భక్తితో అయ్యప్ప స్వామిని కొలిచే దివ్య రత్నాలు

“అయ్యప్ప పంచరత్నం – Ayyappa Swamy Pancharatnam” అయ్యప్ప స్వామి భక్తుల హృదయాలలో అనంత భక్తిని, జీవితాలలో దివ్య కాంతిని నింపే ఐదు అమూల్య రత్నాలు – అయ్యప్ప పంచరత్నం (“పంచ” అంటే ఐదు మరియు “రత్న” అంటే రత్నం). అయ్యప్పస్వామి (Ayyappa Swamy) యొక్క కరుణామయ స్వరూపాన్ని, అపారమైన శక్తిని, భక్తులపై అనురాగాన్ని కళ్లముందు చూపించే దివ్య దర్శనం.
ఈ ఐదు పద్యాలు వివిధ ఋషులు, కవులు రచించారు. ఆది శంకరాచార్య (Adi Shankaracharya), పూంథానం, కనకదాస (Kanakadasa)వంటి మహనీయులు తమ భక్తిని, అనుభవాన్ని పంచరత్నంలో పొందుపరిచారు. ప్రతి పదం, ప్రతి ఛందస్సు ఆయ్యప్పస్వామి పట్ల భక్తితో తులతూగి, మన హృదయాలను ఆయన చరణాల వద్దకు చేరుస్తుంది.
అయ్యప్ప పంచరత్నం యొక్క విశిష్టత
మొదటి పద్యం: శ్రీ మహావిష్ణుమూర్తి (Lord Vishnu) అంశతో పుట్టిన మహిమాన్వితుడైన అయ్యప్పస్వామిని స్తుతిస్తుంది. శబరిమల పుణ్య క్షేత్రంలో నిత్య కైలాసాన్ని నిర్మించిన దివ్య చరిత్రను కీర్తిస్తుంది.
రెండవ పద్యం: అయ్యప్ప స్వామి కరుణ, భక్తుల రక్షకుడైన ఆయన శక్తిని వర్ణిస్తుంది. పాలవెల్లి, శరణాగతులను ఎలా కాపాడుతున్నాడో తెలియజేస్తుంది.
మూడవ పద్యం: అయ్యప్పస్వామి యొక్క అపార జ్ఞానం, మోక్షదాత అయిన ఆయన గొప్పతనం గురించి చెబుతుంది. ఆయన దివ్య దర్శనం లభించినవారి పుణ్యఫలం వివరిస్తుంది.
నాలుగవ పద్యం: అయ్యప్పస్వామి యొక్క క్షమాగుణం, ఎంతటి పాపాలనైనా కరిగించే ఆయన దయను కీర్తిస్తుంది. శరణాగతి ప్రాముఖ్యతను, స్వామి కరుణతో ఎలా మోక్షం పొందవచ్చో వివరిస్తుంది.
ఐదవ పద్యం: భక్తుల భక్తిని స్వీకరించి, వారి కోరికలను నెరవేర్చే అయ్యప్పస్వామి యొక్క అనుగ్రహాన్ని వర్ణిస్తుంది. అయన పేరును స్మరించడమే, జీవితంలో సిరిసంపదలు, ఆనందం లభించడానికి మార్గమని తెలియజేస్తుంది.
ఈ పంచరత్నాలను భక్తితో పఠించడం, మాలధారణతో శబరిమల (Sabarimala) యాత్రలో ఘనంగా నిర్వహించడం చాలా పుణ్యఫలదాయకమైనవి. అయ్యప్ప స్వామి కరుణను పొందాలనుకున్న భక్తులకు హృదయం పులకరేంచే నిలిచిపోయే దివ్య గీతాలు ఇవి.
Ayyappa Swamy Pancharatnam Telugu
అయ్యప్ప పంచరత్నం తెలుగు
లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ ।
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 1 ॥
విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ ।
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 2 ॥
మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ ।
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 3 ॥
అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రు వినాశనమ్ ।
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 4 ॥
పాండ్యేశవంశతిలకం కేరలే కేలివిగ్రహమ్ ।
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥
పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః ।
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే ॥
ఇతి శ్రీ అయ్యప్ప పంచరత్నం.
|| స్వామియే శరణం అయ్యప్ప ||
Credits: @bhakthimusictelugu
Also Read
- Sri Bramarambika Devi Ashtottara Shatanamavali | శ్రీ భ్రమరాంబికా దేవి అష్టోత్తర శతనామావళి
- Sri Rajarajeshwari Ashtottara Shatanamavali | శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తర శత నామావళి
- Sri Mahishasura Mardini Ashtottara Shatanamavali | శ్రీ మహిషాసుర మర్దినీ అష్టోత్తర శతనామావళిః
- Sri Kalaratri Devi Ashtottara Shata Namavali | శ్రీ కాలరాత్రి దేవి అష్టోత్తర శతనామావళి
- Sri Durga Ashtottara Shata Namavali | శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళిః
- Sri Mahalakshmi Ashtottara Shatanamavali | శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి





