కార్తీక పురాణం – 7 వ అధ్యాయం (శివకేశవార్చనా విధులు)
“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.
శివకేశవార్చన విధులు (క్లుప్తముగా)
కార్తీక మాసంలో శివకేశవులను (Shiva Keshava) పూజించడం చాలా పవిత్రమైనది. సహస్రనామ పూజ, ఉసిరి చెట్టు (Amla Tree) కింద సాలగ్రామ పూజ, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వంటివి చేస్తే మోక్షం లభిస్తుంది. శివాలయం లేదా విష్ణు ఆలయంలో (Vishnu Temple) జండా ప్రతిష్టించడం వల్ల కోటి పాపాలు పోతాయి. తులసికోట (Tulasi) వద్ద నందా దీపం వెలిగించడం, ఈశ్వరునికి (Lord Eshwar) జిల్లేడు పూలతో అర్చించడం వంటివి కూడా చేయవచ్చు. ఈ మాసంలో పూజలు చేయకపోతే మరుజన్మలో శునక జన్మ లభిస్తుంది. కనీసం ఒక్క సోమవారమైనా పూజ చేస్తే మాసఫలం లభిస్తుంది.
వశిష్టుడు జనక మహారాజుతో, ఈ కార్తీక మాసంలోని విధుల గురించి వివరంగా చెప్పి, ఈ వ్రతాన్ని ఆచరించాలని సలహా ఇచ్చాడు. “కార్తీక పురాణం – 7వ అధ్యాయము (Karthika Puranam – Day 7) నందు ఈ క్రింది విధముగా …
Karthika Puranam – Day 7
“శివకేశవార్చనా విధులు”
వశిష్టులు వారు జనకునకింకనూ యిటుల బోధించిరి “రాజా! కార్తిక మాసము గురించి, దాని మహత్మ్యము గురించి ఎంత వినిననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహా విష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంటియందు లక్ష్మిదేవి (Lakshmi Devi) స్థిరముగా నుండును. తులసీదళములతోగాని (Tulasi), బిల్వపత్రములతోగాని (Bilva) సహస్రనామపూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తిక మాసమునందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికీ కలుగు మోక్షమింతింతగాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద బోజనము పెట్టి తాను తినిన, సర్వపాపములు పోవును.
ఈ విధముగా కార్తిక స్నానములు దీపారాధనలు (Deepardana) చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి కల వారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన, హొమాదులు, దాన ధర్మములు చేసిననచో అశ్వమేధము (Ashwamedha Yagna) చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృ దేవతలకు (Pitru Deavata) కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున కాని, విష్ణ్వాలయమున గాని జండా ప్రతిష్టించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరి కదా, పెను గాలికి ధూళి రాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలై పోవును.
ఈ కార్తిక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్లు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా జేసి, నైవేద్యమిడి కార్తిక పురాణము చదువుచుండిన యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తికమాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియూ కార్తిక మాసమందు పూజాదులు ఆచరించడో అ మానవుడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలోచచ్చును. కావున కార్తికమాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిననూ మాసఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను.
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం
నాగేంద్రకన్యా వృష కేతనాభ్యం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి సప్తమ అధ్యాయము – సప్తమ దిన పారాయణము సమాప్తం.
Also Read