వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 13

వైశాఖ పురాణం – 13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము

Vaisakha Puranam - Day 13

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క పదమూడవ అధ్యాయం “అశూన్య శయన వ్రతము” అనే వ్రత విధానమును వివరిస్తుంది. సర్వపాపాలను పోగొట్టే ఈ వ్రతాన్ని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి (Lakshmi Devi) చెప్పాడని, దీన్ని ఆచరించిన వారు సుఖ సంతోషాలతో ఉంటారని ఈ అధ్యాయం తెలియజేస్తుంది. శ్రావణ మాసంలో ప్రారంభించి నాలుగు నెలలు, తరువాత మార్గశీర (Margasira Masam), పుష్య (Pushya Masam), మాఘ (Magha Masam), ఫాల్గుణ మాసాలు(Phalguna Masam), చివరిగా చైత్ర, వైశాఖ, జేష్ఠ, ఆషాఢ మాసాలు ఇలా మొత్తం ఒక సంవత్సరం పాటు ఆచరించే ఈ వ్రతంలో భార్యతో కలసి పూజలు చేసి, నియమాలు పాటించాలి.

ప్రతిరోజు రాత్రి ఒకే పరుపులో కాకుండా, ఒక రోజు భార్యతో, మరొక రోజు ఒంటరిగా నిద్రించడం ఈ వ్రతం యొక్క ప్రధాన నియమం. మాంసాహారం (Non-vegetarian), మద్యపానం(Liqueur) మాని, శుచిగా ఉండి, ఉదయం సాయంత్రాలు పూజలు చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా దంపతుల మధ్య అనుబంధం బలపడుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, దుష్ట శక్తుల బారి నుండి రక్షణ లభిస్తుంది, మనస్సు శాంతంగా ఉంటుంది. క్రమశిక్షణతో కూడిన ఈ అశూన్య శయన వ్రతం ద్వారా పురుషులు జీవితంలో సుఖ సంతోషాలను అనుభవించవచ్చు. వైశాఖ పురాణం – 13వ అధ్యాయం (Vaisakha Puranam – Day 13) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 13

వైశాఖ పురాణం – 13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము

నారదమహర్షి (Narada Muni) అంబరీషమహారాజుతో నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు “మునివర్యా ! మన్మధుని (Manmatha) భార్య రతిదేవి (Rati Devi) అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకా వ్రతవిధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయయుంచి నాకా వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమున చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగు వానిని గూడ చెప్ప కోరుదునని అడిగెను.

అప్పుడు శ్రుతదేవుడు మహారాజా వినుము. అశూన్యశయనమను వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు (Srimannarayana) లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడు అగు విష్ణువు లక్ష్మీ సమేతముగ ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వ శుభములనిచ్చును. ఈ వ్రతము నాచరించి గృహస్థ ధర్మముల పాటించిన వారు సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలనందుదురు. అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును?

శ్రావణమాసమున (Sravana Masam) శుద్ద విదియయందీ వ్రతము నాచరింపవలెను. ఈ వ్రతమును ఆచరించువారు నాలుగు మాసములును హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయును. పారణ దినమున లక్ష్మీ సమేతుడగు శ్రీమహావిష్ణువును (Lord Vishnu) అర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనామ్ ఈయవలెను. బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజింపవలెను. శయ్యా దానములు, వస్త్ర దానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగ శ్రావణ మాసము మొదలు నాలుగు మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగ పూజింపవలెను.

తరువాత మార్గశీరము, పుష్యము, మాఘము, పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమెతుడగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాడము అను మాసములందు శ్రీహరిని (Sri Hari), రుక్మిణీ (Rukmini) సహితముగ ఎఱ్ఱని పుష్పములతో పూజింపవలయును. భూదేవసహితుడు సనందనాదిముని సంస్తుతుడు పరిసుద్దుడగు శ్రీమహావిష్ణువు నర్చింపవలెను. ఈ విధముగ చేసి ఆషాఢ శుద్ధ విదియ నందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే (Ashtakshari Mantra) హోమము చేయవలయును.

మార్గశిరము మున్నగు నాలుగు మాసముల పారణయందు విష్ణుగాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసముల యందు పురుష సూక్త (Purusha Suktam) మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాదిమాస చతుష్టయమున పూజ, హోమము భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను, శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగనే దానమీయవలెను. శ్రీకృష్ణ ప్రతిమను (Lord Krishna) మార్గశీర్షాది మాస చతుష్టయ పూజా మధ్యమున దానమీయవలెను. చైత్రాదిమాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యధా శక్తిగ వస్త్ర అలంకారములును దక్షిణతో నీయవలయును. నేతిలో వండిన బూరెలు ఒకొక్కనికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును, పరుపును వుంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమనుంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను.

“లక్ష్మ్యా అశూన్యశయనం యధా తవజనార్ధన

శయ్యామమా ప్యశూన్యా స్యాద్దావేనానేవ కేశవ”

అని దానమంత్రమును చెప్పి దానముచేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోకభావము స్వామీ ! జనార్దనా నీ శయ్య లక్ష్మీసహితమై ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై యీ శయ్యాదానముచేనుండుగాక.

ఈ వ్రతమును, భార్యలేని పురుషుడును, విధవాస్త్రీయును, దంపతులును యెవరైనను చేసికొనవచ్చును. శ్రుతదేవమహారాజా ! నేను నీకీ వ్రతమును పూర్తిగ వివరించితిని. ఈ వ్రతము నాచరించిన శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహము పొంది జనులు అందరును ఆయురారోగ్యములతో భోగ భాగ్యములతో శుభ లాభములతో సంతుష్టులై ఉందురు. కావున యధాశక్తిగ భక్తి శ్రద్దలతో నీ వ్రతము నాచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా ! నీవడిగిన అశూన్య శయనవ్రతమును వివరించితిని. నీకు మరేమి చెప్పవలయును? అని శ్రుతదేవముని శ్రుతకీర్తి మహారాజుతో ననెను.

శ్రుతకీర్తి మహారాజు మహామునీ ! వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానములను ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను.

వైశాఖపురాణం పదమూడవ అధ్యాయం సంపూర్ణం

Read more Puranas:

Leave a Comment