Ganesha Vajra Panjara Stotram | శ్రీ గణేశ వజ్ర పంజర స్తోత్రం

శ్రీ గణేశ వజ్ర పంజర స్తోత్రం: విజయానికి వజ్ర కవచం

Ganesha Vajra Panjara Stotram

శ్రీ గణేశ వజ్ర పంజర స్తోత్రం – Ganesha Vajra Panjara Stotram అనేది శ్రీ గణేశుని స్తుతిస్తూ రచించబడిన ఒక ప్రత్యేకమైన స్తోత్రం. “వజ్ర పంజర” అంటే వజ్రాలతో చేసిన పంజరం (Cage) అని అర్థం. ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకం శ్రీ గణేశుని (Ganesh Ji) అద్భుత రూపాలు, గణపతి మహిమలు, ఆయన అనంత శక్తిని వర్ణిస్తుంది. ఈ స్తోత్రాన్ని శ్రీ ముద్గల మహాపురాణం నుండి వజ్ర పంజర కథనం నుండి సంగ్రహించబడినది. జీవితంలో విజయం సాధించాలంటే మొదటగా మనం ఎదురయ్యే అడ్డంకులను జయించాలి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదో ఒక సమయములో విఘ్నాలను ఎదుర్కొంటారు. ఈ సమయాల్లోనే మనకు శక్తివంతమైన దివ్యశక్తి అవసరం.

విఘ్నాలకు అధిపతి, విఘ్నేశ్వరుడు (Vighneshwara) అయిన శ్రీ మహా గణపతి మన కార్యాలకు విఘ్నాలు లేకుండా జరిగేలా చూస్తాడు. ఆయన కృపా అనుగ్రహం పొందడానికి అనేక మార్గాలలో శక్తిమంతమైన “శ్రీ గణేశ వజ్ర పంజర స్తోత్రం.”

శ్రీ గణేశ వజ్ర పంజర స్తోత్రం యొక్క ప్రయోజనాలు:

  • విఘ్న నివారణ: జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల అవాంతరాలను తొలగించడానికి ఈ స్తోత్రం పఠించడం చాలా మంచిది.
  • శుభ ఫలితాలు: నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
  • జ్ఞాన బుద్ధి ప్రాప్తి: శ్రీ వినాయకుడు (Vinayaka) జ్ఞాన దేవుడు. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మెరుగైన జ్ఞానం, బుద్ధి లభిస్తాయని నమ్మకం.
  • ఆశయ సాధన: మీ లక్ష్యాలు, కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ స్తోత్రం సహాయపడుతుంది.
  • ఆధ్యాత్మిక అభివృద్ధి: ఈ స్తోత్రం పఠించడం ద్వారా భక్తి భావన పెరిగి, ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది.

శ్రీ గణేశ వజ్ర పంజర స్తోత్రం శక్తివంతమైన స్తోత్రం. ప్రతి శ్లోకం  శ్రీ గణేశుని అనేక రూపాలు, గుణాలను వర్ణించడం ద్వారా ఆయన అపారమైన శక్తిని స్తుతిస్తుంది.  నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగిపోయి, విజయం, శాంతి, సంతోషం కలుగుతాయని నమ్మకం.

Ganesha Vajra Panjara StotramTelugu

శ్రీ గణేశ వజ్ర పంజర స్తోత్రం తెలుగు

ధ్యానమ్ ।
త్రినేత్రం గజాస్యం చతుర్బాహుధారం
పరశ్వాదిశస్త్రైర్యుతం భాలచంద్రమ్ ।
నరాకారదేహం సదా యోగశాంతం
గణేశం భజే సర్వవంద్యం పరేశమ్ ॥ 1 ॥

బిందురూపో వక్రతుండో రక్షతు మే హృది స్థితః ।
దేహాంశ్చతుర్విధాంస్తత్త్వాంస్తత్త్వాధారః సనాతనః ॥ 2 ॥

దేహమోహయుతం హ్యేకదంతః సోఽహం స్వరూపధృక్ ।
దేహినం మాం విశేషేణ రక్షతు భ్రమనాశకః ॥ 3 ॥

మహోదరస్తథా దేవో నానాబోధాన్ ప్రతాపవాన్ ।
సదా రక్షతు మే బోధానందసంస్థో హ్యహర్నిశమ్ ॥ 4 ॥

సాంఖ్యాన్ రక్షతు సాంఖ్యేశో గజాననః సుసిద్ధిదః ।
అసత్యేషు స్థితం మాం స లంబోదరశ్చ రక్షతు ॥ 5 ॥

సత్సు స్థితం సుమోహేన వికటో మాం పరాత్పరః ।
రక్షతు భక్తవాత్సల్యాత్ సదైకామృతధారకః ॥ 6 ॥

ఆనందేషు స్థితం నిత్యం మాం రక్షతు సమాత్మకః ।
విఘ్నరాజో మహావిఘ్నైర్నానాఖేలకరః ప్రభుః ॥ 7 ॥

అవ్యక్తేషు స్థితం నిత్యం ధూమ్రవర్ణః స్వరూపధృక్ ।
మాం రక్షతు సుఖాకారః సహజః సర్వపూజితః ॥ 8 ॥

స్వసంవేద్యేషు సంస్థం మాం గణేశః స్వస్వరూపధృక్ ।
రక్షతు యోగభావేన సంస్థితో భవనాయకః ॥ 9 ॥

అయోగేషు స్థితం నిత్యం మాం రక్షతు గణేశ్వరః ।
నివృత్తిరూపధృక్ సాక్షాదసమాధిసుఖే రతః ॥ 10 ॥

యోగశాంతిధరో మాం తు రక్షతు యోగసంస్థితమ్ ।
గణాధీశః ప్రసన్నాత్మా సిద్ధిబుద్ధిసమన్వితః ॥ 11 ॥

పురో మాం గజకర్ణశ్చ రక్షతు విఘ్నహారకః ।
వాహ్న్యాం యామ్యాం చ నైరృత్యాం చింతామణిర్వరప్రదః ॥ 12 ॥

రక్షతు పశ్చిమే ఢుంఢిర్హేరంబో వాయుదిక్ స్థితమ్ ।
వినాయకశ్చోత్తరే తు ప్రమోదశ్చేశదిక్ స్థితమ్ ॥ 13 ॥

ఊర్ధ్వం సిద్ధిపతిః పాతు బుద్ధీశోఽధః స్థితం సదా ।
సర్వాంగేషు మయూరేశః పాతు మాం భక్తిలాలసః ॥ 14 ॥

యత్ర తత్ర స్థితం మాం తు సదా రక్షతు యోగపః ।
పురశుపాశసంయుక్తో వరదాభయధారకః ॥ 15 ॥

ఇదం గణపతేః ప్రోక్తం వజ్రపంజరకం పరమ్ ।
ధారయస్వ మహాదేవ విజయీ త్వం భవిష్యసి ॥ 16 ॥

య ఇదం పంజరం ధృత్వా యత్ర కుత్ర స్థితో భవేత్ ।
న తస్య జాయతే క్వాపి భయం నానాస్వభావజమ్ ॥ 17 ॥

యః పఠేత్ పంజరం నిత్యం స ఈప్సితమవాప్నుయాత్ ।
వజ్రసారతనుర్భూత్వా చరేత్సర్వత్ర మానవః ॥ 18 ॥

త్రికాలం యః పఠేన్నిత్యం స గణేశ ఇవాపరః ।
నిర్విఘ్నః సర్వకార్యేషు బ్రహ్మభూతో భవేన్నరః ॥ 19 ॥

యః శృణోతి గణేశస్య పంజరం వజ్రసంజ్ఞకమ్ ।
ఆరోగ్యాదిసమాయుక్తో భవతే గణపప్రియః ॥ 20 ॥

ధనం ధాన్యం పశూన్ విద్యామాయుష్యం పుత్రపౌత్రకమ్ ।
సర్వసంపత్సమాయుక్తమైశ్వర్యం పఠనాల్లభేత్ ॥ 21 ॥

న భయం తస్య వజ్రాత్తు చక్రాచ్ఛూలాద్భవేత్ కదా ।
శంకరాదేర్మహాదేవ పఠనాదస్య నిత్యశః ॥ 22 ॥

యం యం చింతయతే మర్త్యస్తం తం ప్రాప్నోతి శాశ్వతమ్ ।
పఠనాదస్య విఘ్నేశ పంజరస్య నిరంతరమ్ ॥ 23 ॥

లక్షావృత్తిభిరేవం స సిద్ధపంజరకో భవేత్ ।
స్తంభయేదపి సూర్యం తు బ్రహ్మాండం వశమానయేత్ ॥ 24 ॥

ఏవముక్త్వా గణేశానోఽంతర్దధే మునిసత్తమ ।
శివో దేవాదిభిర్యుక్తో హర్షితః సంబభూవ హ ॥ 25 ॥

ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే ధూమ్రవర్ణచరితే వజ్రపంజరకథనం నామ త్రయోవింశోఽధ్యాయః ।

Credits: @rosetelugudevotionalsongs873

Read Latest Post:

Leave a Comment