మాఘ పురాణం | Magha Puranam – Day 6

మాఘ పురాణం – 6 వ అధ్యాయము

Magha Puranam – Day 6

మాఘ పురాణంలోని (Magha Puranam) ఆరవ అధ్యాయం, కప్ప రూపంలో ఉన్న స్త్రీ తన విముక్తి కోసం చేసిన కృషిని వివరిస్తుంది. ముని శాపం కారణంగా కప్పగా మారిన రాజ భార్య, వేయి సంవత్సరాలు చెట్టు కింద తపస్సు చేసి, ఆహారం, నీరు లేకుండా నిలబడి, భక్తితో ప్రార్థనలు చేసింది. చివరికి ఆమె భక్తికి మెచ్చిన భగవంతుడు శాపవిముక్తి కలిగించి, ఆమెను మళ్లీ మానవ రూపంలోకి తీసుకువచ్చాడు. ఈ కథ భగవంతుడిపై విశ్వాసం, నిరంతర ప్రయత్నం ఉంటే ఎంతటి కష్టాల నుంచైనా విముక్తి సాధ్యమని బోధిస్తుంది. మాఘ పురాణం – 6 వ అధ్యాయము (Magha Puranam – Day 6) నందు ఈ క్రింది విధముగా …

Magha Puranam – Day 6

కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వ కథ

మునిశ్రేష్ఠా ! నా వృత్తాంతమును తెలియ చేయుదును గాన ఆలకింపుము. నా జన్మ స్థానము గోదావరి నది (Godavari River) సమీపమందున్న ఒక కుగ్రామము, నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరి తీర వాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవ భక్తుడు, జ్ఞాని, నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘ మాసము ప్రవేశించినది.

ఒక నాడు నా భర్త “సఖీ ! మాఘమాసము ప్రవేశించినది, మాఘమాసము చాల పవిత్రమైనది, ఈ మాసం  మహత్తు చాలా శ్రేష్టమైనది. నేను నా బాల్యము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ స్నానములు చేయు చున్నాను. నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘమాస అంతయు యీ కావేరీ నదిలో (Kaveri River) స్నానము ఆచరించుము.  ప్రతి నిత్యము ప్రాతః కాలమున నిద్ర నుండి లేచి, కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారు ఝామున సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునికి (Lord Surya) నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు (Lord Vishnu) యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండచెక్కర, పటికబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతుము. తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకు ఒక అధ్యాయము చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా వుండును” అని హితబోధ జేసెను.

నేను అతని మాటలు వినిపించుకోకుండా  రుసరుసలాడుతూ, అతనిని నీచముగా చూసి, నా భర్త చాలా శాంత స్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి “ఓసీ మూర్ఖురాలా ! నా యింటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవ ద్వేషిణివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా, అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని, మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావిచెట్టు తొర్రలో మండూకమువై పడి ఉందువుగాక” అని నన్ను శపించెను.

“అమ్మాయీ ! భయపడకుము, నీకీశాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును ఏకాంతముగా చాల కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతిమాటలు విననందున యెంత కష్టపడినావో తెలిసినదికదా ! మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాకా  మోక్ష సాధనము కూడ నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక్క వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతియైనది వ్రతము నీ భర్త దూర దృష్టి కల జ్ఞాని, అతని గుణ గణాలకు అందరూ సంతసించు వారు నిన్ను మనువాడిన తరువాత తన వంశం అభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో ఉండెడివాడు. కానీ, నీ వలన అతని ఆశలన్నీ నిరాశలయిపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు జలము దొరకకుండా చెట్టు తొర్రలో జీవించుమని శపించాడు.

ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజ రూపమును పొందగలిగినావు, అందునా ఇది  మాఘమాసము కృష్ణానదీ తీరము కావున మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు కాని, పురుషులు కాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కాని, తెలియక కాని మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి నందు, పాడ్యమి రోజుననూ నదీ స్నానము ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘ సుద్ధ పాడ్యమినాడునూ, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినముల లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని (Lord Vishnu)  పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును”, అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో (Parvati Devi) ఈ కథ చెప్పెను.

Read more Puranas

Leave a Comment