గణేశ భుజంగం : శ్రీ గణేశుడి అనుగ్రహం కోసం

గణేశ భుజంగం – Ganesha Bhujangam అను స్తోత్రాన్ని శ్రీ సిద్ది వినాయకుడిని (Vinayaka) కొలుస్తూ ఒక ప్రసిద్ధమైన మరియు సులువైన స్తోత్రము. శ్రీ మహాగణేషుడిని (Maha Ganesh) కొలవడం ద్వారా అవాంతరాలు, కష్టాలు నివారణ అవుతూ ఐశ్వర్యం, ఆరోగ్యం, జ్ఞానం ప్రసాదించే దైవ స్వరూపుడు. ప్రతి శుభకార్యాలకు ప్రప్రథముగా శ్రీ మహా గణపతిని పూజతో మొదలుపెట్టటం ఆనవాయితి. ఈ పవిత్రమైన గణేశ భుజంగం స్తోత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ ఆది శంకరాచార్యులచే (Adi Shankaracharya) రచించబడినది.
భుజంగం అంటే ఏమిటి?
“భుజంగం” అంటే సంస్కృతంలో “పాము – Snake” అని అర్థం. ఈ స్తోత్రంలోని పద్యాల సరళి పాము యొక్క శరీర ఆకారంలో ఉండడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఒక పద్యం నుండి మరొక పద్యానికి అనుసంధానం ఉంటుంది. ఫలితంగా పాము వంటి ఆకారం ఏర్పడుతుంది. గణేశ భుజంగంలో ప్రతి పద్యం శ్రీ మహాగణేశుని ఒక రూపాన్ని లేదా గుణాన్ని స్తుతిస్తుంది.
గణేశ భుజంగం యొక్క ప్రాముఖ్యత:
గణేశ భుజంగం స్తోత్రం చిన్న స్తోత్రం కావున పఠించడం సులభము. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల విఘ్న నివారణతో పాటు, ఐశ్వర్యం, ఆరోగ్యం, జ్ఞానం కూడా లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. గణేశ భుజంగంలోని పద్యాలు గణపతి (Ganapati) శాంత స్వరూపాన్ని స్తుతిస్తాయి. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనస్సు శాంతపడి, ఆందోళన తగ్గుతుందని నమ్మకం.
Ganesha Bhujangam Telugu
గణేశ భుజంగం తెలుగు
రణత్క్షుద్రఘంటానినాదాభిరామం
చలత్తాండవోద్దండవత్పద్మతాలమ్ ।
లసత్తుందిలాంగోపరివ్యాలహారం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 1 ॥
ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం
స్ఫురచ్ఛుండదండోల్లసద్బీజపూరమ్ ।
గలద్దర్పసౌగంధ్యలోలాలిమాలం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 2 ॥
ప్రకాశజ్జపారక్తరత్నప్రసూన-
ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకమ్ ।
ప్రలంబోదరం వక్రతుండైకదంతం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 3 ॥
విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం
కిరీటోల్లసచ్చంద్రరేఖావిభూషమ్ ।
విభూషైకభూషం భవధ్వంసహేతుం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 4 ॥
ఉదంచద్భుజావల్లరీదృశ్యమూలో-
చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ ।
మరుత్సుందరీచామరైః సేవ్యమానం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 5 ॥
స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితారం
కృపాకోమలోదారలీలావతారమ్ ।
కలాబిందుగం గీయతే యోగివర్యై-
ర్గణాధీశమీశానసూనుం తమీడే ॥ 6 ॥
యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం
గుణాతీతమానందమాకారశూన్యమ్ ।
పరం పారమోంకారమామ్నాయగర్భం
వదంతి ప్రగల్భం పురాణం తమీడే ॥ 7 ॥
చిదానందసాంద్రాయ శాంతాయ తుభ్యం
నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ ।
నమోఽనంతలీలాయ కైవల్యభాసే
నమో విశ్వబీజ ప్రసీదేశసూనో ॥ 8 ॥
ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా
పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ ।
గణేశప్రసాదేన సిద్ధ్యంతి వాచో
గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ॥ 9 ॥
Credits :@RAGHAVAREDDYVIDEOS
Read Latest Post: