ఆయోధ్య రామ మందిరం | Ayodhya Ram Mandir

ఆయోధ్య రామ మందిరం | Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir
Image Credit: theprint.in

వివరణ

చరిత్ర కలిగిన అత్యంత పవిత్రమైన స్థలం ఐన శ్రీ రాముడు జన్మించిన ప్రదేశములో నిర్మాణము పూర్తి కావచ్చిన మందిరము “ఆయోధ్య రామ మందిరం” – “Ayodhya Ram Mandir”. శ్రీ రాముడు  విష్ణువు (Vishnu)  యొక్క ఏడవ అవతారంగా పురాణాలలో చెప్పబడింది.  శ్రీ రాముని జన్మస్థలం “అయోధ్య” – “Ayodhya” అనే నగరంలో సరయు నది ఒడ్డున ఉందని రామాయణం (Ramayan) చెబుతోంది. ప్రస్తుత అయోధ్య నగరం ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

ఆయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) చరిత్ర:

  • పురాతన మూలాలు: క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో అయోధ్యలో శ్రీ రాముడికి అంకితమైన ఓ దేవాలయం ఉందని పురాణాలు చెబుతాయి. ఈ ప్రదేశం ఎంతో కాలంగా హిందువుల పవిత్ర క్షేత్రంగా గుర్తించారు.
  • బాబర్ దండయాత్ర: 1527 లో మొఘల్ చక్రవర్తి బాబర్ అయోధ్యపై దండయాత్ర చేసి, శ్రీ రాముడి దేవాలయాన్ని కూల్చివేసి ఆ స్థానంలో బాబ్రీ మసీదు (Babri Masjid) నిర్మించాడు.
  • దీర్ఘకాల వివాదాలు: దేవాలయ స్థలంపై హిందువులు – ముస్లింల మధ్య దశాబ్దాల పాటు వివాదాలు జరిగాయి. న్యాయపోరాటాలు, ఆందోళనలు జరిగాయి. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పులో భాగంగా ఆలయ స్థలం హిందువులకు చెందిందని, వారు అక్కడ రాముడి ఆలయం (Ram Mandir) నిర్మించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. 
  • నిర్మాణ పురోగతి: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిరం నిర్మాణం వేగవంతం అయింది. ప్రస్తుతం ఆలయ నిర్మాణం చివరి దశలో ఉంది. 22 జనవరి 2024 నందు ప్రతిష్ఠ జరగనుందని నిర్ణయించారు. రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకలకు అయోధ్యాపురిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
Ayodhya Ram Mandir Model 1
Image Credit: @shriramteerthkshetra

Ayodhya Ram Mandir Model 2
Image Credit: @shriramteerthkshetra

Ayodhya Ram Mandir Model 3
Image Credit: @shriramteerthkshetra

శ్రీరామ జన్మభూమి ఆయోధ్య రామ మందిరం విశిష్టతలు:

  • Ayodhya Ram Mandir – అయోధ్యలోని రామమందిరం అద్భుతమైన నాగరశైలిలో ఆలయం నిర్మించబడుతోంది. ఆలయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు మరియు 161 అడుగుల ఎత్తు కలిగి ఉన్నది. 
  • మందిరము మూడు అంతస్తులతో, ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు, 392 స్తంభాలు, 44 ద్వారములు ఉన్నాయి. 
  • క్రింది అంతస్తులోని గర్భగుడిలో – భగవాన్ బాలరాముడి విగ్రహం (Balarama), మొదటి అంతస్తు గర్భగుడిలో – శ్రీరామ దర్బారు ఉన్నాయి. అనగా, సీతా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమంతుడి విగ్రహాలు కలిగి ఉన్నాయి. 
  • మొత్తం ఐదు మంటపాలు ఉన్నాయి. వాటిలో నృత్యమంటపం, రంగమంటపం, సభామంటపం, ప్రార్ధనామంటపం, సంగీత మంటపం కలిగి ఉన్నాయి. 
  • ప్రతి స్తంభము పైన మరియు గోడలపైన క్లిష్టమైన శిల్పకళతో దేవి, దేవతల రూపాలు ఉన్నాయి. 
  • ప్రధాన ఆలయం ప్రవేశ సింహ ద్వారము నందు 32 మెట్లు కలిగి, ఎత్తు 16.5 అడుగులుగా  ఉన్నాయి.  
  • నలువైపునందు దీర్ఘచతుస్రాకార ప్రహరీ గోడ 732 మీటర్ల పొడవు, 4.25 మీటర్ల వెడల్పు ఉన్నాయి. నాలుగు దిక్కులలో సూర్యాలయం, శివాలయం, గణపతి ఆలయం, భగవతీదేవి ఆలయంగా  నాలుగు ఆలయాలు నిర్మించారు. దక్షిణం నందు హనుమంతుని ఆలయం మరియు ఉత్తరం వైపు అన్నపూర్ణమాత ఆలయం ఉన్నది. మందిరం దక్షిణవైపున సీతమ్మవారు ఉపయోగించిన బావి సీతాకూపం ఉన్నది. 
  • శ్రీ రామ జన్మభూమి మందిర పరిసరాలలో మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, శబరీమాత, నిషాద రాజు గుహుడు, అహల్యాదేవి మందిరాలు ప్రతిపాదనలో ఉన్నాయి. రామ భక్తుడైన జటాయువు విగ్రహం కూడా నిర్మించారు. 
  • నిర్మాణ సహకారం: దేశం నలుమూలల నుండి భక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు ఆర్థికంగా సహకరించాయి. సంపూర్ణ భారత దేశమునుండి భక్తులు నిర్మాణానికి కావాల్సిన రాళ్లు, ఇతర వస్తువులను విరాళంగా ఇచ్చారు.

ఆలయం విస్తీర్ణం మరియు ఖర్చు:

  • Ayodhya Ram Mandir – అయోధ్యలోని రామమందిరం యొక్క ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయ సముదాయం దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది.  దాదాపు లక్ష మంది భక్తులకు వసతి కల్పించుదుకు ఏర్పాటు జరిగినది. 
  • ప్రధాన ఆలయం 161 అడుగుల పొడవు, 360 అడుగుల పొడవు మరియు 235 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇది మూడు అంతస్తులను కలిగి ఉంది, ఒక్కొక్కటి 20 అడుగుల ఎత్తు మరియు గ్రౌండ్ ఫ్లోర్‌లో 160 నిలువు వరుసలు ఉన్నాయి. మందిర సముదాయంలో కేంద్ర ఆలయం చుట్టూ మరో ఆరు ఆలయాలు కూడా ఉన్నాయి.
  • ప్రభుత్వ అధికారుల ప్రకారం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రూ.1800 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 18,000 కోట్ల అంచనా వ్యయంతో లార్సెన్ & టూబ్రో గ్రూప్ (L&T) ఆలయ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.
  • భారతదేశంలో సగటు ఆలయాన్ని నిర్మించడానికి అయ్యే ఖర్చు ₹1 కోటి నుండి ₹100 కోట్లు (సుమారు $140,000 నుండి $14 మిలియన్లు) లేదా అంతకంటే ఎక్కువ, నిర్మాణం యొక్క స్థాయి మరియు గొప్పతనాన్ని బట్టి ఉంటుంది.
  • 2020 ఆగస్టు 5న అయోధ్యలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ కావించారు.  నాటి నుంచి మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ప్రత్యేకమైన రాళ్లు మరియు శిల్పకళ:

  • గోపురాలపై చెక్కిన శిల్పాలు పురాణ ఘట్టాలను, దేవతామూర్తులను ఎంతో నైపుణ్యంతో చిత్రిస్తాయి. ప్రతి విగ్రహం, నమూనా అద్భుతమైన ఖచ్చితత్వంతో రూపొందించ బడినది. 
  • రాతి గోడలపై లతలు, పువ్వులు, రాక్షస, గంధర్వ, యక్షుల విగ్రహాలు క్లిష్టమైన చిత్రలేఖన పద్ధతులతో చెక్కబడ్డాయి. 
  • శిల్పకళ భారతదేశపు సాంప్రదాయ శిల్పకళా వారసత్వాన్ని చాటుతాయి.  శిల్పకళా పరిజ్ఞానం ఉన్న కళాకారులు రాత్రింబవళ్లూ శ్రమించి ఈ అద్భుత కళాఖండాన్ని సృష్టించారు. 
  • ఆలయ నిర్మాణానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేకమైన రాళ్లను వినియోగించారు. రాజస్థాన్ నుండి Pink Sand Stone – గులాబీ రంగురాళ్లను, కర్ణాటక నుండి గ్రానైట్, రాజస్థాన్‌కు చెందిన మక్రానా పాలరాయిని, తమిళనాడు మరియు తెలంగాణకు చెందిన గ్రానైట్ రాయిని, మధ్యప్రదేశ్‌లోని మాండ్లా నుండి రంగు పాలరాయిని ఆలయంలో ఉపయోగించారు. 
  • శాలిగ్రామ్ రాళ్ళు (Shaligram Stone): నేపాల్‌లోని గండకీ నది ఒడ్డు నుండి రెండు భారీ శాలిగ్రామ రాళ్లను రాముడు మరియు జానకి విగ్రహాల నిర్మాణానికి ఉపయోగించారు. రాళ్లు 30 టన్నులు మరియు 14-15 టన్నులు. కార్కళ రాయి: కర్నాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్న చిన్న కొండపై నుంచి భారీ రాతిని రాముడి విగ్రహ నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఇలా ప్రతి రాతికి ఒక ప్రత్యేకతతో నిర్మిపబడినది. 
  • నేపాలీ శైలిలో నిర్మించిన గోపురాలపై శ్రీరాముడి జీవిత కథ, హిందూ పురాణ ఘట్టాలు, దేవతామూర్తులతో కూడిన క్లిష్టమైన శిల్పాలు ఆవిష్కరించారు.
  • ఆలయంలోని ప్రతి స్థంభం, గోడ, లోపలి గర్భగుడి కూడా ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన శిల్పులతో అలంకరించబడినది. ఇది భారతదేశపు చారిత్రక దివ్య కళాకృతిగా నిలిచిపోతుంది అనడానికి సందేహము లేదు. ప్రముఖ శిల్పకారులు, నిర్మాణ నిపుణులు కూడా అత్యంత నైపుణ్యంతో, భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మించారు.  
  • రామమందిరం నిర్మాణానికి దేశం నలుమూలల నుండి భక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు విరాళాలు ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహించి నిర్మాణానికి మార్గం సుగమం చేసిన వ్యక్తులు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి సామాజిక సంస్థలు, రామ భక్తుల గ్రూపులు… ఇలా అనేక మంది ఈ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.
Ayodhya Ram Mandir pillar puja

Ayodhya Ram Mandir pillar 1

Ayodhya Ram Mandir pillar 2

శ్రీ రాముడి విగ్రహ నిర్మాణం:

  • శ్రీరామచంద్రమూర్తి విగ్రహ నిర్మాణం అత్యంత పవిత్రమైన, జాగ్రత్త వహించే పని. 151 అడుగుల ఎత్తుతో రూపొందుతున్న ఈ విగ్రహం భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహాలలో ఒకటి.
  • గ్రానైట్ రాతితో చెక్కిన ఈ విగ్రహం రాముడి శాంత స్వరూపాన్ని, దివ్య కాంతిని ఎంతో సహజంగా ఉంటుంది. విగ్రహానికి విలువైన రత్నాలు, వజ్రాలు, ముత్యాలతో  చేయబడుతున్న అలంకారాలు, ఆభరణాలు కూడా ప్రత్యేకమైన డిజైన్‌లతో తయారు చేయబడ్డాయి. 
  • విగ్రహ నిర్మాణంలో వేద పండితులు పారాయణాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాముడి ఆశీర్వాదాలు ఈ విగ్రహం ద్వారా ప్రజలకు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:

  • రాముడి జన్మస్థలం: హిందువులకు శ్రీ రాముడు ధర్మం, ధైర్యం, విధేయత యొక్క చిహ్నం. శ్రీ రాముడి జన్మస్థలం కాబట్టి ఈ మందిరం ఎంతో పవిత్రమైనది.
  • పర్యాటక వృద్ధి: ఆలయ నిర్మాణం వల్ల విశేషంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అయోధ్య పట్టణం మరియు చుట్టుప్రక్కల గ్రామాలూ సుందరీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మరియు అభివృద్ధి అనేకంగా అభివృద్ధి చెందుతాయి. .
  • సాంస్కృతిక పునరుజ్జీవనం: రామమందిరం నిర్మాణంతో రాముడి సంబంధిత పురాతనమైన కళలు, సంస్కృతి పునరుజ్జీవనం చెందుతాయని ఆశిస్తున్నారు. రాముడి జీవితం, పితృభక్తి, జీవనవిధానం ఆదర్శప్రాయముగా  భక్తులను ప్రేరిపిసుంది.

అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం:

  • దేశ విదేశీయులకు అందుబాటులో ఉండటానికి అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పినారు. అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం (Maharishi Valmiki International Airport) అని పేరుతో నామకరణం చేసారు. నూతనంగా నిర్మించిన విమానాశ్రయం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య నగరికు 15 కిలోమీటరు దూరంలో ఉన్న ఫైజాబాద్‌లో కలదు. దీన్ని డిసెంబర్ 30, 2023న దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ప్రారంభించి దేశానికి అంకితం చేసారు. 
  • విమానాశ్రయం టెర్మినల్ భవనం యొక్క ముఖభాగం అయోధ్యలో రాముడి ఆలయం (Ram Mandir) యొక్క ఆలయ నిర్మాణాన్ని వర్ణిస్తుంది. లోపలి భాగాన్ని స్థానిక కళలు, పెయింటింగ్‌లు మరియు రాముడి జీవితాన్ని వర్ణించే చిత్రాలతో అలంకరించారు. దేశ విదేశీయులు అడుగు పెట్టగానే శ్రీ రాముడి పట్ల భక్తి భావన, ఆధ్యాత్మిక భావన కలిగేలా అత్యంత సుందరంగా ప్రత్యేక శ్రద్దగా నిర్మించారు. 
  • విమానాశ్రయం నందు టెర్మినల్ భవనం 6,500 చదరపు మీటర్లు కలదు. విమానాశ్రయం గరిష్టంగా 750 కంటే ఎక్కువ మంది ప్రయాణీకులను మరియు గంటకు నాలుగు విమానాల సామర్త్యం కలిగి ఉంది. అంచనాప్రకారం ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ప్రయాణీకులకు సేవలను అందించగల సామర్త్యం కలదు. 821 ఎకరాల్లో మూడు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. మొదటి దశలో గంటకు రెండు నుండి మూడు విమానాలను నిర్వహించగల 65,000 చదరపు అడుగుల టెర్మినల్ నిర్మించారు. వేగంగా దేశంలో కల  అన్ని ముఖ్య నగరమునుండి సేవలు అందేలా విస్తరింపచేస్తారు.
ayodhya Intenational Airport
Image Credit: the hindu

ముగింపు:

ఆయోధ్య రామ మందిరం | Ayodhya Ram Mandir నిర్మాణం కేవలం ఆలయ నిర్మాణం కాదు, భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని, ఆధ్యాత్మికతను పునరుజ్జీవింపచేసే ఒక గొప్ప కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోతుంది. రామమందిరం నిర్మాణం హిందువుల ఐక్యతకు చిహ్నంగా మాత్రమే కాకుండా, భారతదేశపు సమగ్రతకు, బహుళత్వ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని ఆశిస్తున్నాము.

All Image Credits: @shriramteerthkshetra

Explore more Temples Details : Click Here

Explore More Storta : Click Here

Leave a Comment