కార్తీక పురాణం | Karthika Puranam – Day 20

కార్తీక పురాణం – 20 వ అధ్యాయం (పురంజయుడు దురాచారుడగుట)

Karthika Puranam

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది.స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.

కార్తీక పురాణం – పురంజయుని కథ

జనక మహారాజు కార్తీక మాస మహిమ గురించి మరింత తెలుసుకోవాలని వశిష్టుడిని అడిగాడు. దీనికి వశిష్టుడు అగస్త్య మహర్షి (Agastya Muni) మరియు అత్రి మహర్షి మధ్య జరిగిన సంభాషణను వివరించారు.

అగస్త్య మహర్షి కార్తీక మాస మహిమ గురించి అత్రి మహర్షిని (Atri Maharshi) అడిగారు. అత్రి మహర్షి కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది అని చెప్పారు. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు అపార ఫలితాలను ఇస్తాయి అని వివరించారు. ఉదాహరణకు, పురంజయుడు అనే రాజు గురించి ఒక కథ చెప్పారు.

పురంజయుడు అనే రాజు అయోధ్యను (Ayodhya) పరిపాలించేవాడు. అతను మొదట్లో ధర్మం పాటించేవాడు. కానీ కొంతకాలానికి అతను అహంకారానికి బానిసై, దుష్టుడుగా మారిపోయాడు. దొంగతనాలు, దోపిడీలు చేయించేవాడు. అతని దురాచారాల వల్ల ప్రజలు బాధపడేవారు. కాంభోజ రాజు ఈ విషయం తెలుసుకొని పురంజయుడిపై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు.

పురంజయుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. రెండు సైన్యాల మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరికి పురంజయుడు పరాజయం చెందాడు. ఈ విధంగా పురంజయుడు తన దురాచారాల వల్ల నష్టపోయాడు. “కార్తీక పురాణం” – 20వ అధ్యాయము (Karthika Puranam – Day 20) నందు ఈ క్రింది విధముగా …

చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక, జనక మహారాజు వశిష్ఠుడితో తిరిగి ఇలా అడుగుచున్నాడు. “ఓ గురువర్యా! కార్తీకమాస మహత్యాన్ని ఇంకనూ వినాలని అనిపిస్తోంది. ఈ వ్రత మహత్యానికి సంబంధించి ఇంకా ఇతిహాసాలు, ఇతివృత్తాలు, విశేషాలు ఉన్నాయా? అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది” అని కోరాడు. దానికి వశిష్టులవారు మందహాసంతో “ఓ రాజా! కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రి మునికి చెప్పిన విషయం గురించి వివరించెదను” అని ఇలా చెప్పసాగారు.

పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి, “ఓ అత్రి మునీ! నీవు శ్రీ విష్ణువు (Sri Vishnu)అంశలో పుట్టావు. కావున నీకు కార్తీక మహత్యం గురించి ఆమూలాగ్రంగా (ఆది నుంచి అంతం వరకు) తెలిసి ఉంటుంది. కాబట్టి దాన్ని నాకు వివరించు” అని కోరాడు. దానికి అత్రి మహాముని “ఓ కుంభసంభవా! కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. వేదాల్లో (Veda) సమానమైన శాస్త్రం మరియు ఆరోగ్య సంపదకు సాటిలేని సంపద లేదు. అలాగే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనా, కార్తీకంలో నదీ స్నానం చేసినా, శివ కేశవాలయాల్లో దీపారాధన (Deeparadhana) చేసినా, దీప దానం చేసినా, దాని ఫలితం చెప్పనలవి కాదు. ఇందుకు ఒక ఇతిహాసముంది. చెబుతాను వినుము.

త్రేతాయుగం నందు పురంజయుడనే సూర్యవంశపు రాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమును ఏలుచుండేవాడు. అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు. న్యాయ బద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు. అయితే కొంత కాలానికి పురంజయుడిలో మార్పు వచ్చింది. అమిత ధనాశతో, రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై, దుష్ట బుద్ధి కలవాడై, దయా దాక్షిణ్యాలు లేక లేవ బ్రాహ్మణ మాన్యాలను లాక్కొనడం ఆరంభించాడు. పరమ లోభిగా మారాడు. దొంగలను చేరదీసి, వాళ్లతో దొంగతనాలు, దోపిడీలు చేయించాడు. వారు కొల్లగొట్టుకొని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ, ప్రజలను భీతావహులను చేయసాగాడు. కొంత కాలానికి అతని దాష్టీకాలు నలుదిశలా వ్యాపించాయి.

ఈ వార్త విన్న కాంభోజ రాజు ఇదే సమయమని గుర్తించి, అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రథ, గజ, తురగ, పదాతి దళములను తీసుకుని అయోధ్యకు చేరుకున్నాడు. నగరం నలుమూలలా శిబిరాలు నిర్మించి, యుద్ధానికి సిద్ధపడ్డాడు. గూఢచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చేసేది ఏమి లేక, తాను కూడా యుద్ధానికి సిద్ధము అయ్యాడు. శత్రువు కంటే తన శక్తి బలహీనంగా ఉన్నా, తుదివరకు పోరాడాలని నిర్ణయించుకున్నాడు. శాస్త్ర సమన్వితమైన రథాన్ని ఎక్కి, సైన్యాధిపతులను పురికొల్పాడు. చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్దుడయ్యాడు. యుద్ధభేరీ మోగించి, సింహనాదాలు గావించి, మేఘాలు గర్జిస్తున్నాయా? అన్నట్లు పెద్ద ఎత్తున హుంకరించారు. శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం వింశాధ్యాయః (20వ అధ్యాయం) సమాప్తః ఇరవైవ రోజు పారాయణ సంపూర్ణం.

Also Read

Leave a Comment