కార్తీక పురాణం | Karthika Puranam – Day 10

కార్తీక పురాణం – 10 వ అధ్యాయం (అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము)

Karthika Puranam

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.

అజామీళుని పూర్వజన్మ వృత్తాంతం (క్లుప్తముగా)

విష్ణుదూతలు అజామీళుని వైకుంఠానికి (Vaikuntha) తీసుకెళ్ళగా, యమదూతలు ఆశ్చర్యపోయి యమధర్మరాజుకు విషయం తెలియజేశారు. యమధర్మరాజు (Yama Dharmaraja) తన దివ్యదృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నారు.

అజామీళుడు పూర్వజన్మలో ఒక శివాలయంలో (Shiva Temple) అర్చకుడుగా ఉన్నాడు. అతను అహంకారంతో నిండి, ధనం సంపాదించడానికి ప్రయత్నించేవాడు. శివాలయాన్ని దోచుకునేవాడు మరియు స్త్రీలతో అనైతిక సంబంధాలు ఏర్పర్చుకునేవాడు. తన భార్యను కూడా కొట్టేవాడు. తన తప్పులను గ్రహించక, అతను మరణించిన తర్వాత నరకయాతన అనుభవించాడు. మళ్లీ మానవ జన్మ ఎత్తి, అజామీళుడుగా (Ajamila) జన్మించాడు.

అజామీళుని భార్య కూడా పూర్వజన్మలో అతని భార్యే. ఆమె కూడా అనేక పాపాలు చేసింది. మరణించిన తర్వాత మాలవంశంలో జన్మించింది. అజామీళుడు మరియు అతని భార్య ఇద్దరూ తమ పాపాల ఫలితంగా ఈ జన్మలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ, చివరకు అజామీళుడు హరినామాన్ని స్మరించడం వల్ల మోక్షం పొందాడు. “కార్తీక పురాణం – 10వ అధ్యాయము (Karthika Puranam – Day 10) నందు ఈ క్రింది విధముగా … 

అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము

అజామీళుని విష్ణు దూతలు వైకుంఠనికి తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమ ధర్మారాజు వద్దకి వెళ్లి ” ప్రభూ! తమ ఆజ్ణా ప్రకారము అజామీళుని తీసుకు రావడానికి వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమానమెక్కించి వైకుంఠనికి తీదుకుపోయారు. మేము ఏమిచేయలేక విచారంతో తిరిగి ఇక్కడికి వచ్చము ప్రభూ” అని భయకంపితులై విన్నవించారు.

“ఔరా! ఎంతపని జరిగెను? ఎప్పుడు ఈ విధంగా జరగనేలేదే? దీనికి బలమైన కారణము ఎదైననూ వుండవచ్చు “యముడు తన దివ్యదృష్టితో (Divine Vision) అజామీళుని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొని “ఓహో! అదా సంగతి! తన అవసానకాలమున “నారాయణ – Narayana” అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి వుండెను. అందువలన విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుపోయరు. తెలియకుండా కాని తెలిసి కాని మృత్యు సమయన హరినామ స్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది. కనుక అజామీళునికి వైకుంఠప్రాప్తి కలిగెను కదా!” అని అనుకొనెను.

అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకానొక శివాలయంలో అర్చకుడిగా వుండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరిసంపదల చేతను, బలము చేతను గర్విష్ఠియై వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయం (Shiva Temple) ధనం అపహరిస్తు, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవెద్యములను కూడా పెట్టక, దుష్ట సాహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుతుండెవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు వుంచి పడుకునేవాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెది. ఆమెకూడా అందమైనది అగుటచేత చేసేదిలేక ఆమె భర్త చూసిచూడనట్లు వుండి భిక్షాటనకై వూరూరా తిరుగుతూ ఏదోవేళకు వచ్చి కాలం గడుపుతుండెవడు. ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచనచేసి పెద్దమూటతో బియ్యము, కూరలు నెత్తినపెట్టుకొని వచ్చి అలసిపోయి ” నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా వున్నది త్వరగా వంటచేసి పెట్టుము” అని భార్యతో అనెను. అందుకామె చీదరించుకొంటు, నిర్లక్ష్యంగా కాళ్లు కడుకోవడానికి నీళ్లుకూడా ఇయ్యక, అతని వంక కన్నెత్తికూడా చూడక విటునిపై మనస్సుగలదై అతని తూలనాడుటవలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాదెను.

అంతటితో ఆమె భర్త చేతినుండి కర్ర లక్కొని భర్తను రెండింతలు కొట్టి బైటకు త్రోసి తలుపులు మూసేసను. అతడు చేసేదిలేక భర్యపై విసుగు జనించటంవలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్లిపోయెను. దానికి భర్య సంతోషించి, రాత్రిబాగా ముస్తబై వీధి అరుగుపై కూర్చుండి వుండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి ‘ ఓయీ! నీవీరాత్రి నాతో రతికీడ సలుపుటకురా!’ అని కోరెను. దానికి చాకలి ” తల్లీ! నీవు బ్రాహ్మణపడతివి. నేను నీచకులస్తుడను, చాకలివాడిని. మీరీవిధంగా పిలవడం యుక్తము కాదు. నేనిట్టి పాపపు పని చేయను” అని బుద్ధిచెప్పి పోయెని.

ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్బుకొని అక్కడి నుండి బయలుదేరి ఆగ్రామ శివార్చకుడు దగ్గరికి వెళ్లి తన కామవాంఛ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయము ఇంటికి వచ్చి ” అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్లగొట్టి క్షణమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసితిని” అని పశ్చాత్తాపము పొంది, ఒక కూలి వానిని పిలిపించి కొంత ధనమును ఇచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినముల గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను.

కొంతకాలనికి శివార్చకునికి ఏదో వ్యాధి. సంక్రమించి దినదినము క్షీణిస్తు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తనికి కుమారుడై కార్తీక మాసంలో నదీస్నానము చేసి దేవాతదర్శనము చేసి ఉండటంవలన నేడు జన్మముల పాపములు నశించుటచేత అజామీళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసాన కాలమున ” నారాయణా” అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠనికి పోయెను.

బ్రాహ్మణుని భార్య అగు ఆ కామిని కూడా రోగ గ్రస్తురాలై చనిపోయెను ఆమె యమ యాతనలు అనుభవించి ఒక మాల వాని ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని చెప్పెను. మాలవాడు ఆ శిశువును తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారినపోతూ పిల్లయేడుపు విని జాలికలిగి తీసుకొనిపోయి తన ఇంట్లోని దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెని. వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదే.

నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని (Sri Hari) ధ్యానించుట, దానధర్మలు, శ్రీహరి కథలు ఆలకించటం, కార్తీకమాస స్నానప్రభావల వలన ఎటువంటి వారైన మోక్షము పొందగలరు. కావున కార్తీక మాసం నందు వ్రతములు, పురాణ (Purana) శ్రవణములు చేసినవారి ఇహపర సుఖములు పొందగలరు.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి దశమాధ్యాయము – పదవ రోజు పారాయణము సమాప్తము.

Also Read

Leave a Comment