సరస్వతీ స్తోత్రం | Saraswati Stotram

సరస్వతీ స్తోత్రం: జ్ఞానదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మార్గం

Saraswati Stotram

సరస్వతీ స్తోత్రం – Saraswati Stotram అనేది విద్యాదేవి అయిన సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన స్తోత్రం. ఈ స్తోత్రం భక్తులకు జ్ఞానం, వివేకం, మంచి వాక్చాతుర్యం, మరియు విద్యలో విజయాన్ని అందించడానికి ప్రసిద్ధి చెందింది. జ్ఞానం విద్య మరియు సృజనాత్మకత కోసం సరస్వతి దేవిని (Goddess Saraswati Devi) స్తుతిస్తూ పఠిస్తారు. ప్రాముఖ్యత కలిగిన సరస్వతీ స్తోత్రంను ఋషి అగస్త్యుడు (Agastya) రచించినట్లు చెబుతారు. ఈ స్తోత్రంలో సరస్వతీ దేవి యొక్క అనేక రూపాలను మరియు ఆమె యొక్క గుణాలను స్తుతిస్తారు.

సరస్వతీ స్తోత్రం మూలం:

సరస్వతీ స్తోత్రం అగస్త్య మహర్షిచే రచించబడిందని నమ్ముతారు. ఇది శ్లోకాల శ్రేణిగా నిర్మించబడింది, వీటిలో ప్రతి ఒక్కటి సరస్వతి యొక్క విభిన్న అంశాన్ని ప్రశంసిస్తూ కొనసాగుతుంది. సరస్వతీ స్తోత్ర శ్లోకాలు శ్రావ్యంగా మరియు భక్తితో పఠించబడతాయి.

సరస్వతీ స్తోత్రం యొక్క ప్రాముఖ్యత

సరస్వతీ దేవిని (Saraswati Devi) కేవలం విద్యాదేవిగానే కాకుండా, కళల లోకంలో ఒక అజరామరమైన దీపంగా పూజిస్తారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, సాహిత్యం వంటి అనేక రకాల కళలకు ఆమె అధిష్టాత్రిణి. ఆమె వీణ నుండి వెలువడే స్వరాలు లోకాలను మంత్రముగ్ధులను చేస్తాయి. స్తోత్రంలోని ప్రతి పదం సరస్వతీ దేవి యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఆమె కలంకలేని తెల్లని సరస్వతీ పుష్పమాల ఎల్లప్పుడూ వికసించి ఉంటుంది. చతుర్భుజాలలో వీణ, పుస్తకం, అక్షమాల, కమలం పుష్పం ధరించి ఉండే ఆమె జ్ఞానదేవతగా దర్శనము ఇస్తుంది.

Saraswati Stotram యొక్క ప్రయోజనాలు

సరస్వతీ దేవిని ఆరాధించడం ద్వారా కళాకారులు తమ కళల్లో మరింత నైపుణ్యం సాధించగలుగుతారు. ఆమె ఆశీస్సులతో నృత్యకారులు అందమైన నృత్యాలు చేయగలుగుతారు, గాయకులు మధుర గానాలతో వినిపించగలుగుతారు, చిత్రకారులు అద్భుతమైన చిత్రాలు వేయగలుగుతారు, రచయితలు హృద్యమైన సాహిత్యాన్ని సృష్టించగలుగుతారు. అంతేకాకుండా, విద్యార్థులకు కూడా చాలా ముఖ్యమైన దేవత. ఆమె జ్ఞానదాయిని, వివేకదాయిని. ఆమె ఆశీస్సులతో విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ముఖ్యముగా వసంత పంచమి (Vasant Panchami) లేదా బసంత పంచమి (Basant Panchami) నాడు విద్యారంభం సమయంలో సరస్వతి పూజ (Saraswati Puja) చేసి ఈ స్తోత్రం పఠించడం చాలా శుభం అని భావిస్తారు. జ్ఞానం, తెలివితేటలు, ఏకాగ్రత, మరియు మంచి జ్ఞాపకశక్తి పొందడానికి ఈ స్తోత్రం సహాయపడుతుందని నమ్ముతారు. సరస్వతీ స్తోత్రం పఠించడం ద్వారా జీవితంలో ప్రతి క్షణంలోనూ సరస్వతీ దేవి ఆశీర్వాదాలతో  ప్రకృతిలో, పుస్తకాల్లో, మన చుట్టూ ఉన్న ప్రజలలో జ్ఞానమనే నిధి పొందగలరు..

వసంత పంచమి, వసంతోత్సవం వంటి సరస్వతికి అంకితమైన ప్రత్యేకమైన రోజులలో విశేషముగా పఠించబడుతుంది. ఈ ప్రతేకమైన రోజులో చిన్న పిల్లలకు విద్యాభ్యాసం ప్రారంభిస్తుంటారు. ఇది సరస్వతీ పురాణం మరియు దేవీ భాగవత పురాణంతో సహా అనేక హిందూ గ్రంథాలలో చూడవచ్చు.సరస్వతీ స్తోత్రం యొక్క అనేక విభిన్న సంస్కరణలు ఉన్నాయి, ప్రతి ఒక్క స్తోత్రము భిన్నమైన పదాలతో స్తుతించబడుతుంది.

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥ 1 ॥

దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ ।
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాzసమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ॥ 2 ॥

సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా ।
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా ॥ 3 ॥

సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా ।
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ॥ 4 ॥

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥ 5 ॥

సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః ।
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ॥ 6 ॥

నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః ।
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ॥ 7 ॥

శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః ।
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ॥ 8 ॥

ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః ।
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః ॥ 9 ॥

మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః ।
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః ॥ 10 ॥

వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః ।
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ॥ 11 ॥

సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః ।
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః ॥ 12 ॥

యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః ।
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ॥ 13 ॥

అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః ।
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః ॥ 14 ॥

అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః ।
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః ॥ 15 ॥

జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః ।
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః ॥ 16 ॥

పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః ।
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ ॥ 17 ॥

మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః ।
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః ॥ 18 ॥

కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః ।
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః ॥ 19 ॥

సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే ।
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి ॥ 20 ॥

ఇత్థం సరస్వతీ స్తోత్రమగస్త్యముని వాచకమ్ ।
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ ॥ 21 ॥

ప్రతి దినము సరస్వతీ స్తోత్రంను కుటుంబ సభ్యులు మరియు ప్రత్యేకంగా విద్యాబ్యాసం చేయు పిల్లలు పఠించిన శ్రీ సరస్వతీదేవి అనుగృహము పొందవచ్చు.

Credits : @bhakthii

Also Read

Leave a Comment