బిల్వాష్టకం | Bilvashtakam Lyrics

బిల్వాష్టకం తెలుగులో

Bilvashtakam Lyrics

బిల్వాష్టకం – Bilvashtakam Lyrics అనేది శివునికి అంకితం చేయబడిన ఒక శైవ స్తోత్రం. ఇది ఎనిమిది శ్లోకాలతో కూడుకున్నది. బిల్వ పత్రం శివునికి (Lord Siva) అత్యంత ప్రీతిపాత్రమైనది. బిల్వాష్టకం నందు బిల్వ వృక్షం, బిల్వ పత్రము యొక్క ప్రాముఖ్యతను మరియు దానిని శివునికి సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను వర్ణిస్తుంది.

బిల్వ వృక్షం శివ భక్తులకు ఒక పవిత్ర వృక్షం. శివుని పూజయందు బిల్వపత్రాలను సమర్పించడం అత్యంత పుణ్యప్రదంగా నమ్మకం. త్రిదళం అంటే మూడు ఆకులను కలిగిన బిల్వపత్రం శ్రేష్ఠము. బిల్వ పత్రం యొక్క మూడు దళాలు శివుని త్రినేత్రాలను సూచిస్తాయని ఈ శ్లోకం చెబుతుంది. శివుడి మూడు కళ్ళు విశ్వాన్ని సృష్టించడానికి, పరిరక్షించడానికి మరియు నాశనం చేయడానికి సూచిస్తాయి. బిల్వవృక్షాన్ని శాస్త్రీయ నామంగా Aegle Marmelos అని, తెలుగులో మారేడు చెట్టు, హిందీ భాషలో Bael Tree (బేల్ ట్రీ) అని అంటారు.

శివుని త్రిమూర్తులలో ఒకరిగా మరియు త్రిదళాలతో కూడిన బిల్వపత్రాలతో శివునిని పోల్చడం, బిల్వపత్రాలను సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది. మూడు ఆకులు, మూడు గుణాలు, మూడు కళ్ళు, మూడు ఆయుధాలు, మూడు జన్మల పాపాలను హరించే బిల్వ పత్రంతో శివునికి ప్రార్థన చేస్తున్నని నమ్మకం. బిల్వపత్రాలను సమర్పించడం వలన మునుపటి జన్మల పాపాలు, మోక్షాన్ని పొందడంలోను మరియు ఆరోగ్యాన్ని మరియు సంపదను కలిగిస్తుంది.

బిల్వాష్టకం తెలుగులో – Bilvashtakam Telugu

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 1 ॥

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః ।
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితమ్ ॥ 2 ॥

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్ ।
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 3 ॥

సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః ।
యజ్ఞ్నకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 4 ॥

దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ ।
కోటికన్యాప్రదానేన ఏకబిల్వం శివార్పితమ్ ॥ 5 ॥

ఏకం చ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞ్న ఫలం లభేత్ ।
మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 6 ॥

కాశీక్షేత్రే నివాసం చ కాలభైరవ దర్శనమ్ ।
గయాప్రయాగ మే దృష్ట్వా ఏకబిల్వం శివార్పితమ్ ॥ 7 ॥

ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరమ్ ।
ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితమ్ ॥ 8 ॥

ఇతి శ్రీ బిల్వాష్టకమ్ ॥

|| ఓం నమశ్శివాయ ||

You Can read and practice Bilvashtakam Lyrics.

Also Read More Lord Siva Stotra: Click Here

Leave a Comment