సరస్వతి అష్టోత్తర శత నామావళి | Saraswati Ashtottara Shatanamavali

సరస్వతి అష్టోత్తర శత నామావళి: జ్ఞానదేవి స్తుతి గీతం

Saraswati Ashtottara Shatanamavali

సరస్వతీ అష్టోత్తర శత నామావళి (Saraswati Ashtottara Shatanamavali) అనేది 108 పేర్లతో కూడిన సరస్వతి యొక్క స్తోత్రం. ఈ స్తోత్రం సరస్వతి (Saraswati) యొక్క వివిధ రూపాలు, లక్షణాలు మరియు శక్తులను కీర్తిస్తుంది. సరస్వతి జ్ఞానం, సంగీతం, కళలు మరియు వాక్చాతుర్యం యొక్క దేవత. అందుకే, ఆమెను స్తుతించే “సరస్వతీ అష్టోత్తర శత నామావళి” ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానం, మేధస్సు మరియు సృజనాత్మకత పెరుగుతాయని నమ్ముతారు.

స్తోత్రం యొక్క ప్రాముఖ్యత:

  • జ్ఞానం పెరుగుదల: సరస్వతిదేవిను (Saraswati Devi) జ్ఞానదేవి అంటారు. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మన మేధస్సు, జ్ఞాపకశక్తి మరియు విద్యార్థులలో విద్యార్జన సామర్థ్యం పెరుగుతాయని నమ్ముతారు.
  • సృజనాత్మకత పెంపొందించడం: కళలు, సంగీతం, రచన వంటి సృజనాత్మక రంగాలకు చెందిన వారు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా తమ లోని సృజనాత్మకతను మరింత పదును పెట్టుకోవచ్చు.
  • వాక్చాతుర్యం పెరుగుదల: సరస్వతి వాక్చాతుర్యానికి దేవత. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మన వాక్పటిమ పదును పెరుగుతుంది, మనం మన ఆలోచనలను స్పష్టంగా, ప్రభావవంతంగా వ్యక్తీకరించగలం.
  • ఆధ్యాత్మిక అభివృద్ధి: ఏ దైవ స్తోత్రమైనా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.  మన ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుంది. సరస్వతీ అష్టోత్తర శత నామావళి కూడా ఇందుకు మినహాయింపు కాదు.

సరస్వతీ అష్టోత్తర శత నామావళి (Saraswati Ashtottara Shatanamavali) స్తోత్రాన్ని పఠించడం ద్వారా జ్ఞానం, మేధస్సు, సృజనాత్మకత పెరగడంతోపాటు, ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందే అవకాశం లభిస్తుంది. వసంత పంచమి (Vasant Panchami) నాడు చిన్న పిల్లలకు విద్యారంభము రోజున, మరియు పాఠశాల వెళ్ళు విద్యార్థులు సరస్వతి పూజ (Saraswati Puja) నాడు ఈ స్తోత్రం పఠించడం విశిష్ఠము. సరస్వతీ అష్టోత్తర శత నామావళిను సంక్షిప్త రూపములో సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా చదువుకోవచ్చును.

Saraswati Ashtottara Shatanamavali

సరస్వతి అష్టోత్తర శత నామావళి తెలుగు

ఓం శ్రీ సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మవక్త్రికాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్తకహస్తాయై నమః (10)

ఓం జ్ఞానముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం కామరూపాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాపాతక నాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగాయై నమః (20)

ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః (30)

ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః (40)

ఓం వసుధాయై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యావాసాయై నమః (50)

ఓం చండికాయై నమః
ఓం సుభద్రాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః
ఓం సౌదామిన్యై నమః
ఓం సుధామూర్తయే నమః
ఓం సువీణాయై నమః (60)

ఓం సువాసిన్యై నమః
ఓం విద్యారూపాయై నమః
ఓం బ్రహ్మజాయాయై నమః
ఓం విశాలాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః
ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం శుభదాయై నమః (70)

ఓం శాస్త్రరూపిణ్యై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురాసుర నమస్కృతాయై నమః
ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం ముండకాంబికాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం ప్రహరణాయై నమః
ఓం కళాధారాయై నమః (80)

ఓం నిరంజనాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వారిజాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్రగంధాయై నమః
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః (90)

ఓం వంద్యాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం ద్విభుజాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం నీలజంఘాయై నమః
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః (100)

ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మంత్రవిద్యాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం మహాసరస్వత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం జ్ఞానైకతత్పరాయై నమః (108)

ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామావళిః సమాప్తా ॥

Read Latest Post

Leave a Comment