కార్తీక పురాణం – 21 వ అధ్యాయం (పురంజయుడు కార్తిక ప్రభావము నెరుంగుట)
“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.
పురంజయుడు కార్తీక మాస ప్రభావము తెలుసుకొనుట
పురంజయుడు మరియు కాంభోజ రాజు మధ్య జరిగిన యుద్ధం భీకరంగా సాగింది. రెండు సైన్యాల మధ్య జరిగిన యుద్ధంలో అనేక మంది సైనికులు చనిపోయారు. చివరకు పురంజయుడు యుద్ధంలో ఓడిపోయి తన రాజ్యాన్ని కోల్పోయాడు. తన పాపాల ఫలితంగానే తాను ఈ దుర్గతి పాలయ్యానని పశ్చాత్తాపపడ్డాడు.
అప్పుడు వశిష్టుడు పురంజయుడి వద్దకు వచ్చి, అతనిని ధర్మ మార్గంలో నడవాలని హితవు చెప్పారు. కార్తీక పౌర్ణమి (Karthika Pournami) రోజున స్నానం చేసి, దీపారాధన చేసి, శ్రీహరిని స్మరించాలని చెప్పారు. అలా చేస్తే శ్రీహరి (Sri Hari) అతనికి అనుగ్రహించి, రాజ్యాన్ని తిరిగి ఇస్తాడని హామీ ఇచ్చారు.
పురంజయుడు వశిష్టుడి మాటలు విని, కార్తీక పౌర్ణమి రోజున స్నానం చేసి, దీపారాధన చేసి, శ్రీహరిని స్మరించాడు. శ్రీహరి అతని భక్తికి మెచ్చి, అతనికి చక్రాయుధాన్ని(Chakrayudham) ప్రసాదించి, శత్రువులను జయించి రాజ్యాన్ని తిరిగి పొందేలా చేశాడు. “కార్తీక పురాణం” – 21వ అధ్యాయము (Karthika Puranam – Day 21) నందు ఈ క్రింది విధముగా …
Karthika Puranam – Day 21
పురంజయుడు కార్తిక ప్రభావము నెరుంగుట
ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు మధ్య భయంకరమైన యుద్దము జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు మల్లయుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరుల ఢీ కొనుచు హుంకరించుకొనుచు, సింహ నాదములను చేసి కొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములును విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణ భూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు గుట్టలుగా, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులతోనూ హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు. పర్వతాల వలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే.
ఆ మహా యుద్దమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకు వెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానము (Pushpaka Vimanam) నందు వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్ట మై పోయెను. అయినా, మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమును ఎల్లా అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను.
దానితో పురంజయుడు రహస్య మార్గమునందు శత్రువుల కంటికి కనపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి “రాజా! మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లానలేదు. నీవు భగవంతుని సేవించక అధర్మ ప్రవర్తునుడవై వున్నందుననే ఈ యుద్దమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితిని.
ఇప్పటికైనా నామాటలను ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని యెఱ్ఱింగియు, నీవు చింతతో కృంగి పోవుటయేల? శత్రు రాజులను యుద్దము నందు జయించి, నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలేను అన్న తలంపుకలదేని, నా హితోపదేశమును ఆలకింపుము. ఇది కార్తికమాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి (Pournami) గాన, స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి, భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియే గాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతగదా నీకీ అపజయము కలిగినది? గాన లెమ్ము. శ్రీహరిని నీ మదిలో దలచి నేను తెలియ జేసినటుల చేయు” మని హితోపదేశము చేసెను.
అపవిత్రః పవిత్ర వా నానావస్దాన్ గతోపివా |
యః స్మరే త్పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతరశ్శుచిః ||
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మాహాత్మ్యమందలి ఏకవింశోధ్యాయః (21వ అధ్యాయం) సమాప్తః – ఇరవయ్యోకటోరోజు పారాయణము సమాప్తము.
Also Read