దారిద్య్ర దహన శివ స్తోత్రం |  Daridrya Dahana Siva Stotram

దారిద్య్ర దహన శివ స్తోత్రం

Daridrya Dahana Siva Stotram

జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో దారిద్య్రం (బీదరికం) ఒకటి. ఆర్థిక ఇబ్బందులు మనసుని, శరీరాన్ని, ఆత్మను కృంగదీస్తాయి. అలాంటి సమయాల్లో దిక్కుతోచని స్థితి, నిరాశ ఆవహిస్తాయి. కానీ ప్రాచీన కాలం నుండి ఆధ్యాత్మిక పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి “దారిద్య్ర దహన శివ స్తోత్రం” “Daridrya Dahana Siva Stotram”. ఈ స్తోత్రాన్ని వశిష్ఠ మహర్షి (Vasishtha) రచించారు. శివుని కరుణ, అనుగ్రహాలను పొందేందుకు మరియు దారిద్య్రం, దుఃఖం, అజ్ఞానం వంటి సమస్యల నుండి విముక్తి కోసము, సంపద, శ్రేయస్సు, మోక్షం కొరకు భక్తులు ప్రతినిత్యం పఠిస్తారు.

దారిద్య్ర దహన శివ స్తోత్రం (Daridrya Dahana Siva Stotram) ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రంలో శివుని వివిధ రూపాలను, గుణాలను స్తుతిస్తారు. “విశ్వేశ్వరాయ”, “గౌరీప్రియాయ”, “భక్తప్రియాయ”, “చర్మాంబరాయ” వంటి పదాలతో ఆయన దివ్యత్వాన్ని వర్ణిస్తారు. శివుని (Lord Siva) ధ్యానం చేస్తూ భక్తితో స్తోత్రం చెప్పుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.

ఈ పవిత్రమైన స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం వల్ల తమ దరిద్య్రం తగ్గి మంచి ఆర్థికంగా ఎదుగుదలతో పాటుగా మనస్సుకు శాంతి కలుగడం భక్తులు అనుభవిస్తారు. ఏ సమయమునైన మీకు ఆర్థికంగా కష్టాలు ఉంటే దారిద్య్ర దహన శివ స్తోత్రాన్ని పఠించి, శివుని కృపతో మీ సమస్యలకు పరిష్కారం దొరకగలవు.

 Daridrya Dahana Siva Stotram

దారిద్య్ర దహన శివ స్తోత్రం తెలుగు

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥

భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ ।
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ ।
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥

పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపయాయ ।
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥

భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ ।
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥

రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ ।
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ ।
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 8 ॥

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ ।
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గ మవాప్నుయాత్ ॥ 9 ॥

॥ ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రం సంపూర్ణమ్ ॥

Credits : @AmulyaAudiosandVideos

Read Latest Post: 

Leave a Comment