శివ మంగళాష్టకం
శివ మంగళాష్టకం | Shiva Mangalashtakam ఒక ప్రసిద్ధ శైవ స్తోత్రం. శివుని కొలుస్తూ ఉన్నఈ స్తోత్రం ఎనిమిది శ్లోకాలతో (అష్టకం) కూడి ఉంటుంది. , ఇందులో శివుని అనేక రూపాలు మరియు గుణాలను స్తుతిస్తారు. ఈ స్తోత్రం శివుని అనుగ్రహం పొందడానికి మరియు మంగళం సిద్ధించడానికి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.
ఈ శ్లోకంలో శివుడిని (Lord Siva) అనేక నామాలతో, ఉదాహరణగా “భవాయ” అంటే “జన్మకు కారణమైనవాడు”, “చంద్రచూడాయ” అంటే “చంద్రుడిని తలపై ధరించినవాడు”, “నిర్గుణాయ” అంటే “గుణాలకు అతీతమైనవాడు”, “గుణాత్మనే” అంటే “గుణాలను కలిగి ఉన్నవాడు”, “కాలకాలాయ” అంటే “కాలానికి కాలమైనవాడు”, “రుద్రాయ” అంటే “దుష్టశక్తులను నాశనం చేసేవాడు”, మరియు “నీలగ్రీవాయ” అంటే “నీలమైన మెడ కలిగినవాడు” అని అర్థం. ఇలా ప్రతి పదమునకు ప్రత్యేకమైన అర్థం కలిగి ఉన్నది.
శివ మంగళాష్టకం (Shiva Mangalashtakam) స్తోత్రం భగవంతుడైన శివుని పట్ల భక్తిని పెంపొందించడానికి, శివుని అనుగ్రహం పొందటానికి, జీవితంలోని అన్ని రకాల కష్టాలను తోలహించడానికి, భక్తులకు మంగళం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ స్తోత్రం ఒక అద్భుతమైన స్తోత్రంగా మరియు భక్తులకు శివుని అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడుతుంది. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించడం వల్ల భక్తులకు సమస్త శుభాలు కలుగుతాయి.
Shiva Mangalashtakam
శివ మంగళాష్టకం తెలుగులో
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే ।
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ॥ 1 ॥
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ ।
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ॥ 2 ॥
భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే ।
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ॥ 3 ॥
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే ।
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ॥ 4 ॥
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే ।
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ॥ 5 ॥
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ।
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ॥ 6 ॥
సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే ।
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ ॥ 7 ॥
సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ ।
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ॥ 8 ॥
మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ ।
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ॥ 9 ॥
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే ।
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ ॥ 1 ॥
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ ।
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ॥ 2 ॥
భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే ।
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ ॥ 3 ॥
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే ।
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ॥ 4 ॥
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే ।
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ॥ 5 ॥
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ।
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ॥ 6 ॥
సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే ।
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ ॥ 7 ॥
సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ ।
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ॥ 8 ॥
మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ ।
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ॥ 9 ॥
|| Om Namah Shivay ||