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసన కఱ్ఱలు మున్నగువాని ఇచ్చుచు బాటసారులను అనేక విధములుగ సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామ నామమును రాత్రింబగళ్లు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను.

కృష్ణుడను ఒక ముని జితేంద్రయుడై సర్స్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము నాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒకపుట్టగా నయ్యెను. పుట్టలు కట్టినను బాహ్య స్మృతిని విడిచి తపమును ఆచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంత కాలమునకతడు తపమును మానెను. వానిని జూచి నాట్యకత్తెయొకతె మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ (Ramayana) మహా కావ్యము మానవుల సర్వ కర్మబంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది.

శ్రుతకీర్తి మహారాజా! వైశాఖమహిమను వింటివా! దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదులను మున్నగు వానిని దుర్బుద్ధితో అపహరించియు వైశాఖ మహిమవలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందురు. ముక్తిని పొందుదురు.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.

వైశాఖ పురాణం 26 వ అధ్యాయము సంపూర్ణము.

Read more Puranas:

Leave a Comment