కార్తీక పురాణం – 27వ అధ్యాయం (దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట)
“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vasishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.
దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట (క్లుప్తముగా)
విష్ణువు దూర్వాసుడితో, “దూర్వాసా! నీవు అంబరీషుని శపించినందుకు నేను అవతారాలు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ, బ్రాహ్మణులను అవమానించడం పెద్ద పాపం. నీవు అంబరీషుడిని చాలా కష్టంలో పెట్టావు. అతను నీ గురించి చాలా బాధపడుతున్నాడు. కాబట్టి నువ్వు వెళ్లి అతనిని క్షమించమని కోరు. అప్పుడు మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది” అని చెప్పాడు.
విష్ణువు ఇంకా వివరించాడు, “బ్రాహ్మణులకు ఎంతో గౌరవం ఇవ్వాలి. వారిని అవమానించిన వారికి శిక్ష తప్పదు. అంబరీషుడు ఎంతో భక్తిమంతుడు. అతన్ని కష్టపెట్టడం తప్పు. నువ్వు వెళ్లి అతని పాదాలకు నమస్కరించు. అప్పుడు నీ పాపాలు తొలగిపోతాయి.” అని దూర్వాసుడిని అంబరీషుడి దగ్గరకు పంపించాడు. “కార్తీక పురాణం” – 27వ అధ్యాయము (Karthika Puranam – Day 27) నందు ఈ క్రింది విధముగా …
Karthika Puranam – Day 27
దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట
మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతోచెరదీసి ఇంకను ఇట్లు చెప్పెను.
“ఓ దూర్వాస మునీ (Durvasa Muni)! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరము అయినవే. నేను అవతారము (Avatar) లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున, అందులకు నేను అంగికరించితిని. బ్రాహ్మణుల (Brahmin) మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంటియందు భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము (Vishnu Chakra) నిన్ను బాధింపబూనెను. ప్రజా రక్షణమే రాజ ధర్మము కాని, ప్రజాపీడనము కాదు.
ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించ కూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించు వాడును హింసింప చేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయ శాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును, కాలితో తన్నిన వాడును, విప్ర ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించిన వాడును బ్రహ్మహ౦తుకులే అగుదురు. కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి – తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును” అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవి౦శోధ్యాయము (27వ అధ్యాయం) ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.
Also Read