సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం
సరస్వతీ అష్టోత్తర శతనామ స్తోత్రం – Saraswati Ashtottara Shatanama Stotram అనేది విద్యాదేవి అయిన శ్రీ సరస్వతీ దేవిని స్తుతించే ఒక శక్తివంతమైన స్తోత్రం. ఈ స్తోత్రంలో 108 నామాలు స్తోత్ర రూపములో ఉన్నాయి, ప్రతి స్తోత్రం దేవి యొక్క ఒక ప్రత్యేకమైన గుణాన్ని వర్ణిస్తాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించడం వల్ల జ్ఞానం, వివేకం, మేధస్సు, మరియు సృజనాత్మకత వంటి లక్షణాలు పెరుగుతాయని నమ్ముతారు. ఈ స్తోత్రం శివ పురాణం (Siva Puranam) నందు సరస్వతి దేవి శివునికి (Lord Shiva) బోదించినట్టు, బ్రహ్మవైవర్త పురాణం నందు ఋషులచే గానం చేసినట్టు, దేవీ భాగవతం నందు సరస్వతీ దేవి యొక్క శక్తులను వివరించినట్టుగా ముఖ్యమైన ప్రస్తావనలు కలిగి ఉన్నాయి.
స్తోత్రం యొక్క ప్రాముఖ్యత:
ఈ స్తోత్రం శ్రీ సరస్వతీ దేవిని (Saraswati Devi) ప్రసన్నం చేసుకోవడానికి ఒక గొప్ప మార్గం. జ్ఞానం, విద్య, మరియు కళలలో రాణించాలనుకునే వారికి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండడానికి మరియు ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది. ఈ స్తోత్రం చదవడం వలన జ్ఞానం, వివేకం, మరియు మేధాశక్తి పెరుగుతాయని నమ్ముతారు. విద్యార్థులు ఈ స్తోత్రం చదివితే వారి చదువుల్లో రాణిస్తారని చెబుతారు. ప్రత్యేకముగా వసంతపంచమి (Vasant Panchami) నాడు సరస్వతి పూజ (Saraswati Puja) నిర్వహించి ఈ స్తోత్రం పఠిస్తారు. కళాకారులు ఈ స్తోత్రం చదివితే వారి కళా ప్రతిభ మరింత పెరుగుతుందని నమ్ముతారు. వాక్చాతుర్యం కావాలనుకునే వారు ఈ స్తోత్రం చదివితే వారి మాటలకు శక్తి పెరుగుతుందని చెబుతారు.
ఈ స్తోత్రంలోని ప్రతి నామం ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంది. కొన్ని ముఖ్యమైన నామాలలో జ్ఞానం, విద్య, మరియు సంగీతానికి దేవతగా “సరస్వతీదేవి”, మాటల దేవతగా “వాగ్దేవి”, బ్రహ్మదేవుని కుమార్తెగా “బ్రహ్మపుత్రి”, శరదృతువు యొక్క దేవతగా “శారద”, విశ్వానికి జన్మనిచ్చిన దేవతగా “విశ్వజనని”, కళల యొక్క దేవతగా “కళాదేవి” కీర్తించబడినది.
సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం పఠించడం వల్ల విద్య, జ్ఞానం, సృజనాత్మకత వంటి రంగాలలో రాణించడానికి సహాయపడుతుంది. ఈ స్తోత్రం దేవీ సరస్వతి యొక్క అనుగ్రహం పొందడానికి ఒక శక్తివంతమైన మార్గం.
Saraswati Ashtottara Shatanama Stotram in Telugu
సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం తెలుగు
సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రిగా ॥ 1 ॥
శివానుజా పుస్తకహస్తా జ్ఞానముద్రా రమా చ వై
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ ॥ 2 ॥
మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా
మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా ॥ 3 ॥
మహాకాళీ మహాపాశా మహాకారా మహాంకుశా
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ ॥ 4 ॥
చంద్రికా చంద్రలేఖావిభూషితా చ మహాఫలా
సావిత్రీ సురసాదేవీ దివ్యాలంకారభూషితా ॥ 5 ॥
వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా చ భోగదా
గోవిందా భారతీ భామా గోమతీ జటిలా తథా ॥ 6 ॥
వింధ్యవాసా చండికా చ సుభద్రా సురపూజితా
వినిద్రా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా ॥ 7 ॥
సౌదామినీ సుధామూర్తి స్సువీణా చ సువాసినీ
విద్యారూపా బ్రహ్మజాయా విశాలా పద్మలోచనా ॥ 8 ॥
శుంభాసురప్రమథినీ ధూమ్రలోచనమర్దనా
సర్వాత్మికా త్రయీమూర్తి శ్శుభదా శాస్త్రరూపిణీ ॥ 9 ॥
సర్వదేవస్తుతా సౌయా సురాసురనమస్కృతా
రక్తబీజనిహంత్రీ చ చాముండా ముండకాంబికా ॥ 10 ॥
కాళరాత్రిః ప్రహరణా కళాధారా నిరంజనా
వరారోహా చ వాగ్దేవీ వారాహీ వారిజాసనా ॥ 11 ॥
చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా
కాంతా కామప్రదా వంద్యా రూపసౌభాగ్యదాయినీ ॥ 12 ॥
శ్వేతాసనా రక్తమధ్యా ద్విభుజా సురపూజితా
నిరంజనా నీలజంఘా చతుర్వర్గఫలప్రదా ॥ 13 ॥
చతురాననసామ్రాజ్ఞీ బ్రహ్మవిష్ణుశివాత్మికా
హంసాననా మహావిద్యా మంత్రవిద్యా సరస్వతీ ॥ 14 ॥
మహాసరస్వతీ తంత్రవిద్యా జ్ఞానైకతత్పరా
ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణమ్ ।
Credits: @srimoolasthanayellammadevo4537
Also read
Read More Stotra