ధన్యాష్టకం: ఐశ్వర్య మార్గం, మోక్ష సోపానం
హిందూ సాంప్రదాయంలో లభించే అనేక అపురూపమైన స్తోత్రాలలో “ధన్యాష్టకం” “Dhanyashtakam” ఒక రత్నం. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రంను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ ఆది శంకరాచార్యులచే (Adi Shankaracharya) రచించబడినది. శివ (Lord Shiva) పరమాత్మను స్తుతిస్తూ, భక్తుల జీవితాల్లో ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మిక సంపదలను అందించే శక్తిని కలిగి ఉంది.
ధన్యులు ఎవరు?
ధన్యాష్టకం యొక్క విశేషం ఏమిటంటే, ధనవంతులు లేదా ఐశ్వర్యం కలిగిన వారే ధన్యులు కాదని స్పష్టంగా చెబుతుంది.
- ఇంద్రియ జయం సాధించిన వారు: మన ఐదు ఇంద్రియాలు (కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం) మన మీద ప్రభావం చెలాయించకుండా, వాటిని అదుపులో ఉంచుకోగలిగిన వారు.
- విషయ వైరాగ్యం కలిగిన వారు: ఐశ్వర్యాన్ని, భౌతిక సుఖాలను కోరుకోకుండా, ఆడంబరాలకు దూరంగా ఉండి, ఆత్మ సాక్షాత్కారమే లక్ష్యంగా జీవితాన్ని సాగించే వారు.
- ఆత్మ సాక్షాత్కారమే పరమ గమ్యంగా ఉంచుకున్న వారు: ఈ లోకంలోని బంధాలను వదులుకుని, శాశ్వతమైన ఆనందాన్ని అందించే ఆత్మ సాక్షాత్కారమే పరమ లక్ష్యంగా బతికే వారు.
వీరినే ధన్యులు అంటుంది ధన్యాష్టకం.
ధన్యాష్టకం యొక్క ప్రాముఖ్యత:
- శివని కటాక్షం: ధన్యాష్టకం పఠించడం వల్ల శివుని కరుణ (Lord Shiva Blessings), అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
- భక్తుల రక్షణ: శివుడు లోకాలను రక్షించినట్లే, ఈ స్తోత్రం కూడా భక్తులను కష్టాలు, శత్రువులు (Enemies), భయాల నుండి కాపాడుతుందని నమ్మకం.
- ఆధ్యాత్మిక పరిణామం: ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనసు ఏకాగ్రత సాధించి, ఆత్మ జ్ఞానాన్ని(Self Knowledge) పెంపొందించుకోవచ్చని విశ్వాసం.
- శాంతి, సంతోషం: ధన్యాష్టకం పఠించడం వల్ల మనసు శాంతించి, అంతర్గత సంతోషం కలుగుతుందని భక్తులు భావిస్తారు.
- మోక్ష సాధన: ధన్యాష్టకంలోని శ్లోకాలు పరమాత్మ స్వరూపాన్ని, ఆత్మ తత్వాన్ని వివరిస్తాయి. ఈ జ్ఞానాన్ని ఆత్మా సాక్షాత్కారానికి మార్గంగా పరిగణిస్తారు.
ఆధునిక కాలంలో ధన్యాష్టకం యొక్క ప్రాముఖ్యత:
ముక్యంగా మన జీవితంలో మానసిక శాంతి కోసం ఎంతో మంది ఆరాటపడుతున్న ప్రస్తుత కాలంలో ధన్యాష్టకం ఒక ఆధ్యాత్మిక ఆశ్రయం లాంటిది. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనసు ఏకాగ్రత సాధించి, ప్రశాంతత చెందుతుంది. ధన్యాష్టకం లోని ఆధ్యాత్మిక సిద్ధాంతాలు మన రోజువారీ జీవితంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో సరైన దారి చూపించగలవు. ధన్యాష్టకం కేవలం శ్లోకాల సముదాయం మాత్రమే కాదు, ఇది జీవితాన్ని సకారాత్మక మార్గంలో మార్చే శక్తి ని కలిగి ఉంది. శ్రద్ధా భక్తులకు ఇది ఐహ పర సాఫల్యాన్ని అందించే అమృత హస్తం లాంటిది.
ధన్యాష్టకం | Dhanyashtakam
(ప్రహర్షణీవృత్తం)
తజ్జ్ఞానం ప్రశమకరం యదింద్రియాణాం
తజ్జ్ఞేయం యదుపనిషత్సు నిశ్చితార్థమ్ ।
తే ధన్యా భువి పరమార్థనిశ్చితేహాః
శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమంతః ॥ 1॥
(వసంతతిలకావృత్తం)
ఆదౌ విజిత్య విషయాన్మదమోహరాగ-
ద్వేషాదిశత్రుగణమాహృతయోగరాజ్యాః ।
జ్ఞాత్వా మతం సమనుభూయపరాత్మవిద్యా-
కాంతాసుఖం వనగృహే విచరంతి ధన్యాః ॥ 2॥
త్యక్త్వా గృహే రతిమధోగతిహేతుభూతాం
ఆత్మేచ్ఛయోపనిషదర్థరసం పిబంతః ।
వీతస్పృహా విషయభోగపదే విరక్తా
ధన్యాశ్చరంతి విజనేషు విరక్తసంగాః ॥ 3॥
త్యక్త్వా మమాహమితి బంధకరే పదే ద్వే
మానావమానసదృశాః సమదర్శినశ్చ ।
కర్తారమన్యమవగమ్య తదర్పితాని
కుర్వంతి కర్మపరిపాకఫలాని ధన్యాః ॥ 4॥
త్యక్త్వీషణాత్రయమవేక్షితమోక్షమర్గా
భైక్షామృతేన పరికల్పితదేహయాత్రాః ।
జ్యోతిః పరాత్పరతరం పరమాత్మసంజ్ఞం
ధన్యా ద్విజారహసి హృద్యవలోకయంతి ॥ 5॥
నాసన్న సన్న సదసన్న మహసన్నచాణు
న స్త్రీ పుమాన్న చ నపుంసకమేకబీజమ్ ।
యైర్బ్రహ్మ తత్సమముపాసితమేకచిత్తైః
ధన్యా విరేజురిత్తరేభవపాశబద్ధాః ॥ 6॥
అజ్ఞానపంకపరిమగ్నమపేతసారం
దుఃఖాలయం మరణజన్మజరావసక్తమ్ ।
సంసారబంధనమనిత్యమవేక్ష్య ధన్యా
జ్ఞానాసినా తదవశీర్య వినిశ్చయంతి ॥ 7॥
శాంతైరనన్యమతిభిర్మధురస్వభావైః
ఏకత్వనిశ్చితమనోభిరపేతమోహైః ।
సాకం వనేషు విజితాత్మపదస్వరుపం
తద్వస్తు సమ్యగనిశం విమృశంతి ధన్యాః ॥ 8॥
(మాలినీవృత్తం)
అహిమివ జనయోగం సర్వదా వర్జయేద్యః
కుణపమివ సునారీం త్యక్తుకామో విరాగీ ।
విషమివ విషయాన్యో మన్యమానో దురంతాన్
జయతి పరమహంసో ముక్తిభావం సమేతి ॥ 9॥
(శార్దూలవిక్రీడితవృత్తం)
సంపూర్ణం జగదేవ నందనవనం సర్వేఽపి కల్పద్రుమా
గాంగం వరి సమస్తవారినివహః పుణ్యాః సమస్తాః క్రియాః ।
వాచః ప్రాకృతసంస్కృతాః శ్రుతిశిరోవారాణసీ మేదినీ
సర్వావస్థితిరస్య వస్తువిషయా దృష్టే పరబ్రహ్మణి ॥ 10॥
॥ ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం ధన్యాష్టకం సమాప్తమ్ ॥
Credits : @JaydeepKanabar
Read Latest Post: