కార్తీక పురాణం – 26వ అధ్యాయం (దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట – శ్రీహరి హితబోధ)
“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది.స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vasishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.
దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట – శ్రీహరి హితబోధ (క్లుప్తముగా)
అత్రి మహర్షి (Atri Maharshi) అగస్త్యునితో ఇలా చెప్పారు: “కుంభ సంభవా! దూర్వాసుడు (Durvasa Maharishi) అంబరీషుని శపించిన తర్వాత జరిగిన విషయాలు విను.
దుర్వాసుడు భూలోకం, భువర్లోకం, పాతాళలోకం, సత్యలోకం అన్ని చోట్ల తిరిగి తనకు రక్షణ లేకపోయి, చివరకు వైకుంఠానికి (Vaikuntha) వెళ్లి శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. అతను విష్ణువును “వాసుదేవా, జగన్నాథా, శరణాగత రక్షణ బిరుదాంకితా! నేను అంబరీషునికి కీడు చేశాను. నేను బ్రాహ్మణుడిని అయినా పెద్ద పాపం చేశాను. నీవు బ్రాహ్మణులను ఎంతో ప్రేమిస్తావు. భృగు మహర్షిని కూడా క్షమించిన నీవు నన్ను క్షమించాలి. నీ సుదర్శన చక్రం (Sudarshana Chakra) నన్ను చంపబోతుంది. నన్ను రక్షించు” అని వేడుకున్నాడు.
విష్ణువు దూర్వాసుడి ప్రార్థన విని చిరునవ్వు నవ్వి, ‘దూర్వాసా! నీ మాటలు నిజమే. నీవు గొప్ప తపస్వి. కానీ నీవు అంబరీషుడిని అన్యాయంగా శపించావు. అతను నా భక్తుడు. నేను ఎప్పుడూ బ్రాహ్మణులను గౌరవిస్తాను, కానీ అన్యాయం చేసిన బ్రాహ్మణులను కూడా శిక్షిస్తాను. నీవు అంబరీషుడిని అవమానించడం నన్ను అవమానించినట్లే. నేను అవతారాలు ఎత్తి ప్రపంచాన్ని రక్షిస్తాను. నీవు చేసిన పాపానికి నీవే శిక్ష అనుభవించాలి’ అని చెప్పాడు.
విష్ణువు తన దశావతారాల (Dashavatar) గురించి వివరించాడు. మత్స్య (Matsya) , కూర్మ (Kurma), వరాహ (Varaha), నరసింహ (Narasimha), వామన (Vaman), పరశురామ (Parashurama) , శ్రీరామ (Sri Rama), శ్రీకృష్ణ (Sri Krishna), బుద్ధుడు (Buddha), కల్కి (Kalki) అనే దశావతారాలను ఎందుకు ఎత్తాడో చెప్పాడు. దూర్వాసుడు చేసిన పాపానికి శిక్షగా ఈ దశావతారాలలో ఒక్కొక్కటిగా జన్మిస్తానని చెప్పాడు.
విష్ణువు ఇలా చెప్పడంతో దూర్వాసుడు తన తప్పును గ్రహించి అంబరీషుడిని క్షమించాలని కోరాడు. విష్ణువు అంబరీషుడిని క్షమించి, దూర్వాసుడిని కూడా క్షమించాడు. “కార్తీక పురాణం” – 26వ అధ్యాయము (Karthika Puranam – Day 26) నందు ఈ క్రింది విధముగా …
Karthika Puranam – Day 26
దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట – శ్రీహరి హితబోధ
ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో – దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.
ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళ లోకము, సత్య లోకములకు తిరిగి తిరిగి, అన్ని లోకములలోను తనను రక్షించువారు లేక పోవుటచే వైకుంఠము నందున్న శ్రీ మహావిష్ణువు కడకు వెళ్లి “వాసుదేవా! జగన్నాథా! శరణాగత రక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయ దలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలి గురుతు నేటికినీ నీ వక్షస్దల మందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి! నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న” దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్దించెను.
ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి – శ్రీ హరి చిరునవ్వు నవ్వి “దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసా కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచము నందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మ యుక్తముగా ప్రజా పాలన చేయుచుండెను.
కాని, అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథినై వచ్చి కూడ, నేను వేళకు రాని ఎడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రత భంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంత కంటే అతడు అపరాధము ఏమి చేసెను! చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రత భంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుట చేయాలేదే? నీవు మండి పడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింప చేయ జూచెను.
ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.
అదెటుల అనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని చంపుటకు ‘మత్స్య రూపము’ను ఎత్తుదును. మరి కొంత కాలమునకు దేవ దానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ ‘కూర్మ రూపము’న నా వీపున మోయుదును. ‘వరాహ’ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. ‘నరసింహ’ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. ‘బలిచే’ స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు ‘వామన రూప’మెత్తి బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూ భారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును.
లోక కంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘు వంశమున ‘రాముడనై’ జన్మింతును. పిదప, యదు వంశమున ‘శ్రీకృష్ణునిగ’ను, కలి యుగమున ‘బుద్దుడు’గను, కలి యుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుని ఇంట “కల్కి” యను పేరున జన్మించి, అశ్వారూఢుండనై పరిభ్రమించుచు, బ్రహ్మ ద్వేషులను అందరిని మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింప చేసి వైకుంఠ ప్రాప్తిని ఒసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తిక మహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము (26వ అధ్యాయం) ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.
Also Read