Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము మూడవ రోజు

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము, శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఈ దివ్య ప్రబంధంలో మొదటి ఐదు పాశురాలు వ్రత విధానాన్ని వివరించగా, తదుపరి పాశురాలలో నందగోపుడు, యశోద (Yashoda), బలరాముడు (Balarama) మరియు శ్రీకృష్ణ (Lord Sri Krishna) నీలాదేవులను మేల్కొలిపే ఘట్టాలు ఉన్నాయి. చివరగా, భగవంతుని సభాస్థలిలో కొలువుదీరమని ప్రార్థిస్తూ, కేవలం ప్రాపంచిక కోరికల కోసం కాకుండా, సర్వకాల సర్వావస్థలయందు స్వామికి కైంకర్యం (సేవ) చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తిరుప్పావైలోని అంతరార్థం. తిరుప్పావై నందు కల మూడవ పాశురము ఈ క్రింది విధముగా . . .
Thiruppavai Pasuram – Day 3
తిరుప్పావై 3వ రోజు పాశురము
ఆండాళ్ తిరువడిగలే శరణం:
లోకములో విషయాలు విడుచుట, స్వీకరించుట ఒకేరీతిగావుండును. అవి మన కర్మలను అనుసరించి పట్టినాను దుఃఖమును పొందుదురు. వదిలినాను దుఃఖమును పొందుదురు. బార్యా, బిడ్డలు ఉన్ననూ దుఃఖమే! వదిలినాను దుఃఖమే! దానికి కారణము వాని వల్ల కల్గిన సుఖము గాని దుఃఖము గాని విషయము వల్ల జనించునవి కాకపోవుటఏ! కావునా పట్టుట విడుచుట రెండు సమానమే! కావున భాగావద్విశాయము సహజానందము, అదే పరమానందము అని తెలిసి ఇతరములు విడిచి వేయుదురు. ఆ విషయాలు తెలిసే ఈ వ్రతములో ఏమిచేయవలేనో రెండవ పాశురములో వివరించారు.
మరి వ్రతనియమాలు తెలుసుకున్నాము, మరి ఆ వ్రతఫలితములు ఎలావుండాలో ఈ మూడవ పాశురములో వివరించారు.
పాశురం:
ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్
తీఙ్గిన్ఱి నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు
ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప
తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
వాఙ్గ- క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
నీఙ్గాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్.
Credits: @BharatiyaSamskruthi
భావము:
ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ (Sri Krishna) సంశ్లేషమే! ఐనా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి (Bali Chakravarthi) నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్నాచరిస్తే – దుర్భిక్షము అసలు కలుగనే కల్గదు. నెలకు మూడు వర్షములు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే – కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోదాదేవి (Godadevi).
3 వ మాలిక:
ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీని నాచరించుటవలన వ్రతాన్ని ఆచరించనవారికే కాక లోకమునకంతకును లాబించుము. ఇది ఇహ పరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మకదా! మరి విశేషంగా ఆరాధించిన వారికేకాక లోకానికంతకూ కల్యాణాన్ని కల్గించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి.
(మోహనరాగము – ఆదితాళము – Adi Talam)
ప…హరి తిరువడులను కొలిచెదము తిరు నామములనె పాడెదము
అ.ప..పెరిగి లోకముల గొలిచిన పాదము పరసాధనమని తెలిసి పాడుదము
1 చ…వ్రతమును చేయగ స్నానమాడెదము ప్రతి నెల ముమ్మరు కురియు వర్షములు
వితత సస్యముల నెగయు మీనములు మత్తిలి కలువల సోలు భ్రమరముల.
2 ఛ…బలసిన గోవుల పొదుగుల తాకగ కలశముల క్షీరధారలు కురియగ శ్రీలెయెడతెగని ప్రసారములో యన ఇల సిరులదూగు చేతుము వ్రతమును.
ఆండాళ్ తిరువడిగలే శరణం..శరణం.
Also Read
- Thiruppavai Pasuram Day 1 | తిరుప్పావై పాశురము – 1వ రోజు
- Thiruppavai Pasuram – Day 2 | తిరుప్పావై పాశురము 2వ రోజు
- Thiruppavai Pasuram – Day 3 | తిరుప్పావై పాశురము – 3వ రోజు
- Thiruppavai Pasuram – Day 4 | తిరుప్పావై పాశురము – 4వ రోజు
- Thiruppavai Pasuram – Day 5 | తిరుప్పావై పాశురము – 5వ రోజు
- Thiruppavai Pasuram – Day 6 | తిరుప్పావై పాశురము – 6వ రోజు





