సంకట నాశన గణేశ స్తోత్రం: సంకష్టాలను తొలగించే అద్భుతమైన మార్గం
సంకట నాశన గణేశ స్తోత్రం – Sankata Nasana Ganesha Stotram అనగా సర్వ సంకష్టాలను, సమస్యలను దూరం చేయగల శ్రేష్ఠమైన స్తోత్రం. అనేక సమస్యలను అధిగమించడానికి మరియు అన్ని పనులలో విజయం సాధించడానికి శ్రీ వినాయకుడి (Vinayaka) ఆరాధన ప్రముఖమైన పాత్ర కలదు. అంతే కాకుండా ప్రతి శుభకార్యాలకు మరియు శుభారంభాన్ని మొదటగా శ్రీ గణేశుని (Ganesh Ji) ప్రార్థనతో ఆరంభం అవుతుంది. శ్రీ మహా గణపతిని (Maha Ganapati) ఆరాదించేందుకు వివిధమైన అనేక స్త్రోత్రాలు కలవు. అందులో ఈ స్తోత్రం కూడా ఒక భాగం. అంతే కాకుండా సంకష్టి చతుర్థి (Sankashti Chaturthi)నాడు ఈ స్తోత్రం పఠిస్తారు.
స్తోత్రం యొక్క ప్రాధాన్యత
సంకట నాశన గణేశ స్తోత్రం నారద పురాణం నుండి సంగ్రహించి బడ్డది. ఈ స్త్రోత్రాన్ని నారద మహర్షి (Narada Maharshi) స్వయముగా పలికినట్టుగా ఈ స్తోత్రం నందు చెప్పబడినది. సంకట నాశన గణేశ స్తోత్రం సరళతతో కుడి అపురూప శక్తి కలిగి ఉంటుంది. ఈ స్తోత్రం చాలా చిన్నదిగానూ, సులభంగా నేర్చుకోవచ్చు. వినాయకుడి అనేక రూపాలు మరియు లక్షణాలను స్తుతిస్తూ, ఆయన దివ్యత్వాన్ని ధ్యానించవచ్చు.
స్తోత్రం యొక్క ప్రయోజనాలు
సంక్షిప్తంగా ఉన్నప్పటికీ, సంకట నాశన గణేశ స్తోత్రం పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.
- విఘ్న నివారణ: ఈ స్తోత్రం యొక్క ప్రధాన ప్రయోజనం విఘ్న నివారణ. ఏదైనా నూతన కార్యాన్ని ప్రారంభించినా, కొనసాగుతున్న పనిలో అడ్డంకులు ఎదురవుతున్నా, ఈ స్తోత్రం పఠన వల్ల వినాయకుడి ఆశీస్సులు పొంది, అన్ని కార్యాలు సాఫీగా జరిగేలా చేసుకోవచ్చు.
- మనశ్శాంతి: సిద్ది వినాయకుడు బుద్ధి మరియు వివేకానికి దేవుడు. ఈ స్తోత్రం పఠించడం ద్వారా, మీరు శాంతమైన మనసును పొంది, మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా వినాయకుడు అనుగ్రహిస్తాడని నమ్ముతారు. జీవితంలోని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరియు స్పష్టమైన ఆలోచన శక్తిని పెంపొందించుకోవడానికి ఇది సహాయపడుతుంది.
- ఆధ్యాత్మిక అభివృద్ధి: సంకట నాశన గణేశ స్తోత్రం పఠించడం వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధికి కలుగుతుంది. ప్రతి రోజు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా, వినాయకుడి వివిధమైన రూపాన్ని ధ్యానించుకోవడానికి మరియు ఆయన శక్తితో అనుసంధానం పరచుకోవడానికి సహాయపడుతుంది.
Sankata Nasana Ganesha Stotram Telugu
సంకట నాశన గణేశ స్తోత్రం తెలుగు
నారద ఉవాచ ।
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే ॥ 1 ॥
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ ।
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥ 2 ॥
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ ।
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥ 3 ॥
నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ ।
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ ॥ 4 ॥
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ ॥ 5 ॥
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ।
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ ॥ 6 ॥
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ ।
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ॥ 7 ॥
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ ।
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ॥ 8 ॥
ఇతి శ్రీ నారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రమ్ ।
Credits: @RAGHAVAREDDYVIDEOS
Also Read
శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తరశత నామావళి
Read Latest Post: