మాఘ పురాణం | Magha Puranam – Day 21

Magha Puranam - Day 21

మాఘ పురాణం (Magha Puranam) 21 వ అధ్యాయంలో, గృత్నృమద మహర్షి జహ్ను మునితో మాట్లాడుతూ, శ్రీమహావిష్ణువు (Lord Vishnu) శివుడిని స్తుతిస్తూ “శంకరా! నీవు నాతో సమానుడవు. మన మధ్య ఎటువంటి భేదం లేదు. సర్వ పూజ్యుడవు, సర్వ వ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు” అని అన్నాడు. ఆ తరువాత నారదుడు శివుని (Lord Shiva) స్తుతిస్తూ, “కూపంతనాశేష కధాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం” అని మొదలుపెట్టి, శివుని అనేక రూపాలను, లక్షణాలను స్తుతించాడు.

అప్పుడు శ్రీమహా విష్ణువు జహ్ను మునితో ఈ సంఘటనను వివరిస్తూ, “బ్రహ్మ (Brahma), శివుడు, నేను ముగ్గురం ఒకే తత్త్వం నుండి వచ్చిన వారమని, మన మధ్య ఎటువంటి భేదం లేదని వివరించాను. అయినా, భేదం ఉందని భావించి వాదించే అహంకార పండితుల కోసం ఈ సంఘటన జరిగింది. మాఘమాస వ్రతం (Magha Masam) ఆచరించే వారికి ఈ విషయం తెలుసుకోవాలి. అజ్ఞానంతో దోషం చేయకూడదు. బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడైన విష్ణువును భావించి జ్ఞానులై ముక్తి పొందాలి. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహపరములలో సుఖించాలి. అహంకారం దుఃఖం కలిగిస్తుంది. త్రిమూర్తులకు కూడా అది తప్పదు. గర్వంతో అశక్తుడైన వాడిని నాక్షేపిస్తారు. సర్వ సమర్థుడైన వాని శక్తికి అంతా లోబడి ఉంటుంది. పరమాత్మకు అహంకారం ఉండదు.

ఎందుకంటే ఏదియు ఆయనను మించినది లేదు. జ్ఞానం కలగాలని భగవంతుడే ఈ సంఘటన ద్వారా మనకు అహంకారం కూడదని తెలిపాడు. కాబట్టి గర్వం, సిగ్గు, అభిమానం విడిచిపెట్టి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతం ఆచరించి, విష్ణు కథలు విని తరించాలి. యధాశక్తి దానం చేసి, సాటివారి యందు ప్రేమ చూపి, సర్వాత్మకుని దయా విశేషం పొందాలి” అని చెప్పాడు.  మాఘ పురాణం – 21 వ అధ్యాయము (Magha Puranam – Day 21) నందు ఈ క్రింది విధముగా …

శ్రీమహా విష్ణువు చేసిన శివ ప్రశంస – నారదుని శివ స్తుతి.

గృత్నృమద మహర్షి జహ్ను మునితో మరియు నిట్లనెను. విష్ణువు శివుని జూచి ఇట్లనెను. శంకరా! నీవు నాతో సమానుడవు. మన ఇద్దరికిని భేదము లేదు. నా వలెనే సర్వ పూజ్యుడవు. సర్వ వ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా అని ఇట్లు స్తుతించెను.

శంకరా! నీకు నాకును భేదమే లేదు. వేదాంత వేత్తలకిది స్పష్టముగ తెలియును. నేను నారదునకు (Narada Muni) నీ మహిమను చెప్పగా నతడు నీ అనుగ్రహమునకై తపము ఆచరించెను. నిన్ను దర్శింపనెందెను. నీవు అతనిని అనుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా? మరల స్మరింపుము.

శంకరా! నారదుడు చేసిన అమోఘమైన ఈ స్తుతిని (Stuti)విని నీవు మిక్కిలి సంతోషించితిమ్ని. మునులు అందరి స్తోత్రమును చదువుచు నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకు భేదమును లేదు. మనకు భేదమున్నదని తల్చు మూఢులు నరకమున బడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్థానము నందెను.

జహ్నుమునీ! విష్ణు ఏ విధముగ రజస్తమోగుణ భేదము వలన వివాద పడిన బ్రహ్మను శివుని శాంత పరచి లోకములకి వినయము నీ విధముగ తెలిపెను. ప్రస్తుతం  ముగ్గురికి భేదము లేకున్నను భేదమున్నదని తలచి వాదించు, అహంకార పండితుల కొరకీ సంఘటన జరిగినది. మాఘమాస వ్రతము నాచరించు వారి విషయమును తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచే నాలోచించి దోషమునకు ఓడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తినందవలెను. అజ్ఞానులు మాఘమాస వ్రతము నాచరించి జ్ఞానులై ఇహపరముల యందు సుఖింప వలయును సుమా వృధా పదములు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటే యీ సంఘటన జరిగినది లెనిచో సర్వాధికిలు సర్వాధారులు సర్వోత్తములునగు త్రిమూర్తులకు కలహమేమి యెక్కువ తక్కువలేమి? మూర్ఖుడైనను భక్తితో మాఘమాస వ్రతమును ఆచరించిన జ్ఞానియై సుఖించును.

అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులు (Trimurti) అంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వాని నాక్షేపింతురు. సర్వ సమర్థుడైన వానికేది అయినను వానిశక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారమెట్లుండును ఉండదు. ఏదియును అయనను మించినది లేదు కదా. జ్ఞానము కలుగలలెనని భగవంతుడే యిట్టి సంఘటన నేర్పరచి మనవంటి మూఢులకు అహం కూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానమును విడిచి పెట్టి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు కథలను విని తరించ వలెను. యధాశక్తి దానములాచరించి సాటివారియందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయా విశేషము నందవలయును అని గృత్నృమద మహర్షి జహ్ను మునికి మాఘమాస మహత్త్యమును భగన్మహిమను బోధించెను.

Credits: @BharatiyaSamskruthi

Read more Puranas

Leave a Comment