మన్యు సూక్తం

మన్యు సూక్తం | Manyu Suktam ఋగ్వేదంలోని (Rigveda) 10 వ మండలంలోని 83 వ, 84 వ సూక్తాలుగా ఉన్నాయి. ఈ సూక్తంలో మొత్తం 14 శ్లోకాలు ఉన్నాయి. ఈ సూక్తం మన్యు అనే దేవతకు అంకితం చేయబడింది. ఈ సూక్తంలో మన్యుని వివిధ రూపాలు మరియు శక్తులను స్తుతిస్తారు. మన్యు ధర్మాన్ని రక్షించేవాడు, శత్రువులను నాశనం చేసేవాడు, భక్తులను కాపాడేవాడు.
సంస్కృతంలో “మన్యు” అంటే కోపం, ఉగ్రత అని అర్థం. కానీ, కేవలం కోపాన్ని ప్రదర్శించే దేవత కాదు మన్యుడు. న్యాయాన్ని కాపాడేవాడు, శత్రువులను నాశనం చేసేవాడు, భక్తులకు రక్షణ కవచం ఆదుకునేవాడు. అందుకే, మన్యు సూక్తంలో ఆయనను ఎంతో శక్తివంతుడిగా, ధర్మ రక్షకుడిగా స్తుతిస్తారు.
మన్యు సూక్తం పఠించడం వల్ల శత్రు బాధలు తొలగిపోయి, విజయం సొంతం అవుతుంది. జీవితంలో అన్ని రకాల రక్షణ కలుగుతుంది. కోపం, ఈర్ష్యమ్ వంటి ప్రతికూల భావోద్వేగాల నుండి బయటపడేందుకు సహాయపడుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మనస్సుకు ప్రశాంతత కలగడానికి దోహదపడుతుంది.
Manyu Suktam
మన్యు సూక్తం తెలుగులో
బుగ్వేద సంహితా; మండలం 10; సూక్తం 83,84
యస్తే మన్యో౬వీధద్ వజ్ర సాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషక్ |
సాహ్యామ దాసమార్యం త్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వతా ॥ 1 ॥
మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్ హోతా వరుణో జాతవేదాః |
మన్యుం-వీశ ఈళతే మానుషీర్యాః పాహి నో మన్యో తపసా సజోషాః ॥ 2 ॥
అభీహి మన్యో తవసస్తవీయాన్ తపసా యుజా వి జహి శత్రూన్ |
అమిత్రహా వృత్రహా దస్యుహా చ విశ్వా వసూన్యా భరా త్వం నః ॥ 3 ॥
త్వంహి మేన్యో అభిభూత్యోజాః స్వయంభూర్భామో అభిమాతిషాహః |
విశ్వచర్ -షణిః సహురిః సప వాన స్మాస్వోజః పృతనాసు ధేహి | 4॥
అభాగః సన్నప పరేతో అస్మి తవ క్రత్వా తవిషస్య ప్రచేతః |
తం త్వా మన్యో అక్రతుర్దీహీళశాహం స్వాతనూర్చలదేయాయ మేహి ॥ 5 ॥
అయం తే అస్మ్యుప మేహ్యర్వాజ్ ప్రతీచీనః సహురే విశ్వధాయః |
మన్యో వజ్రిన్నభి మామా వవృత్స్వహనావ దస్యూన్ బుత బోధ్యాపేః ॥ 6 ||
అభి ప్రేహి దక్షిణతో భవా మే౭౬ధా వృత్రాణి జంఘనావ భూరీ |
జుహోమీ తే ధరుణం మధ్య్వో అగ్రముభా ఉపాంశు ప్రథమా పీబావ ॥ 7 ॥
త్వయా మన్యో సరథమారుజంతో హర్ షమాణాసో ధృషితా మరుత్వః |
తిగ్మేషవ ఆయుధా సంశిశానా అభి ప్రయంతు నరో అగ్నిరూపాః ॥ 8 ॥
అగ్నిరీవ మన్యో త్విషితః సహస్వ సేనానీర్నః సహురే హూత నీధి |
హత్య్వాయ శత్రూన్ వి భజస్వ వేద ఓజో మిమానో విమృథో నుదస్వ 11 9 ॥
సహస్వ మన్యో అభిమాతిమస్మే రుజన్ మృణన్ ప్రమృణన్ ప్రేహి శత్రూన్ |
ఉగ్రం తే పాజో నన్వా రురుద్రే వశీ వశం నయస ఏకజ త్వమ్ ॥ 10 ॥
ఏకో బహూనామసి మన్యవీళితో విశంవీశం-యుధయే సం శీశాధి |
అకృత్తరుక్ త్వయా యుజా వయం ద్యుమంతం ఘోషం-వీజయాయ కృణ్మహే ॥ 11 ॥
విజేషకృదింద్ర ఇవానవబ్రవో3౬( సఓ్మ)ాక ం మన్యో అధిపా భవేహ |
ప్రియం తే నామే సహురే గృణీమసి విద్మాతముత్సం-యత ఆబభూధథ ॥ 12 ॥
ఆభూత్యా సహజా వజ్ర సాయక సహో బిభర్ ష్యభిభూత ఉత్తరమ్ |
క్రత్వా నో మన్యో సహమేద్యేధి మహాధనస్య పురుహూత సంస్కృజి ॥ 13 ॥
సంస్కష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం-వరుణశ్చ మన్యుః |
భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అప నిలయంతామ్ ॥ 14 ॥
ధన్వనాగాధన్వ నాజింజయేమ ధన్వనా తీవ్రాః సమదో జయేమ |
ధనుః శత్రోరపకామం కృణోతి ధన్వ నాసర్వాః ప్రదిశో జయేమ ॥
భద్రం నో అపీ వాతయ మనః ॥
ఓం శాంతా పృథివీ శీవమంతరిక్షం ద్యౌర్నో దేవ్యఃభయన్నో అస్తు |
శివా దిశః ప్రదిశ ఉద్దిశో న౬ఆపో విశ్వతః పరీపాంతు సర్వతః శాంతిః శాంతిః శాంతిః Il
|| Om Namah Shivay ||
సూచిక: ఈ సూక్తమునందు ప్రత్యేకమైన స్వరములతో కూడియున్నది. కావున తప్పక అనుభవజ్ఞుడైన గురువులతో అభ్యాసం చేసి పఠించాలి.
Read Latest Post:
- Sri Bala Tripura Sundari Ashtothram | శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం
- Tripura Sundari Pancharatna Stotram | త్రిపురసుందరీ పంచరత్న స్తోత్రం
- Arjuna Kruta Durga Stotram – అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రం
- Maha Mrityunjaya Stotram – మహా మృత్యుంజయ స్తోత్రం
- Nirvana Shatkam | నిర్వాణషట్కం
- Shiva Panchakshari Stotram | శివ పంచాక్షరి స్తోత్రం





