తిరుప్పావై మొదటి పాశురము, ధనుర్మాస విశిష్టత

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము. శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఈ దివ్య ప్రబంధంలో మొదటి ఐదు పాశురాలు వ్రత విధానాన్ని వివరించగా, తదుపరి పాశురాలలో నందగోపుడు, యశోద (Yashoda), బలరాముడు(Balarama) మరియు శ్రీకృష్ణ (Lord Sri Krishna) నీలాదేవులను మేల్కొలిపే ఘట్టాలు ఉన్నాయి. చివరగా, భగవంతుని సభాస్థలిలో కొలువుదీరమని ప్రార్థిస్తూ, కేవలం ప్రాపంచిక కోరికల కోసం కాకుండా, సర్వకాల సర్వావస్థలయందు స్వామికి కైంకర్యం (సేవ) చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తిరుప్పావైలోని అంతరార్థం. తిరుప్పావై నందు కల మొదటి పాశురము ఈ క్రింది విధముగా . . . .
Importance of Dhanurmasam
ధనుర్మాస విశిష్టత
సుసౌరమానం, చాంద్రమానం అనేవి మనం పాటించే కాలమానాలు. చాంద్రమానంలో చంద్రుని సంచారాన్ని అనుసరించి మాసముల పేర్లు నిర్ణయించ బడతాయి. చంద్రుడు పూర్ణిమ (Pournami) నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసముగా వ్యవహరిస్తారు. చిత్త నక్షత్రంలో ఉంటే చైత్ర మాసమని (Chaitra Masam), విశాఖలో ఉంటే వైశాఖ మాసం (Vaishaka Masam), మృగశిరలో ఉంటే మార్గ శీర్షమని అంటారు.
సౌరమానం అనగా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసంగా వ్యవహరిస్తారు. మేషరాశి లో ప్రవేశిస్తే మేషమాసమని, వృషభ రాశిలో ప్రవే శిస్తే వృషభ మాసమని, ధనుర్రాశిలో (Dhanu Rashi) ప్రవేశిస్తే ధనుర్మాసంగా ప్రతీతి. ధనుర్మాసం తరువాత సూర్యుడు మకర రాశిలో (Makhara Rashi) ప్రవేశించినపుడు ఉత్త రాయణ పుణ్యకాలం, అలాగే కర్కాటక రాశిలో ప్రవేశించినపుడు దక్షిణాయన (Dakshinayana) పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
దేవతలకు దక్షిణాయణం రాత్రి, ఉత్తరాయణం (Uttarayanam)పగలు. మకర మాసం కంటే ముందు వచ్చు ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం వంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజాధికములు అధిక ఫలము నిచ్చును. వాటికి కావాల్సిన పూర్వ రంగం ధనుర్మాస వ్రతం – Dhanurmasa Vrat. పరిశుద్ధ మైన మనస్సు, పరమాత్మ యందు భక్తి, పరోపకార వాంఛ, లోకకల్యా ణం ఇవన్నీ కాంక్షిస్తూ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. దీనిలో మరొక రహస్యం ఏమనగా వేదం ప్రణ వం ధనువు ద్వారా ధనుర్మాస విశిష్టతను తెలియజేసింది.
ధనువు అంటే ఓంకారం. ధనువులో మూడు వంపులు ఉంటాయి. వాటిని కలిపే ఒక తాడు ఉంటుంది. ప్రణవంలో మూడు వర్ణాలు ఉంటాయి. అకార, ఉకార, మకారాలు. ఆ మూడింటిని కలిపే ది జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, పరిజ్ఞానం. ధనువులో ఒక చివర జీవాత్మ, మరొక చివర పరమాత్మ ఆ రెండింటిని కలిపే తాడు ప్రకృతి లేక అమ్మ (లక్ష్మీదేవి). ఇలా జీవాత్మ పరమాత్మను చేరు సాధనాన్ని తెలిపే మాసం ధనుర్మాసం. ఈ సమయంలో చాంద్రమా నం ప్రకారం మార్గశిరం. పరమాత్మను చేరుటకు ఉత్తమమైన దారిని చూపునది మార్గశిరం. తరువాత వచ్చే మాసం పుష్యం (Pushaya Masam). పుష్యం అంటే ఆనందం. పర మాత్మను చేరే దారిని తెలుసుకున్న వారు పుష్య పూర్ణు లు కాగలరు. ఈ నిగూఢ తత్వాన్ని తెలిపే మాసం ధనుర్మాసం.
తిరుప్పావై సారము:
సంసార దు:ఖములను అనుభవించుచున్న జీవులపై దయతో శ్రీమన్నారాయుణుడు (LordVishnu) అమ్మవారికి (లక్ష్మి – Goddess Lakshmi) జీవులు ముక్తిని పొందు సులభోపాయము లను మూడింటిని ఉపదేశించెను అవి శ్రీహరి నామసంకీర్తనము, శరణాగతి, పుష్పా ర్చన. ఈ మార్గములను బోధించి జీవులను తరింప చేయదలచిన అమ్మవారు శ్రీ విష్ణుచిత్తులకు తులసీ వనమున లభించినది. శ్రీవిష్ణుచిత్తులు ఈమెకు గోదా అని నామకరణం చేసిరి. యుక్త వయస్సు రాగానే గోదాదేవి శ్రీవటపత్ర శాయిని భర్తగా పొందదలచి, అట్లు పొందుటకు పూర్వము గోపికలు వ్రతమును ఆచరిం చిరని విని తానావ్రతమును అనుకరించి ఒక వ్రతము చేయదలచి 30 పాశురముల రూపంలో వ్రతమును రచించెను. దాని పేరే ‘తిరుప్పావై’.
ఈ తిరుప్పావై మూడు భాగములుగా కలదు:
మొదటి 5 పాశురములు ఉపోద్ఘాతము. తరువాతి పాశురములలో నందగోపుని భవన పాలకుని, ద్వారపాలకుని, మేల్కొలిపి లోనికి వెళ్ళి నందుని, యశోదను, శ్రీకృష్ణభగవానుని, బల రాముని మేల్కొలుపుట, తరువాత నీలాదేవిని (NeelaDevi) మేల్కొలుపుట, తరువాత శ్రీకృష్ణుని నీలాదేవిని ఇరువురిని మేల్కొలుపుట, శ్రీకృష్ణ భగవానుని సభా స్థలిలో వేంచేసి సింహాసనాసీనుని కమ్మని ప్రార్థిం చుట, స్వామి వేంచేయగానే మంగళాశాసనము చేయు ట, తరువాత తాము వచ్చిన పనిని నివేదించి తమకు సర్వ కాల సర్వావస్థల యందు కైంకర్య మును చేయు భాగ్యమును ప్రసాదించ మని ప్రార్థించుట, ఇది తిరుప్పావై సారము.
Thiruppavai Pasuram Day 1
తిరుప్పావై పాశురము – 1వ రోజు
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
Credits: @BharatiyaSamskruthi
నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం
“మార్గళి త్తింగళ్” మార్గశిర్షం మంచి మాసం, ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే, అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షినాయిణం వారికి రాత్రి అయితే ఉత్తరాయిణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షినాయిణం నుండి ఉత్తరాయిణంకు మారుతాడు, అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం.
సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. “మది నిఱైంద నన్నాళాల్” చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం, చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. “నీరాడ ప్పోదువీర్ పోదుమినో” స్నానం చేయటానికి వెల్దాం! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. “నేరిళైయీర్” భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే.
“శీర్ మల్గుం ఆయ్ ప్పాడి” పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని “చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్” సంపన్నులైన గోప పిల్లల్లా, మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం, ఏ భయమూ అవసరం లేదు. “కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్” పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ, ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా!
“ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం” మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందంచే పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. “కార్మేని” నల్లని మేఘంలాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కల్గి, “చ్చెంగణ్ ” వాత్సల్యం కల్గినవాడు. “కదిర్మదియం పోల్ ముగత్తాన్” చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గి నవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు.
“నారాయణనే నమక్కే పఱైతరువాన్” నారాయణ అనే మత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా “పారోర్ పుగళప్పడింద్” ఫలం సాక్షాత్తు పరమాత్మే, ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.
నారాయణ మంత్రం – Narayana Mantra
ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతంలేనట్టుగా, మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయనగుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం.
ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి “విష్ణు – Vishnu”, “వాసుదేవ – Vasudeva” మరియూ “నారాయణ – Narayana”. విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు-ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెందు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు, ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది, ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది, ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది.
నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం, నారములు అంటే సఖల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దంలోని అయణ అనే పదాని అర్థం ఆధారం. ఈ సఖల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు, లోపల-బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం.
ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి..
ఒకటి తత్పురుష, రెండవది బహువ్రిహి సమాసాలు.
తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది.
అర్థాత్ ఆయన లోపల మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూడా ఉంటాడు కనక అయన పరుడు- అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు, వారిలోని దోషాలను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు, దోషాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది, ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది.
అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మంత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్య మంత్రంగా అందించింది.
ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుండి. శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి, నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది, దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.
ఆండాళ్ తిరువడిగలే శరణం..శరణం..
Also Read
- Thiruppavai Pasuram Day 1 | తిరుప్పావై పాశురము – 1వ రోజు
- Thiruppavai Pasuram – Day 2 | తిరుప్పావై పాశురము 2వ రోజు
- Thiruppavai Pasuram – Day 3 | తిరుప్పావై పాశురము – 3వ రోజు
- Thiruppavai Pasuram – Day 4 | తిరుప్పావై పాశురము – 4వ రోజు
- Thiruppavai Pasuram – Day 5 | తిరుప్పావై పాశురము – 5వ రోజు
- Thiruppavai Pasuram – Day 6 | తిరుప్పావై పాశురము – 6వ రోజు





