ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం | Dwadasa Jyotirlinga Stotram

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

Dwadasa Jyotirlinga Stotram

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం | Dwadasa Jyotirlinga Stotram అనేది శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలను స్తుతించే ఒక శైవ స్తోత్రం.ఈ స్తోత్రాన్ని శంకరాచార్యులు రచించారని నమ్ముతారు. భారతదేశం నందు కల పవిత్రమైన 12 ప్రాంతాలలో జ్యోతిర్లింగాల (Jyotirlinga) రూపంలో నెలకొని ఉన్నారు. దీనినే ద్వాదశ లింగాలుగా శివ భక్తులకు పవిత్రమైనదిగా ప్రసిద్ధి చెందినది. 

అందులో మొదటిగా సోమనాథ్ జ్యోతిర్లింగ (Shree Somnath Jyotirlinga), గోదావరి నది ఒడ్డున ఉన్న సౌరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలో, రెండవది, మల్లికార్జున జ్యోతిర్లింగ (Mallikarjuna Jyotirlinga), ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీశైలంలో, మూడవది, మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగ (Mahakaleshwar Jyotirlinga), మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీ నగరంలో, నాల్గవది, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ (Omkareshwar Jyotirlinga), మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా జిల్లానందు, ఐదవది, వైద్యనాథ్ జ్యోతిర్లింగ (Vaidyanath Jyotirlinga) (భైద్యనాథ్), జార్ఖండ్ రాష్ట్రమునందు, ఆరవది, భీమశంకర్ జ్యోతిర్లింగ (Bhimashankar Jyotirlinga), మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ నగరానికి సమీపంలో కలదు. 

ఏడవది, రామేశ్వరం జ్యోతిర్లింగ (Rameshwaram Jyotirlinga), తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం వద్ద, ఎనిమిదవది, నాగేశ్వరం జ్యోతిర్లింగ (Nageshwar Jyotirlinga), గుజరాత్ రాష్ట్రమునందు, తొమ్మిదవది, కాశీ విశ్వేశ్వర్ జ్యోతిర్లింగ (Vishwanath Jyotirlinga), ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసినందు, పదవది, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ (Trimbakeshwar Jyotirlinga), మహారాష్ట్ర రాష్ట్రంలో కల నాసిక్ జిల్లా త్రయంబక్ నందు, పదకొండవది, కేదారేశ్వర్ జ్యోతిర్లింగ (Kedarnath Temple), ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల వద్దగల మందాకినీ నది ఒడ్డున, పన్నెండవది, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ (Grishneshwar Jyotirlinga),  మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ వద్ద కలదు. 

ఈ పుణ్యక్షేత్రాలు ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేకత మరియు పురాతన చరిత్రను కలిగి ఉంది. అవి శివుని వివిధ అంశాలను సూచిస్తాయి. స్తోత్రం యొక్క పఠనం భక్తులకు ఆధ్యాత్మిక ప్రయోజనాలను, శ్రేయస్సు, సంపద మరియు మోక్షము లభిస్తుందని నమ్ముతారు. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం భక్తులకు శివుడితో లోతైన ఆధ్యాత్మికతను ఏర్పరచడానికి శక్తివంతమైన సాధనం. ప్రతి ఒక్కరూ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనము అత్యంత పుణ్యప్రదము.

Dwadasa Jyotirlinga Stotram

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం తెలుగులో

లఘు స్తోత్రం

సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥

సంపూర్ణ స్తోత్రం

సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ ।
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1 ॥

శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ ।
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ॥ 2 ॥

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ ।
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ॥ 3 ॥

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ ।
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ॥ 4 ॥

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ ।
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ॥ 5 ॥

యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ ।
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ॥ 6 ॥

శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః ।
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥ 7 ॥

యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః ।
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥ 8 ॥

సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ ।
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ 9 ॥

సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే ।
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ॥ 10 ॥

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః ।
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ॥ 11 ॥

ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ ।
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ॥ 12 ॥

జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ ।
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ॥

Credits: @Thedivine4u

Leave a Comment