శ్రీ గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రం
గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రం (Ganapati Gakara Ashtottara Shatanama Stotram) శ్రీ మహా గణపతి యొక్క 108 నామాల స్తోత్రం. “గ” అక్షరంతో ప్రారంభమయ్యే నామాలతో నిండి ఉండడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. శుభారంభానికి ప్రధాన దేవుడు ఎవరంటే శంకరాంశ సంభూతుడైన శ్రీ మహాగణేశుడు (Maha Ganesh). ఆయన కేవలం బుద్ధి ప్రదాత మాత్రమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు నివారించే శక్తి కూడా ఆయనకే ఉంది. ఏ కార్యానికైనా ఆయన ఆశీర్వాదంతో మొదలుపెట్టడం శుభ సూచకంగా పరిగణిస్తారు.
అష్టోత్తర శతనామ స్తోత్రం అంటే ఏమిటి?
“అష్టోత్తర శతనామ” అంటే 100 పేర్లు అని అర్థం. అంటే, ఈ స్తోత్రంలో శ్రీ మహాగణేశుని 108 నామాలని స్తోత్ర రూపంలో ఉంటాయి. ప్రతి నామానికీ ఒక విశిష్ట అర్థం ఉండి, ఆ నామాన్ని పఠించడం ద్వారా ఆ విశిష్ట ఫలితం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ స్తోత్రంలోని ప్రతి నామము “గ” అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. అందుకే దీనికి “గకార అష్టోత్తర శతనామ స్తోత్రం” అని పేరు వచ్చింది.
గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రం యొక్క ప్రాముఖ్యత:
- విఘ్ననివారణ: శ్రీ గణేశుడు (Ganesh Ji) విఘ్నహర్త అని ప్రసిద్ధుడు. అంటే, విఘ్నాలను నివారించే శక్తి ఆయనకు ఉంది. ఈ స్తోత్రాన్ని నిష్ఠ మరియు భక్తితో పఠించడం ద్వారా ఆయన కృపను పొంది జీవితంలో ఎదురయ్యే అవాంతరాలు దూరమవుతాయని భక్తులు నమ్ముతారు. ప్రతి పూజయందు మొదటిగా శ్రీ వినాయకుడిని (Vinayaka) పుజించి తరువాత ఏదైని కార్యక్రమమును మొదలు పెడుతారు.
- ఐహిక మరియు ఆధ్యాత్మిక శుభాలు: గణపతి (Ganapati) గకార అష్టోత్తర శతనామ స్తోత్రం పఠించడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి వంటి ఐహిక సుఖాలు కలుగుతాయని నమ్మకం. స్తోత్ర పఠనం ఫలితంగా, ఆధ్యాత్మిక మార్గంలో పరిణామం సాధించడానికి దోహదం చేస్తుంది.
- శాంతి నిచ్చే స్తోత్రం: “గ” అనే అక్షర ధ్వని (Sound) శాంత స్వభావం (Peaceful nature) కలిగి ఉంటుంది అని నమ్మకం. అందువల్ల, ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మనస్సు శాంతపడి, ఆందోళన తగ్గుతుందని విశ్వసిస్తారు.
జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు ఏ రూపంలో ఉన్నా, శ్రీ మహాగణేశుని ఆశీస్సులు పొందాలంటే గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రం పఠించడం వల్ల విఘ్నాలని సులువుగా ఎదుర్కొనవచ్చు. సదా శ్రీ మహాగణేశుని స్తోత్రాలని మరియు నామాలను పఠించి వినాయకుడి కృపను పొందగలరు.
Ganapati Gakara Ashtottara Shatanama Stotram Telugu
శ్రీ గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రం తెలుగు
గకారరూపో గంబీజో గణేశో గణవందితః ।
గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః ॥ 1 ॥
గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః ।
గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః ॥ 2 ॥
గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః ।
గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః ॥ 3 ॥
గంజానిరత శిక్షాకృద్గణితజ్ఞో గణోత్తమః ।
గండదానాంచితోగంతా గండోపల సమాకృతిః ॥ 4 ॥
గగన వ్యాపకో గమ్యో గమానాది వివర్జితః ।
గండదోషహరో గండ భ్రమద్భ్రమర కుండలః ॥ 5 ॥
గతాగతజ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః ।
గంధప్రియో గంధవాహో గంధసింధురబృందగః ॥ 6 ॥
గంధాది పూజితో గవ్యభోక్తా గర్గాది సన్నుతః ।
గరిష్ఠోగరభిద్గర్వహరో గరళిభూషణః ॥ 7 ॥
గవిష్ఠోగర్జితారావో గభీరహృదయో గదీ ।
గలత్కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః ॥ 8 ॥
గర్భాధారో గర్భవాసి శిశుజ్ఞాన ప్రదాయకః ।
గరుత్మత్తుల్యజవనో గరుడధ్వజవందితః ॥ 9 ॥
గయేడితో గయాశ్రాద్ధఫలదశ్చ గయాకృతిః ।
గదాధరావతారీచ గంధర్వనగరార్చితః ॥ 10 ॥
గంధర్వగానసంతుష్టో గరుడాగ్రజవందితః ।
గణరాత్ర సమారాధ్యో గర్హణస్తుతి సామ్యధీః ॥ 11 ॥
గర్తాభనాభిర్గవ్యూతిః దీర్ఘతుండో గభస్తిమాన్ ।
గర్హితాచార దూరశ్చ గరుడోపలభూషితః ॥ 12 ॥
గజారి విక్రమో గంధమూషవాజీ గతశ్రమః ।
గవేషణీయో గమనో గహనస్థ మునిస్తుతః ॥ 13 ॥
గవయచ్ఛిద్గండకభిద్గహ్వరాపథవారణః ।
గజదంతాయుధో గర్జద్రిపుఘ్నో గజకర్ణికః ॥ 14 ॥
గజచర్మామయచ్ఛేత్తా గణాధ్యక్షోగణార్చితః ।
గణికానర్తనప్రీతోగచ్ఛన్ గంధఫలీ ప్రియః ॥ 15 ॥
గంధకాది రసాధీశో గణకానందదాయకః ।
గరభాదిజనుర్హర్తా గండకీగాహనోత్సుకః ॥ 16 ॥
గండూషీకృతవారాశిః గరిమాలఘిమాదిదః ।
గవాక్షవత్సౌధవాసీగర్భితో గర్భిణీనుతః ॥ 17 ॥
గంధమాదనశైలాభో గండభేరుండవిక్రమః ।
గదితో గద్గదారావ సంస్తుతో గహ్వరీపతిః ॥ 18 ॥
గజేశాయ గరీయసే గద్యేడ్యోగతభీర్గదితాగమః ।
గర్హణీయ గుణాభావో గంగాదిక శుచిప్రదః ॥ 19 ॥
గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకః ।
ఏవం శ్రీగణనాథస్య నామ్నామష్టోత్తరం శతమ్ ॥ 20 ॥
పఠనాచ్ఛ్రవణాత్ పుంసాం శ్రేయః ప్రేమప్రదాయకమ్ ।
పూజాంతే యః పఠేన్నిత్యం ప్రీతస్సన్ తస్యవిఘ్నరాట్ ॥ 21 ॥
యం యం కామయతే కామం తం తం శీఘ్రం ప్రయచ్ఛతి ।
దూర్వయాభ్యర్చయన్ దేవమేకవింశతివాసరాన్ ॥ 22 ॥
ఏకవింశతివారం యో నిత్యం స్తోత్రం పఠేద్యది ।
తస్య ప్రసన్నో విఘ్నేశస్సర్వాన్ కామాన్ ప్రయచ్ఛతి ॥ 23 ॥
॥ ఇతి శ్రీ గణపతి గకార అష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥
Credits: @VVLNarasimham
Read Latest Post: