కార్తీక పురాణం – 6 వ అధ్యాయం (దీపదాన విధి – మహాత్మ్యం)
“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.
దీపదాన మహిమ:
కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపదానం (Deepa Danam) చేయడం అత్యంత పుణ్యకరమైనది. దీపాన్ని వెలిగించేటప్పుడు పైడి ప్రత్తితో వత్తులు చేసి, వరి పిండి లేదా గోధుమ పిండితో ప్రమిద తయారు చేసి, ఆవు నెయ్యి (Cow Ghee) వాడి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ విధంగా దీపదానం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు మరియు మోక్షం లభిస్తుంది.
పూర్వకాలంలో ఒక వితంతువు తన జీవితమంతా ధనం సంపాదించడానికి ప్రయత్నించింది కానీ, ఆమెకు సుఖం లేదు. ఆమె ఒక బ్రాహ్మణుని (Brahman) సలహా మేరకు కార్తీక మాసంలో దీపదానం చేయడం ప్రారంభించింది. ఆమె మనస్సు మారింది. ఆమె పాపాలన్నీ కడిగిపోయాయి. కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యాల ఫలితంగా ఆమె మోక్షాన్ని పొందింది. ఈ కథ దీపదానం చేయడం వల్ల లభించే ఫలితాలను వివరించడమే కాకుండా, మన జీవితంలో పుణ్యకార్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట:
పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె చాలా కష్టపడి ధనం సంపాదించింది. కానీ ఆమె ఎలాంటి పుణ్యకార్యాలు చేయలేదు. ధనం సంపాదించడమే ఆమె జీవిత లక్ష్యంగా మారింది. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామానికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ వితంతువును కలిసి ఆమె జీవితంలోని తప్పులను వివరించాడు. ఆమె తన తప్పులను గ్రహించింది.
బ్రాహ్మణుడి సలహా మేరకు, ఆ వితంతువు కార్తీక మాసంలో దీపదానం, దానధర్మాలు చేయడం ప్రారంభించింది. ఆమె మనస్సు మారింది. ఆమె పాపాలన్నీ కడిగిపోయాయి. కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యాల ఫలితంగా ఆమె మోక్షాన్ని పొందింది.
ఈ కథ దీపదానం చేయడం వల్ల లభించే ఫలితాలను వివరించడమే కాకుండా, మన జీవితంలో పుణ్యకార్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేయడం, పురాణాలు వినడం, దానధర్మాలు చేయడం వంటి పుణ్యకార్యాలు చేస్తే మన జీవితం సుఖమయమవుతుంది. మనం చేసిన పాపాలు కూడా క్షమించబడి మనకు మోక్షం లభిస్తుంది. “కార్తీక పురాణం – 6వ అధ్యాయము (Karthika Puranam – Day 6) నందు ఈ క్రింది విధముగా …
Karthika Puranam – Day 6
“దీపదాన విధి – మహాత్మ్యం”
ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని (Lord Shiva), శ్రీ మహావిష్ణువును (Lord Vishnu), పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో (Kasturi Sandal) భక్తిగా పూజించినచో, అట్టివానికి అశ్వమేధ యాగం (Ashwamedha Yagna) చేసిన౦త పుణ్యము దక్కును.
అటులనే ఏ మానవుడు కార్తీకమాసము అంతయు దేవాలయము నందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీప దానం చేయుట ఎటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరి పిండితో గాని, గోధుమ పిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానము ఇవ్వవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను.
ఈ ప్రకారముగా కార్తీకమాసము నందు ప్రతి దినము చేసి, ఆఖరి రోజున వెండితో (Silver) ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచి౦పవలెను.
సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||
అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థము ఏమనగా, “అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునదియునగు ఈ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!” యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను.
శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకు అయిననూ భోజనమిడి దక్షిణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులు కానీ, స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసిననూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను.
లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట
పూర్వ కాలమున ద్రవిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసిగా పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన యెడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు, ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకు వచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.
ఈ విధముగా కూడ పెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను.
ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ, దేవుని మనసార ధ్యాని౦చుట కానీ చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసే వారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే వారిని చూచి అవహేళన చేసి, ఏ ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచు౦డెడిది.
అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని (Srirangam) శ్రీ రంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమె కడకు వెళ్లి “అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము – జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు.
ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు.
కాన, నా మాటను ఆలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దాన ధర్మములు చేసి, పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసము అంతయూ ప్రాత:కాలమున నదీ స్నానమును ఆమాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల”వని ఉపదేశమిచ్చెను.
ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆ నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాస వ్రతములో అంత మహత్మ్యమున్నది.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము – ఆరవ రోజు పారాయణము సమాప్తము.
“ఓం నమః శివాయ“
Also Read