కార్తీక పురాణం | Karthika Puranam – Day 18

కార్తీక పురాణం – 18 వ అధ్యాయం (సత్కర్మ అనుష్టాన ఫల ప్రభావం)

Karthika Puranam

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది.స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.

సత్కర్మ అనుష్టాన ఫల ప్రభావం (క్లుప్తముగా) 

ధనలోభి అంగీరసుడి (Angirasa) తత్వోపదేశం విని ఎంతో ఆనందించాడు. తనను శిష్యునిగా స్వీకరించమని కోరాడు. అంగీరసుడు అతని కోరికను మన్నించి సత్కర్మల ప్రాముఖ్యత గురించి వివరించారు.

ప్రతి మనిషి శరీరమే నిజమని భావిస్తారు. కానీ నిజానికి ఆత్మే నిజం. ఆత్మను తెలుసుకోవడానికి సత్కర్మలు చేయాలి. ప్రతి మనిషి తన జాతికి తగిన కర్మలను చేయాలి. ఉదాహరణకు బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయకపోతే అది పాపం. కార్తీక మాసం, వైశాఖ మాసం (Vaisakha Masam), మాఘ మాసం (Magha Masam) వంటి పవిత్ర మాసాల్లో స్నానం చేయడం, దేవతలను పూజించడం చాలా ముఖ్యం. ఇలాంటి కర్మలను ఆచరించడం వల్ల మనకు మోక్షం లభిస్తుంది.

ధనలోభి చాతుర్మాస్య వ్రతం గురించి అడిగాడు. అంగీరసుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి (Ashada Shudda Ekadashi) నుండి కార్తీక శుద్ధ ఏకాదశి (Karthika Suddha Ekadashi) వరకు ఉన్న నాలుగు నెలలను చాతుర్మాస్యం అని చెప్పారు. ఈ నాలుగు నెలల్లో విష్ణువును పూజించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది.

అంగీరసుడు తన కథనాన్ని కొనసాగిస్తూ నారద మహర్షి (Narada Maharshi) వైకుంఠానికి వెళ్లి శ్రీమన్నారాయణుడిని దర్శించిన కథను చెప్పారు. నారదుడు భూలోకంలో మనుషుల పరిస్థితి గురించి శ్రీమన్నారాయణుడికి చెప్పగా, శ్రీమన్నారాయణుడు భూలోకానికి వచ్చి మనుషులను పరీక్షించారు. ఈ కథ ద్వారా చాతుర్మాస్య వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. “కార్తీక పురాణం” – 18వ అధ్యాయము (Karthika Puranam – Day 18) నందు ఈ క్రింది విధముగా …

ధనలోభుడు తిరిగి ఆంగీరసులవారితో ఇలా అడుగుతున్నాడు. “ఓ మునిచంద్రా! మీ దర్శనం వల్ల నేనను ధన్యుడనయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది. జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిశ్యుడను. తండ్రి – గురువు – అన్న – దైవం అన్నీయూ మీరే. నా పూర్వ జన్మ పుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను. మీవంటి పుణ్య మూర్తుల సాంగథ్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందియున్నాను. లేకుంటే, అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా? అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి? కార్తీక మాసం కావడమేమిటి? చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడమేమిటి? నాకు సద్గతి కలగడమేమిటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే. కాబట్టి, ఇక పై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి, నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయవలసిన సత్కర్మలను, అనుసరించ వలసిన విధానాలు, వాటి ఫలితాలను విషదీకరించండి” అని కోరాడు.

దానికి అంగీరసులవారు ఇలా చెబుతున్నారు “ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే. అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను. శ్రద్ధగా వినుము” అని ఇలా చెప్పసాగెను…

“ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞాన శూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే కానీ, ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మను ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడు ఏజాతివాడు? ఎలాంటి కర్మలు ఆచరించాలి? అనే అంశాలను తెలుసుకోవాలి. వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక, సత్కర్మలను ఆచరించినా, అవి వ్యర్థమవుతాయి.

అలాగే కార్తీకమాసంలో శ్రీ సూర్య భగవానుడు తులారాశి (Tula Rashi) యందు ప్రవేశిస్తుండగా, వైశాక మాసంలో సూర్యుడు మేషరాశి (Mesha Rashi) యందు ప్రవేశిస్తుండగా, మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో (Makhara Rashi) ఉండగా, అంటే మొత్తానికి ఈ మూడు మాసములలో తప్పక నదీ స్నానాలు, ప్రాతఃకాల స్నానాలు ఆచరించాలి. అతుల స్నానాలాచరించాలి. దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్య దినాల్లో ప్రాతః కాలంలోనే స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించని వాడు కర్మబ్రష్టుడవుతాడు. కార్తీకమాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీకమాసంతో సమానమైన నెల కానీ, వేదాలతో (Vedam) సరితూగే శాస్త్రం కానీ, గంగా, గోదావరి లకు సమాన తీర్థాలుగానీ, బ్రాహ్మణులకు సమానమైన జాతిగాని, భార్యతో సరితూగే సుఖమూ, ధర్మంతో సమానమైన మిత్రుడూ, శ్రీ హరితో సమానమైన దేవుడూ లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీకమాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించినవారు కోటి యాగాల ఫలితాన్ని పొందుతారు” అని వివరించెను.

దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నిస్తూ “ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస్య వ్రతమనగానేమిటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇదివరకెవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలితమేమిటి? దాని విధానమేమిటి? నాకు సవివరంగా తెలపగలరు” అని కోరాడు.

ధనలోభుడి ప్రార్థనను మన్నించిన అంగీరసుడు ఇలా చెబుతున్నాడు, “ఓయీ! చాతుర్మాస్య వ్రతమనగా మహా విష్ణువు (Maha Vishnu) , మహాలక్ష్మీదేవితో (Goddess Mahalakshmi) ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. ఆ నాలుగు నెలలను చాతుర్మాస్యమంటారు. అనగా, ఆషాఢ శుద్ధ ఏకాదశిని “శయన ఏకాదశి – Sayana Ekadashi” అని, కార్తీక శుద్ధ ఏకాదశిని “ఉత్థాన ఏకాదశి – Utthana Ekadashi” అని పిలుస్తారు. ఈ నాలుగు నెలలు విష్ణుదేవుడి ప్రీతికోసం స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతిని నీకు చెబుతున్నాను.

తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు, వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా, ఆ సమయంలో నారద మహర్షి వచ్చి, కోటిసూర్య ప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి, ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంత శ్రీహరి (Sri Hari) నారదుడిని చూసి, ఏమి తెలియనివాడిలా చిరు మందహాసంతో ‘నారదా క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు. మహామునుల సత్కర్మానుష్టానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమీ లేవుకదా?’ అని కుశల ప్రశ్నలు వేసెను. అంత నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి ‘ఓ దేవా! ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు. అయినా నన్ను అడుగుతున్నారు. ఈ ప్రపంచం నందు కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్య వ్రతాలు చేస్తూ, అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరి కొందరు అహంకార సాహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిని సత్కృపత రక్షింపుము’ అని ప్రార్థించెను.

ఇట్లు స్కాంద పురాణాం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి అష్టా దశాధ్యాయం – పద్దెనిమిదో రోజు పారాయణం సమాప్తం.

Also Read

Leave a Comment