Shravana Masa Mahatmyam Day – 28 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 28

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాంద పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో ఈశ్వరుడు అగస్త్య నక్షత్రం ఉదయించినప్పుడు చేయవలసిన “అగస్త్యార్ఘ్య విధి” గురించి వివరించాడు. రాత్రి, పగలు సమానంగా ఉండే రోజు నుండి ఏడు రోజుల పాటు ఈ అర్ఘ్య ప్రదానం చేయాలని తెలిపాడు. ఈ వ్రతంలో అగస్త్యుడి ప్రతిమను బంగారంతో చేయించి, పంచరత్నాలతో అలంకరించి, అనేక రకాల భక్ష్యాలతో పూజించాలి. మోకాలిపై కూర్చుని, అగస్త్యుడిని, ఆయన భార్య లోపాముద్రను ధ్యానిస్తూ శ్రద్ధగా అర్ఘ్యం సమర్పించాలి. “కాశపుష్పప్రతీకాశ” వంటి మంత్రాలను చదువుతూ, అగ్నిలో ఆహుతులు ఇచ్చి, అగస్త్యుడిని శరణు వేడుకోవాలని శివుడు సూచించాడు. ఈ విధంగా పూజించిన తర్వాత, పూజా సామగ్రిని వేదజ్ఞానం గల పేద బ్రాహ్మణుడికి దానం చేయాలి.

ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను శివుడు వివరించాడు. ఏడు సంవత్సరాలు నిష్కామంగా ఈ వ్రతం చేస్తే జన్మరాహిత్యం లభిస్తుందని, సకామంగా చేస్తే చక్రవర్తిత్వం, రూప సౌందర్యం లభిస్తాయని పేర్కొన్నాడు. బ్రాహ్మణులు సర్వ శాస్త్రాలలో పండితులవుతారని, క్షత్రియులు భూ పాలకులవుతారని, వైశ్యులు ధనధాన్య సంపదలు, శూద్రులు ఆరోగ్యం పొందుతారని తెలియజేశాడు. స్త్రీలు ఆచరిస్తే సౌభాగ్యం, సంతానాభివృద్ధి, ఇంట్లో సుఖసమృద్ధి లభిస్తాయని చెప్పాడు. ఈ వ్రతం ఆచరించిన దేశంలో సుభిక్షం ఉంటుందని, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు ఉండవని పేర్కొన్నాడు. ఈ చరిత్రను చదివినా, విన్నా సమస్త పాపాల నుండి విముక్తులై, హంసల రథంపై స్వర్గాన్ని చేరుకుంటారని శివుడు సనత్కుమారునికి చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు.

🍃🌷అగస్త్యార్ఘ్యవిధి:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

🌻ఈశ్వరుడు చెప్తున్నాడు:

శ్రావణమాసంలో ఆచరించాల్సిన అగస్త్యార్ఘ్యమనే ఉత్తమ విధిని తెలియజేస్తాను. అగస్త్య నక్షత్ర ఉదయానికి ముందే కాలనియమాన్ని తెలుసుకోవాలి. రాత్రి – పగలు సమానకాలం ఉండే రోజు నుండి ఏడురోజుల పాటు అర్ఘ్యప్రదానం (Arghya Pradanam) చెయ్యాలి.

ఏ రోజు నుండి అర్ఘ్యమివ్వడం ప్రారంభిస్తారో ఆ రోజు ప్రాతఃకాలంలో తెల్ల నువ్వులతో స్నానం చేసిన గృహస్థు, తెల్లని వస్త్రాన్ని, తెల్లని పూలమాలను ధరించి, బంగారం మొదలైన ధాతువులతో తయారై, పంచరత్న (Pancharatam) ఖచితమై, నేతి పాత్రతో కూడినదై, మోదకాలు మొదలైన అనేక రకాల భక్ష్యపదార్థాలు, పండ్లతో పుష్పమాల- వస్త్రంతో అలంకరింపబడిన పూర్ణమైన రాగిపాత్రను దానిపై పెట్టి, ఆ పాత్రపై అగస్త్యుని (Agastya Muni) బంగారు ప్రతిమను స్థాపించాలి. ఆ ప్రతిమ బొటన వేలంత పరిమాణం కలదై, నాలుగు చేతులతో, స్థూలకాయుడై పొడవైన భుజాలతో సుందరుడై, శాంత భావంతో నున్న జటామండలధారి, కమండలం పట్టుకుని, అనేక మంది శిష్యులతో కూడినవాడై, చేతిలో దర్భలను (Dharbha), అక్షతలను ధరించి లోపాముద్రా సమేతంగా దక్షిణాభిముఖుడై ఉండాలి. దాని యందు అగస్త్యుని ఆవాహన చేసి గంధం, పువ్వులు మొదలైన షోడశోపచారాలతో, నైవేద్యాలతో పూజించి, దధ్యోదనం సమర్పించి అర్ఘ్యప్రదానం చెయ్యాలి.

ముందుగా బంగారం, వెండి, రాగి లేదా ఇత్తడి పాత్రలో నారింజ, ఖర్జూరం, కొబ్బరి, గుమ్మడి, పొట్లకాయ, అరటి, దానిమ్మ, బెండకాయ, నిమ్మ, నల్లకలువ, పద్మం, దర్భలు, దూర్వాలు, మరొక ఏడురకాల పండ్లు, పువ్వులు, ఏడు రకాల ధాన్యాలు పాత్రయందుంచి దానిని పూజించి, మోకాలిపై కూర్చుని శిరస్సు వరకు ఆ పాత్రను ఎత్తి అగస్త్య మహర్షిని (Agastya Maharshi) ధ్యానిస్తూ శ్రద్ధాభక్తులతో ఈ మంత్రసదృశ శ్లోకాలతో అర్ఘ్యమివ్వాలి:

కాశపుష్పప్రతీకాశ వహ్నిమారుతసమృవ, మిత్రావరుణయోః పుత్ర కుమ్భయోనే నమోస్తుతే.

🌷లోపాముద్రా దేవి అర్ఘ్యశ్లోకం:

తరువాత అర్ఘ్యమిచ్చిన మంత్రాలతో ఎనిమిది వేలు లేదా నూట ఎనిమిది. ఆహుతులతో హోమం చేసి అగస్త్యుని శరణు వేడి ఇలా ప్రార్థించాలి.

అనంతరం అగస్త్యుని విసర్జన చేసి, వేదాంగవేత్తయైన బీద బ్రాహ్మణ గృహస్థుకు పదార్థాలన్నిటినీ అర్పిస్తూ ఇలా ప్రార్థించాలి.

ఈ విధంగా దానమిచ్చి పూర్వం చెప్పబడిన మంత్రాలను జపం చెయ్యాలి. ఈ విధంగా ఏడు రోజులు చేసి ఏడవ రోజున తెల్లని ఆవును సకల భూషణాదులతో అలంకరించి దానం చెయ్యాలి. ఏ కోరిక లేకుండా ఏడు సంవత్సరాలు ఇలా ఆచరిస్తే జన్మరాహిత్య స్థితి కలుగుతుంది. సకామంగా చేస్తే రూప లావణ్యాలతో కూడిన చక్రవర్తిత్వం లభిస్తుంది. 

బ్రాహ్మణుడు ఆచరిస్తే సకల వేద శాస్త్రాలలో (Veda Shasthra) విశారదుడవుతాడు. క్షత్రియులైతే సముద్రాంతం వరకు వరకు గల భూమికి పాలకులవుతారు. వైశ్యులైతే గో- ధన – ధాన్యాది సంపదలు పొందుతారు. శూద్రులు ఆచరిస్తే అత్యధిక ధనం, ఆరోగ్యం, సత్యప్రాప్తి కలుగుతుంది. స్త్రీలు ఆచరిస్తే వారికి సౌభాగ్యం, పుత్రుల అభివృద్ధి, ఇంటిలో సకల వస్తు సమృద్ధి కలుగుతుంది. పూర్వసువాసినులకు పుణ్యం పెరుగుతుంది. కన్య ఆచరిస్తే రూపగుణ సంపన్నుడైన భర్తను పొందుతుంది. 

ఏ దేశంలో ఈ విధంగా అగస్త్యార్ఘ్యవిధి చెయ్యబడుతుందో ఆ దేశంలో వర్షాలు కోరినప్పుడు కురిసి సుభిక్షంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు కలుగవు. వ్యాధులు ఉండవు.

ఈ అగస్త్వార్థ ప్రదాన చరిత్రను పఠించినవారు, విన్నవారు సకల పాపాల నుండి ముక్తులై భూలోకంలో దీర్ఘాయువుతో జీవించి, హంసలు పూన్చిన రథంలో స్వర్గాన్ని చేరుకుంటారు. జీవన కాలమంతా ఈ వ్రతాన్ని నిష్కామభావంతో చేస్తే ముక్తిని పొందుతారు.

♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరువదిఎనిమిదవ అధ్యాయము సమాప్తము.     

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

తదుపరి ఇరవై తొమ్మిదవ అధ్యాయం >>

Also Read

Leave a Comment