కార్తీక పురాణం | Karthika Puranam – Day 30

కార్తీక పురాణం – 30వ అధ్యాయం (కార్తీక వ్రత మహిమ్నాఫలశ్రుతి)

Karthika Puranam

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది.స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vasishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. 

కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి (క్లుప్తముగా)

శౌనకాది మునులు సూతునిని అడిగారు, “ఓ ముని! కలియుగంలో మనుషులు పాపాలు చేస్తూ, సంసార సముద్రంలో మునిగిపోతున్నారు. వారికి మోక్షం లభించే సులభమైన మార్గం ఏమిటి? అన్ని ధర్మాల కంటే శ్రేష్టమైన ధర్మం ఏది? అన్ని దేవతల కంటే శ్రేష్టమైన దైవం ఎవరు? మనస్సులోని అజ్ఞానాన్ని తొలగించి పుణ్యఫలం ఇచ్చే కార్యం ఏమిటి? మరణం ఎప్పుడు వస్తుందో తెలియని మనకు మోక్షం పొందే సులభమైన మార్గం ఏమిటి? మేము నిరంతరం హరినామాన్ని జపిస్తున్నాము కానీ ఈ సందేహాలు మా మనసులో ఉన్నాయి. దయచేసి మాకు వివరించండి” అని కోరారు.

సూతుడు వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ, “మీ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. కలియుగంలోని (Kaliyug) మనుషులు మందబుద్ధులు. వారు క్షణిక సుఖాల కోసం పాడుపడుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం కార్తీక వ్రతంలో ఉంది. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణునికి (Sri Narayana) అత్యంత ప్రీతికరమైనది. ఈ వ్రతం ఎంత గొప్పదో చెప్పడానికి నాకు మాటలు చాలవు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుంది.

కార్తీక మాసంలో ఇలా చేయాలి – సూర్యుడు తులారాశిలో (Tula Rashi) ఉన్నప్పుడు నదుల్లో స్నానం చేయాలి. దేవాలయాలకు వెళ్లి హరిహరులను (Hari Hara) పూజించాలి. తమ శక్తి కొలదీ దీపదానం చేయాలి. విధవ వండిన ఆహారం తినకూడదు. రాత్రి వేళ విష్ణు లేదా శివాలయంలో ఆవు నెయ్యితో (Cow Ghee Diya) దీపం వెలిగించాలి. ప్రతిరోజు సాయంకాలం పురాణాలు చదవాలి. ఇలా చేస్తే అన్ని పాపాలు నశిస్తాయి. సూర్యుడు తులారాశిలో ఉన్నంత కాలం ఇలా చేస్తే జీవన్ముక్తులు అవుతారు.

ఈ వ్రతాన్ని ఆచరించడానికి శక్తి ఉన్నా ఆచరించకపోతే లేదా ఇతరులను ఆచరించకుండా అడ్డుకుంటే నరకానికి వెళ్లాల్సి వస్తుంది. కార్తీక మాసంలో కావేరి, గంగా, గౌతమి నదుల్లో స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తే వైకుంఠం చేరుకోవచ్చు.

కార్తీక మాసం అన్ని మాసాల కంటే శ్రేష్టమైనది. ఈ మాసంలో వ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. ఈ వ్రతాన్ని చేయాలనే కోరిక పుణ్యవంతులకు మాత్రమే ఉంటుంది. దుష్టులకు ఈ వ్రతంపై విశ్వాసం ఉండదు.

కాబట్టి ప్రతి మనిషి ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించాలి. నెల రోజులు వ్రతం చేయలేకపోతే కార్తీక పౌర్ణమి (Karthika Pournami) రోజున వ్రతం చేసి బ్రాహ్మణులకు భోజనం పెడితే చాలు. ఈ మాసంలో దానధర్మాలు చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ కథను విన్న వారందరికీ శ్రీమన్నారాయణుడు అన్ని రకాల అనుగ్రహాలు ప్రసాదిస్తాడు” అని సూతుడు చెప్పాడు. “కార్తీక పురాణం” – 29వ అధ్యాయము (Karthika Puranam – Day 29) నందు ఈ క్రింది విధముగా …

నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకు అందరును సూత మహాముని తెలియ జేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయ్యి నోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున, సూతుని గాంచి, ‘ఓ ముని తిలకమా! కలియుగము నందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచార పరులై జీవించుచూ సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరణోపాయము ఏదైనా  కలదా? ధర్మముల అన్నింటిలో మోక్షసాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్య ఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరి నామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు”మని కోరిరి.

అంత సూతుడా ప్రశ్నను ఆలకించి “ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మంద బుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీఋ ఆడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తిక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి (Sri Hari) వివరించియున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతయేకాదు, సృష్టి కర్తయగు ఆ బ్రహ్మ దేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్షముగా వివరించెదను.

కార్తికమాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తికమాసమున సూర్యభగవానుదు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి (Temple) వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీప దానం చేయవలయును. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున కాని, శివాలయమున కాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై, సర్వ సౌఖ్యములను అనుభవింతురు. సూర్యుడు తులా రాశి యందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి వుండికూడా ఆచరించక గాని, లేక, ఆచరించువారలను ఎగతాళి చేసిన గాని, వారికి ధనసహాయము చేయు వారికి అడ్డు పడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయే గాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియే గాక అట్తి వారు నూరు జన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.

కార్తిక మాసములో కావేరి నదిలో గాని (Kaveri River), గంగా నదిలో గాని (Ganga River), అఖండ గౌతమి నదిలో (Goutami River) గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ ఇహమందు సర్వ సుఖములను అనుభవించుటయే గాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు.

సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తికమాసము ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తికమాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి, మరు జన్మ లేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమును ఆచరించ వలెనని కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తికమాసమన్న కార్తిక వ్రతము అన్నా అసహ్యము కలుగును.

కాన, ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువకుండా ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తిక శుద్ద పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్య తీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని మరియు వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము (30వ అధ్యాయం) ముప్పదవ (ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.

“హర హర శంభో శంకర, ఓం నమశ్శివాయ”

Also Read

Leave a Comment