గణేశ మంగళాష్టకం |Ganesha Mangalashtakam

గణేశ మంగళాష్టకం

Ganesha Mangalashtakam

శుభారంభానికి ముందు శ్రీ మహా గణపతిని (Maha Ganapati) ఆరాధించడానికి ప్రసిద్ధ మరియు సులువైన స్తోత్రం “గణేశ మంగళాష్టకం – Ganesha Mangalashtakam”. ఎటువంటి కార్యమైననూ నిర్విఘ్నముగా కొనసాగడానికి విఘ్నాలను నివారించే దేవతగా మరియు ఐశ్వర్యం, ఆరోగ్యం, జ్ఞానం ప్రసాదించే దైవ స్వరూపుడు శ్రీ మహాగణేశుడు. దైవ కృప కొరకు అనేక శక్తివంతమైన స్తోత్రాలు రచించబడ్డాయి. అందులో ఈ స్తోత్రం కూడా ఒకటి. 

అష్టకం అనగా 

“అష్ట” అంటే సంస్కృతంలో “ఎనిమిది” అని అర్థం. “అష్టకం” అంటే ఎనిమిది పద్యాల సంకలనం అని అర్థం. అంటే, గణేశ మంగళాష్టకంలో ఎనిమిది శ్లోకాలు (Slokas – Verses) ఉంటాయి. ప్రతి శ్లోకం శ్రీ మహాగణేశుని ఒక విశేష రూపాన్ని లేదా విశేష గుణాన్ని స్తుతిస్తుంది.

గణేశ మంగళాష్టకం యొక్క ప్రాముఖ్యత:

  • సులువైన పఠనం (Easy Reading): గణేశ మంగళాష్టకం ఎనిమిది శ్లోకాల స్తోత్రం కాబట్టి, పఠించడానికి సులువు అవుతుంది. కొద్ది సమయం నందు ఈ స్తోత్రాన్ని పఠించి శ్రీ మహాగణేశుని (Maha Ganesh) ఆశీర్వాదం పొందవచ్చు.
  • వివిధ ఫలాలు: ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయని నమ్మకం. విఘ్న నివారణతో పాటు, ఐశ్వర్యం, ఆరోగ్యం, జ్ఞానం (Knowledge) కూడా కలుగుతాయి.
  • శాంతి ప్రదాయకం: గణేశ మంగళాష్టకంలోని శ్లోకాలు శ్రీ మహాగణేశుని శాంత స్వరూపాన్ని కొలుస్తూ, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనస్సు శాంతపడి (Peace) ఆందోళన తగ్గుతుంది.

శ్రీ వినాకుడి (Vinayaka)కృప కోసం సులువైన మార్గం గణేశ మంగళాష్టకం. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించవచ్చు, ప్రత్యేకముగా బుధవారం రోజున పఠించడం విశేషము. 

Ganesha Mangalashtakam Telugu

గణేశ మంగళాష్టకం తెలుగు 

గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే ।
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ ॥ 1 ॥

నాగయజ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే ।
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ ॥ 2 ॥

ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే ।
ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళమ్ ॥ 3 ॥

సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ ।
సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ ॥ 4 ॥

చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ ।
చరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ ॥ 5 ॥

వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ ।
విరూపాక్ష సుతాయాస్తు మంగళమ్ ॥ 6 ॥

ప్రమోదమోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే ।
ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ ॥ 7 ॥

మంగళం గణనాథాయ మంగళం హరసూననే ।
మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళమ్ ॥ 8 ॥

శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ ।
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ॥

॥ ఇతి శ్రీ గణేశ మంగళాష్టకమ్ ॥

Credits: @srimoolasthanayellammadevo4537

Read Latest Post:

Leave a Comment