కార్తీక పురాణం – 17 వ అధ్యాయం – (అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము)
“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది.స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.
అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము (క్లుప్తముగా)
కార్తీక పురాణంలోని 17వ అధ్యాయం నందు అంగీరసుడు (Angirasa) అనే మహర్షి ఒక ధనలోభికి తత్వ జ్ఞానాన్ని బోధించిన కథను వివరిస్తుంది. ఈ కథలో, ధనలోభి తనకున్న సందేహాలను అంగీరసుడి ముందు వ్యక్తం చేస్తాడు.
ధనలోభి, “నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచున్నాను. కానీ, ‘అహం బ్రహ్మ’ అను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి” అని అడుగుతాడు. దీనికి సమాధానంగా అంగీరసుడు, ఆత్మ అనేది శరీరాన్ని ఆవరించి ఉన్న చైతన్యం అని వివరిస్తారు. శరీరం జన్మించి, పెరుగుతుంది, క్షీణిస్తుంది మరియు చనిపోతుంది. కానీ ఆత్మ (Soul) మాత్రం నిరంతరం ఉన్నది. ఆత్మ అనేది సచ్చిదానంద స్వరూపం.
అంగీరసుడు ఇనుము సూదిని ఉదాహరణగా చెప్పి, ఇనుము (Iron) సూది రాయిని అంటుకుని తిరుగుతున్నట్లుగా, శరీరం ఆత్మను అనుసరిస్తుంది అని వివరిస్తారు. ఆత్మ అనేది శరీరాన్ని నియంత్రిస్తుంది. శరీరం లేకున్నా ఆత్మ ఉంటుంది. అంగీరసుడు తన ఉపదేశంలో ఆత్మ మరియు పరమాత్మల మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తారు. ఆత్మ అనేది పరమాత్మ యొక్క ఒక అంశం. అంటే, ఆత్మ మరియు పరమాత్మ ఒకటే.
చివరగా, అంగీరసుడు ధనలోభికి మంచి కర్మలు చేయాలని సలహా ఇస్తారు. మంచి కర్మలు చేయడం వల్ల మనం మోక్షాన్ని పొందవచ్చు అని చెబుతారు. “కార్తీక పురాణం” – 17వ అధ్యాయము (Karthika Puranam – Day 17) నందు ఈ క్రింది విధముగా …
Karthika Puranam – Day 17
అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము
ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.
కర్మ వలన ఆత్మకు దేహ ధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పత్తికి కర్మ కారణము అగుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణము అగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు (Lord Shiva) పార్వతీ దేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ‘ఆత్మ’ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించు చున్నది – అని అంగీరసుడు చెప్పగా
“ఓ మునీంద్రా! నేనింత వరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధ జ్ఞానమునకు పాదార్ద జ్ఞానము కారణమగుచుండును. కాన, ‘అహం బ్రహ్మ’ యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి” అని ధనలోభుడు కోరెను.
అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియె – ఈ దేహము అంత:కరణ వృత్తికి సాక్షియే, ‘నేను – నాది’ అని చెప్పబడు జీవత్మాయే ‘అహం’ అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా ‘న:’ అను శబ్దము. ఆత్మకు షుటాదుల వలె శరిరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారము నుందు ప్రవర్తింప చెసి వాని కంటే వేరుగా వున్నదై ఎల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే “ఆత్మ” యనబడను. “నేను” అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియే గాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ “నేను”, “నాది” అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.
ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో, అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత ‘నేను సుఖ నిద్ర పోతిని, సుఖంగావుంది’ అనుకోనునదియే ఆత్మ.
దీపము (Light) గాజు బుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఎదో అదియే ‘పరమాత్మ’ అని గ్రహింపుము. ‘తత్వమసి’ మొదలైన వాక్యములందలి ‘త్వం’ అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం ‘తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము “తత్త్వమసి” అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును. అదియే “ఆత్మ దేహ లక్షణములుండుట – జన్మించుట – పెరుగుట – క్షీణి౦చుట – చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించబడి ఉన్నదో అదియే “ఆత్మ”. ఒక కుండను (Jar) జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.
జీవులచే కర్మ ఫలమును అనుభవింప జేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మ ఫలమను భవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తుగల వాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్దియు, దాని వలన భక్తిజ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు – అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్త దశాధ్యాయము – పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.
Also Read