మాఘ పురాణం – 28 వ అధ్యాయము
మాఘ పురాణం (Magha Puranam) 28 వ అధ్యాయంలో, క్రూర అనే చాలా కోపంగా ఉండే శూద్ర స్త్రీ ఒకప్పుడు ఉండేది. ఆమె కొడుకు మాత్రం దయాళువు మరియు ధర్మవంతుడు. అతని భార్య కూడా చాలా మంచిది మరియు భర్తను ప్రేమించేది. కానీ క్రూర మాత్రం తన కోడలిని కారణం లేకుండా ఎప్పుడూ హింసించేది. ఒకరోజు ఆమె కోడలిని గదిలో బంధించి ఏడు రోజుల పాటు ఆహారం లేదా నీరు ఇవ్వకుండా పీడించింది. చివరికి ఆమె ఆకలి, దాహంతో మరణించింది. కొంత కాలానికి క్రూర కుమారుడు భార్యను చూసేందుకు గదిలోకి వెళ్లి ఆమె మరణించినట్లు తెలుసుకుని బాధతో కృంగిపోయాడు. అతనూ కూడా దుఃఖంతో మరణించాడు. తన చేసిన పనికి క్రూర చాలా పశ్చాత్తాపపడింది కానీ ఆమె కూడా దుఃఖంతోనే మరణించింది. పాపంతో వీరు ముగ్గురూ యమలోకానికి వెళ్ళి అనుభవించాల్సిన కష్టాలు అనుభవించారు.
అదే సమయంలో ధీరుడు, ఉపధీరుడు అనే ఇద్దరు సన్యాసులు చంపానదిలో (Champa River) స్నానం చేసి శ్రీహరిని పూజించారు. అప్పుడు ఆ చెట్టు క్రింద సర్పాలుగా ఉన్న క్రూర, ఆమె భర్త, కుమారుడు వారిని చూశారు. ధీరుడు మరియు ఉపధీరుడు శ్రీహరిని (Lord Vishnu) ప్రార్థించగా, శ్రీహరి వారి ప్రార్థనలను మన్నించి, క్రూర, ఆమె భర్త, కుమారుడి పాపాలను తొలగించాడు. వారు తమ సర్ప (Snake) శరీరాలను విడిచిపెట్టి స్వర్గానికి చేరుకున్నారు. మాఘమాస వ్రతం యొక్క మహిమ ఎంతటిదంటే, దానిని ఆచరించిన వారి పాపాలు తొలగిపోయి వారు స్వర్గాన్ని చేరుకుంటారని ఈ కథ చెబుతోంది. మాఘ పురాణం – 28 వ అధ్యాయము (Magha Puranam – Day 28) నందు ఈ క్రింది విధముగా …
Magha Puranam – Day 28
క్రూర కథ
గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మాఘ మాసమునందు నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘ వ్రతమును ఆచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమును ఎక్కి పూజ్యుడై తన వంశము వారినందరిని ఉద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహ దేశమున క్రూర అను పేరు కల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె యొక రైతు భార్య మిక్కిలి కోపము కలది. ఆ దంపతులకు జ్ఞానియగు పుత్రుడుకలడు. అతడు దయావంతుడు ధర్మాచరణమనిన ఇష్టము కలవాడు. వాని భార్య పతి భక్తి కలిగినది ఉత్తమురాలు. ఆమెకును ధర్మకార్యములను చేయుటయందిష్టము కలదు. బంధువులకు దీనులకు అతిథులకు అందరికి యధా శక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడును సేవచేయుచుండెను. క్రూర కోడలిని యే దోషము లేకున్నను నిందించెడిది కిట్టెడిది. అప్పుడు ఆమె భర్తయు తలచి అత్త మామలు పెట్టు హింసలను భరించుచు ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యధా శక్తిగ సేవలు చేయుచుండెడిది.
ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుచున్న భార్యను చూచి క్రూరా పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయనా ! అమ్మా ! నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది. మీకు కోడలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు యీ కోపముతో మీకేమి ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని, నా భార్య కాని మీకేమి ఉపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణము ఏమియు నాకు కనిపించుటలేదు. పెరిగిన కోపము వల్ల ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగునవి నశించును కదా! సర్వజ్ఞులైన, పెద్దలైన మీరు కోపమును మాని మాయందు దయను చూపి సర్వ జన సమ్మతమైన ఓర్పు వహించుడు అని పలికెను.
పుత్రుని మాటలను విని క్రూర భర్తతోబాటు మిక్కిలి కోపముతొ యిట్లనెను. మూర్ఖుడా పో పొమ్ము. నీవెంత? నీ భార్యయెంత? తల్లిదండ్రులకిట్లు నీతి బోధను చేయు నిన్ను నీ భార్యను యేమి చేసినను తప్పులేదు, అని పలికి కొడుకును కోడలిని మరల మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగ కొట్టెను. ఇట్లు దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందెను. కాని సహజమైన శాంతమును పొందెను. *’అయ్యో తల్లితండ్రులను ద్వేషించుట యెంత తప్పు అట్టివారు శాశ్వతముగా నరకమునకు పొందుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటిలేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేదు కదా ! విష్ణువుతో సమాన దైవము, గంగతో సమానమగు తీర్థము మరేమి లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా నుండుమని సమాధాన పరచెను.
కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసి వేసెను. ఆమె కుమారుడీ ఆకృత్యమును జూచి తల్లినేమియు అనలేక పితృభక్తి వలన నేమియు చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వము వలెనే తల్లిదండ్రులకు సేవ చేయునుండెను. కోడలు ఆ గదిలో ఏడు రోజులు అన్నము, నీరు లేక ఆవిధముగా నిర్భంధములో ఉండెను. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు, కోడలిని అట్లె నిర్బంధించి పీడించెను. ఏడవదినమున కోడలు అన్నము నీరు లేకుండుటచే దుఃఖించి కృశించి మరణించెను. పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడవలెనని తల్లికి తెలియకుండ తలుపు తెరచి చూచెను. మరణించిన భార్యను జూచి సంతాపమునంది నిశ్చేష్టుడైయుండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై బడెను.
క్రూరయూ తలుపు తెరచి యుండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖ వివశుడైన పుత్రుని జూచెను. ఆశ్చర్యము ఆమెకును దుఃఖము యెక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె యెడ్పును విని అందరును యేమియనుచు చూడవచ్చిరి. విషయమును తెలిసికొని క్రూరను బహువిధములుగ నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును గొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచట నుండలేక గంగా (Ganga River) తీరమును చేరెను. కొంతకాలమునకు శోక భారమున మరణించెను.
క్రూర పశ్చాత్తాపమునందెను, పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగ శోకించుటను జూచి జనులందరును విచారించిరి. కాని ఈ సమయమున విచారించి లాభము ఏమి, పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసివత్ర నరకము (కత్తుల బోను) చిరకాలమనుభవించిరి. తరువాత చంపా తీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు (Peepal Tree) తొఱ్ఱలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు, ఉపధీరుదు అను ఇద్దరు సజ్జనులు అచటకి వచ్చిరి, చంపానదిలో మాఘమాస స్నానము నాచరించి సర్పదంపతులున్న చెట్టు క్రింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగ చెప్పుకొనిరి.
సర్ప దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన, వారి పాపములు పోయినవి. పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జహ్నుముని వర్యా ! మాఘమాస వ్రత మిట్టిదని యెంతకాలము చెప్పినను పూర్తికాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరలచిరని చెప్పుటకును వీలులేదు. ఎన్నో యుగముల నుండి యెంతమందియో, ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, పశుపక్ష్యాదులు వారు వీరననేల సర్వప్రాణులును మాఘమాస వ్రతము నాచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడు అయినను మాఘమాస వ్రతమును ఆచరించినచో, చేసిన పాపములు పోయి పుణ్య లోకములు కలుగుననుటకు ఎన్ని ఉదాహరణములను చెప్పగలను? ఎన్నియో ఉదాహరణములు ఉన్నవి సుమా అని గృత్నృమదమహాముని జహ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించెను.
Read more Puranas