Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము రెండవ రోజు

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము, శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఈ దివ్య ప్రబంధంలో మొదటి ఐదు పాశురాలు వ్రత విధానాన్ని వివరించగా, తదుపరి పాశురాలలో నందగోపుడు, యశోద (Yashoda), బలరాముడు (Balarama) మరియు శ్రీకృష్ణ (Lord Sri Krishna) నీలాదేవులను మేల్కొలిపే ఘట్టాలు ఉన్నాయి. చివరగా, భగవంతుని సభాస్థలిలో కొలువుదీరమని ప్రార్థిస్తూ, కేవలం ప్రాపంచిక కోరికల కోసం కాకుండా, సర్వకాల సర్వావస్థలయందు స్వామికి కైంకర్యం (సేవ) చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడమే తిరుప్పావైలోని అంతరార్థం. తిరుప్పావై నందు కల రెండవ పాశురము ఈ క్రింది విధముగా . . .
తిరుప్పావై 2వ రోజు పాశురము
Thiruppavai Pasuram – Day 2
2 వ పాశురం – వ్రత నియామాలు:
ఆండాళ్ తిరువడిగలే శరణం:
మరి మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయడలచుకున్నారో ,ఈ వ్రతమునకు సాయపడు వారు ఎవరో, ఆ వ్రతమును చేయుటకు తమకుగా అధికారమేమో వివరించినారు. ఈ దిన ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొందదగినదే అని తెలిసిన కాని కార్యమునందేవరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తెలిసిననూ చేయగలమా, చేయలేమా, మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్ణయించుకోవాలి ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి.
ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే. దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం, శ్రీ కృష్ణుని (Sri Krishna) పాడుటమే ఫలము విశ్వసించి వానిని కైంకర్యము రుచిగాగల నియమాలుందున?, అసలు నియమాలు పాటించాలా?, వారు గొల్ల పిల్లలు కదా?, వారికి నియమాలు ఎలా తెలియును? వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి, పరిసుద్దమైన మనసు కలిగిన చాలు. కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటించుదురు.
వానిని ఈ పాశురములో వివరించుదురు.
పాశురం – 2:
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
Credits: @BharatiyaSamskruthi
తాత్పర్యము:
శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు…
పాలసముద్రములో ద్వానికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రత సమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము. తెల్లవారు జామున స్నానములు చేసెదము. కంటికి కాటుక పెట్టుకోము. కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము, అసత్యాలాడము, ఎచ్చటా పలుకము. ఙానులకు అధిక ధన ధాన్యాధులుతో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.
అవతారిక:
ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీ కృష్ణునికి అంకితంకావటమే ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులూ, నియమాలూ అంటూ ఏమీలేవు. శ్రీ కృష్ణుని యందు ప్రీతితో యేది చేస్తే అవేనియమాలు అంటుంది గోదాదేవి.
2 వ మాలిక:
(మధ్యమావతి రాగము – ఆదితాళము)
ప… వినుడోయమ్మ! వినుడు భూమిని సుఖముల బడయ దలచిన భాగ్యవతులార! వినుడు వినుడోయమ్మ! వినుడు.
అ..ప.. మన నోముకుచేయదగిన కృత్యముల మేము చెప్పెదము వినుడు వినుడోయమ్మ వినుడు.
1. చ… పాల కడలిపై పవళించిన స్వామి – పరమాత్ముని పాదముల కామించి పాడి పాడి ఉజ్జీవించు విధమెరిగి – పరమ పవిత్రులె కావలె వినుడు.
2. చ… పూజ్యులకు భిక్ష, పేదకు దానము – పొసగ జేయవలె నిరతమును సృతమానము, పాలను ద్రావము – పగటుగా కనుక కాటుక దీర్పము.
3 చ… ప్రాతఃకాలము నీరాడుదుము – పగటుగా కనుక కాటుక దీర్పము పూవుల తోడ కురులనే ముడువము పెద్దలు చేయని పనులను చేయము.
మిత్రం చేయగరాని పనలనే చేయము చేటు మాటలను చెప్పగబోము చేరదలచు నా గమ్యము వీడము చేరగ శ్రీ పతి వేడుకొందుము వినుడోయమ్మ! వినుడు.
విశేషార్ధము:
తమతో వ్రతమునకు రాబోవుచున్న గోపికలను (Gopika) శ్రీమన్నారాయణ (Srimannarayana) ఉద్దేశించి తామీ వ్రతములొ చెయవలసినవి, చెయకుడనివి ఇందు వివరించుకున్నరు.
ఆండాళ్ తిరువడిగలే శరణం..శరణం..
Also Read
- Thiruppavai Pasuram Day 1 | తిరుప్పావై పాశురము – 1వ రోజు
- Thiruppavai Pasuram – Day 2 | తిరుప్పావై పాశురము 2వ రోజు
- Thiruppavai Pasuram – Day 3 | తిరుప్పావై పాశురము – 3వ రోజు
- Thiruppavai Pasuram – Day 4 | తిరుప్పావై పాశురము – 4వ రోజు
- Thiruppavai Pasuram – Day 5 | తిరుప్పావై పాశురము – 5వ రోజు
- Thiruppavai Pasuram – Day 6 | తిరుప్పావై పాశురము – 6వ రోజు





