Sashti Devi Stotram | షష్ఠీ దేవి స్తోత్రం

షష్ఠీ దేవి స్తోత్రం – సంతాన సౌభాగ్యాలకు ప్రతీక

Sashti Devi Stotram

పురాణాల ప్రకారం ప్రతి ఒక్క దేవతా ప్రత్యేకమే. వివిధ సందర్భాలలో వివిధమైన దేవతల అవతారాన్ని, వారి దీవెనలను పొందడానికి వృతాలు, ప్రార్థనలు, స్తోత్ర పఠనం చేయడం ఆనవాయితీ. అందున షష్టిదేవి విశిష్టత ప్రతేకమైనది. సంతానం, వంశాభివృద్ధి కొరకు “షష్ఠీ దేవి స్తోత్రం – Sashti Devi Stotram” పఠన పూర్వికులనుండి ఆచారంగా ఉన్నది. షష్ఠీ దేవి సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన దేవసేనకు ప్రతిరూపమే ఈ షష్ఠీ దేవి గా చెప్పబడుతుంది. వేల సంవత్సరాలుగా పురాణాలలోనూ, శాసనాలలోను షష్ఠీ దేవి ప్రస్తావన విశేషముగా కనిపిస్తుంది.

షష్ఠీ దేవి స్తోత్రం యొక్క నిర్మాణం

  1. ధ్యానం: స్తోత్రం ప్రారంభంలో దేవిని ధ్యానించే విధానాన్ని వివరిస్తుంది. దేవిని అందమైన ఆభరణాలతో అలంకరించబడిన, కరుణామయిగా, సకల కళ్యాణాలను ప్రసాదించే దేవతగా ధ్యానించాలని చెప్పబడింది.
  2. స్తోత్రం: ఈ భాగంలో దేవిని వివిధ నామాలతో స్తుతిస్తారు. ఆమెను సృష్టి, స్థితి, లయలకు కారణమైన దేవతగా, సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతగా, కష్టాలను తొలగించే దేవతగా వర్ణిస్తారు.
  3. ఫలశ్రుతి: ఈ భాగంలో ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల లభించే ఫలితాలను వివరిస్తారు.

భూమాత యొక్క ఆరవ అవతారము కావున దేవిని షష్ఠీ దేవిగా పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి (కుమార స్వామి – Kumara Swamy) అర్ధాంగిగా “దేవసేన – Devasena” అని కూడా పిలుస్తారు. షష్ఠీ దేవికు పిల్లలంటే చాలా ఇష్టం. 

షష్టి దేవి ఎల్లప్పుడూ పిల్లల పక్కనే ఉండి వారిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. పిల్లల ఆరోగ్యము, మంచి భవిష్యత్తు కొరకు షష్ఠీ దేవి స్తోత్రం చదివిన, చెవులారా విన్న ఆ దంపతుల సంతానముచే ఆశిర్వదించబడుతారని నమ్మకము. 

బంగారు మేనిఛాయలో మెరిసిపోయే షష్ఠీ దేవి ఇతర దేవతలకంటే చాలా భిన్నంగా ఎల్లప్పుడూ చేతియందు పిల్లలతో, తన వాహనమైన పిల్లితో దర్శనమిస్తుంది షష్ఠీ దేవి. కొన్ని తెగల వారు దేవిని గ్రామదేవతగా, సాలిగ్రామం, మట్టికుండగా, పూర్ణకుంభంగా, అరటి చెట్టుగా వివిధ రూపాలలో షష్ఠీ దేవి (Sashti Devi) ని ఆరాదిస్తారు. 

షష్ఠీ దేవి స్తోత్రం స్తుతిస్తే కోరిన సంతానం లభిస్తుందన్నది నమ్మకం. సంతానం జన్మించే సమయంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా, సంతానం పెరిగి పెద్దయ్యేదాకా కూడా వారికీ ఎలాంటి అనారోగ్యమూ కలుగకుండా ఆశీర్వదిస్తుంది. సంతానం కలిగిన ఆరో రోజున షష్ఠీ దేవికి ప్రత్యేక పూజలను ఆచరిస్తారు.

Sashti Devi Stotram ముగింపు 

షష్ఠీ దేవి స్తోత్రం (Sashti Devi Stotram)న్ని పఠించడం ద్వారా, పక్షంలో వచ్చే ఆరో రోజున వచ్చే షష్ఠి తిథి (Shashti Tithi) రోజున ఆమెను పూజించడం ద్వారా ప్రసన్నము కలుగుతుందని నమ్మకము. సంతానము, సంతానపు ఆరోగ్యం, పంటలు, ధనం సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతారు. గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు ఆరవ రోజునుండి స్తోత్ర పఠన ఉపయోగము. పిల్లలు కలుగని దంపతులకు షష్ఠీ దేవి స్తోత్రం వరం లాంటిది. విశేషముగా ఉత్తరాదిన ఒడిషా (Odisha), బెంగాల్‌ (Bengal) వంటి ప్రాంతాలలో షష్ఠీ దేవి ఆరాధన ప్రాచుర్యంలో ఉన్నది. 

ధ్యానం |

శ్రీమన్మాతరమంబికాం విధిమనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయదాం సత్పుత్ర సౌభాగ్యదాం |
సద్రత్నాభరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షష్ఠాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే ||

షష్ఠాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం |
శ్వేతచంపకవర్ణాభాం రక్తభూషణభూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనా పరాం భజే ||

స్తోత్రం |

నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః |
శుభాయై దేవసేనాయై షష్ఠీ దేవ్యై నమో నమః || 1 ||

వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః |
సుఖదాయై మోక్షదాయై షష్ఠీ దేవ్యై నమో నమః || 2 ||

సృష్ట్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః |
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః || 3 ||

సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః |
బాలాదిష్టాతృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః || 4 ||

కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం |
ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ఠీ దేవ్యై నమో నమః || 5 ||

పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు |
దేవరక్షణకారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః || 6 ||

శుద్ధసత్త్వస్వరూపాయై వందితాయై నృణాం సదా |
హింసాక్రోధవర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః || 7 ||

ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి |
మానం దేహి జయం దేహి ద్విషో జహి మహేశ్వరి |
ధర్మం దేహి యశో దేహి షష్ఠీ దేవీ నమో నమః || 8 ||

దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే |
కళ్యాణం చ జయం దేహి షష్ఠీ దేవ్యై నమో నమః || 9 ||

ఫలశృతి |

ఇతి దేవీం చ సంస్తుత్య లభేత్పుత్రం ప్రియవ్రతం |
యశశ్వినం చ రాజేంద్రం షష్ఠీ దేవి ప్రసాదత ||

షష్ఠీ స్తోత్రమిదం బ్రహ్మాన్ యః శృణోతి తు వత్సరం |
అపుత్రో లభతే పుత్రం వరం సుచిర జీవనం ||

వర్షమేకం చ యా భక్త్యా సంస్తుత్యేదం శృణోతి చ |
సర్వపాపాత్వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే ||

వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం |
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః ||

కాక వంధ్యా చ యా నారీ మృతపత్యా చ యా భవేత్ |
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్ఠీ దేవీ ప్రసాదతః ||

రోగ యుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్ |
మాసేన ముచ్యతే రోగాన్ షష్ఠీ దేవీ ప్రసాదతః ||

జయ దేవి జగన్మాతః జగదానందకారిణి |
ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠీ దేవతే ||

శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం సంపూర్ణం ||

Also Read

Credits: @rajshrisoul

Leave a Comment