శివ అష్టోత్తర శత నామ స్తోత్రం | Shiva Ashtottara Sata Nama Stotram

శివ అష్టోత్తర శత నామ స్తోత్రం

Shiva Ashtottara Sata Nama Stotram

శివ అష్టోత్తర శత నామ స్తోత్రం | Shiva Ashtottara Sata Nama Stotram అనేది 108 శక్తివంతమైన పేర్లతో 13 పద్యాల కూర్పు కలిగిన ఈ స్తోత్రం, శివుని అనంతమైన అంశాలను స్తుతిస్తుంది. శతనామావళి కు సూక్ష్మరూపం శతనామ స్తోత్రం. ఈ స్తోత్రం ఆధ్యాత్మిక పరివర్తనకు దారితీసే అద్భుతమైన మార్గదర్శి.

శివ అష్టోత్తర శత నామ స్తోత్రం నందు శివుని (Lord Siva) వివిధ రూపాలు, గుణాలు మరియు శక్తులను సూచిస్తాయి. ఉదాహరణకు, “నీలకంఠ” అనే పేరు శివుని విషాన్ని మింగి ప్రపంచాన్ని రక్షించిన కథను గుర్తుకు తెస్తుంది. ఈ పేరు, మనం కష్టమైన సమయాల్లో కూడా ధైర్యంగా, దయతో ఉండాలని మనకు బోధిస్తుంది. “మృత్యుంజయ” అనే పేరు, మరణాన్ని జయించిన శివుని శక్తిని సూచిస్తుంది. ఇది, జీవితంలోని అన్ని రకాల అడ్డంకులను అధిగమించాలనే ధైర్యాన్ని మనకు ఇస్తుంది.

స్తోత్రం యొక్క పఠనంద్వారా ఆధ్యాత్మిక ప్రయాణంలో శివునితో మన సంబంధాన్ని బలోపేతుంది, మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. జపం యొక్క అనంత శక్తి వల్ల గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది.

శివ అష్టోత్తర శత నామ స్తోత్రం (Shiva Ashtottara Sata Nama Stotram) అనుభవాలకు అతీతమైన ప్రయాణం. ఇది మనల్ని శివునికి చేరువ చేస్తుంది. మన ఆధ్యాత్మిక పరివర్తనకు దారితీస్తుంది. ఒత్తిడి నుండి ఉపశమనం, ఆధ్యాత్మికత, శివుడి ఆశిర్వాదాల కొరకు ఈ స్తోత్రం సహాయపడుతుంది.

Shiva Ashtottara Sata Nama Stotram

శివ అష్టోత్తర శత నామ స్తోత్రం తెలుగులో

శివో మహేశ్వర-శ్శంభుః పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ॥ 1 ॥

శంకర-శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టోఽంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః ॥ 2 ॥

భవ-శ్శర్వ-స్త్రిలోకేశః శితికంఠః శివాప్రియః
ఉగ్రః కపాలీ కామారి రంధకాసురసూదనః ॥ 3 ॥

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః
భీమః పరశుహస్తశ్చ మృగపాణి-ర్జటాధరః ॥ 4 ॥

కైలాసవాసీ కవచీ కఠోర-స్త్రిపురాంతకః
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః ॥ 5 ॥

సామప్రియ-స్స్వరమయ-స్త్రయీమూర్తి-రనీశ్వరః
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ॥ 6 ॥

హవి-ర్యజ్ఞమయ-స్సోమః పంచవక్త్ర-స్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ॥ 7 ॥

హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోఽనఘః
భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ॥ 8 ॥

కృత్తివాసాః పురారాతి-ర్భగవాన్ ప్రమథాధిపః
మృత్యుంజయ-స్సూక్ష్మతను-ర్జగద్వ్యాపీ జగద్గురుః ॥ 9 ॥

వ్యోమకేశో మహాసేనజనక-శ్చారువిక్రమః
రుద్రో భూతపతిః స్థాణు-రహిర్భుధ్న్యో దిగంబరః ॥ 10 ॥

అష్టమూర్తి-రనేకాత్మా సాత్త్విక-శ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశు-రజః పాశవిమోచకః ॥ 11 ॥

మృడః పశుపతి-ర్దేవో మహాదేవోఽవ్యయో హరిః
పూషదంతభి-దవ్యగ్రో దక్షాధ్వరహరో హరః ॥ 12 ॥

భగనేత్రభి-దవ్యక్తో సహస్రాక్ష-స్సహస్రపాత్
అపవర్గప్రదోఽనంత-స్తారకః పరమేశ్వరః ॥ 13 ॥

ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ ॥

ఇతి శ్రీ శివాష్టోత్తరశతనామస్తోత్రరత్నం సమాప్తమ్ ।

|| Om Nama Shivaya ||

Leave a Comment