Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము పదమూడవ రోజు

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము, శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఈ దివ్య ప్రబంధంలో మొదటి ఐదు పాశురాలు వ్రత విధానాన్ని వివరించగా, తదుపరి పాశురాలలో నందగోపుడు, యశోద (Yashoda), బలరాముడు (Balarama) మరియు శ్రీకృష్ణ (Lord Sri Krishna) నీలాదేవులను మేల్కొలిపే ఘట్టాలు ఉన్నాయి. చివరగా, భగవంతుని సభాస్థలిలో కొలువుదీరమని ప్రార్థిస్తూ, కేవలం ప్రాపంచిక కోరికల కోసం కాకుండా, సర్వకాల సర్వావస్థలయందు స్వామికి కైంకర్యం (సేవ) చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తిరుప్పావైలోని అంతరార్థం. తిరుప్పావై నందు కల పదమూడవ పాశురము ఈ క్రింది విధముగా . . .
Thiruppavai Pasuram – Day 13
తిరుప్పావై 13వ రోజు పాశురము
పాశురము:
పుళ్ళిన్వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,
క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్క ళమ్బుక్కార్,
వెళ్ళియెళు న్దువియాళముఱఙ్గిత్తు,
పుళ్ళుమ్ శిలుమ్బిన్ గాణ్ పోదరి క్కణ్ణినాయ్,
కుళ్ళక్కు ళిరక్కుడైన్దు నీరాడాదే,
పళ్లిక్కిడత్తియో వాపాయ్ నీనన్నాళాల్,
కళ్ళమ్ తవిర్న్ధు కలన్డేలో రెమ్బావాయ్
Credits: @BharatiyaSamskruthi
భావము:
ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్. అందరిని చిలిపి తనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణుడి (Sri Krishna) నామాన్ని పాడటం అంటూ నిన్న గోకులంలో రామ నామం (Rama Nama) పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంత మంది రాముడే (Lord Sri Rama) సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు.
వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మద్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ, ఆమె శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత (Goddess Sita Devi) వాల్లు అడవిలో ఉండగా రావణాసురుడు (Ravan) సీతను ఎత్తుకుపోయాడు… అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి ” సౌమిత్రే ధనుః” అని అరిచాడు. ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు. ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.
కృష్ణుడి జట్టు వారు “పుళ్ళిన్ వాయ్ కీండానై” ఒక నాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి (Bhakasura) మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు “ప్పొల్లా అరక్కనై” రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు. “కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్” ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.
“పిళ్ళైగళ్ ఎల్లారుమ్” గోపబాలికలందరూ “పావైక్కళం పుక్కార్” వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది. వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్పుతున్నారు. “వెళ్ళి యెరుందు” శుక్రోదయం అయ్యింది, “వియారమ్” బృహస్పతి “ఉఱంగిత్తు” అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోదంగా ఉన్నాయి. ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం.
“పుళ్ళుం శిలమ్బిన కాణ్” పక్షులు మాటలాడుకుంటున్నాయి “పోదరి క్కణ్ణినాయ్” తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా. తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టిచ్చుకోవడం లేదు. “కుళ్ళ కుళిర” చల చల్లటి ఆనీటిలో “క్కుడైందు” నిండా మునిగి “నీరాడాదే” అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. “పళ్ళి క్కిడత్తియో” ఇంకా పడుకుని ఉన్నావా “పావాయ్!” ముగ్దత కల్గిన దానా, ” నీ నన్నాళాల్” సమయం అయిపోతుంది, “కళ్ళం తవిరుందు కలంద్” మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.
ఆండాళ్ తిరువడిగళే శరణం..శరణం.
Also Read
- Thiruppavai Pasuram Day 1 | తిరుప్పావై పాశురము – 1వ రోజు
- Thiruppavai Pasuram – Day 2 | తిరుప్పావై పాశురము 2వ రోజు
- Thiruppavai Pasuram – Day 3 | తిరుప్పావై పాశురము – 3వ రోజు
- Thiruppavai Pasuram – Day 4 | తిరుప్పావై పాశురము – 4వ రోజు
- Thiruppavai Pasuram – Day 5 | తిరుప్పావై పాశురము – 5వ రోజు
- Thiruppavai Pasuram – Day 6 | తిరుప్పావై పాశురము – 6వ రోజు





