కార్తీక పురాణం – 5 వ అధ్యాయం (వనభోజన మహత్యం)
“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.
వనభోజన మహిమ:
వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు, “ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో (Karthika Masam) స్నానం, దానం, పూజలు చేసిన తర్వాత శివాలయం (Shiva Temple) లేదా విష్ణు ఆలయంలో భగవద్గీతను (Bhagavad Gita) పఠించాలి. అలా చేసిన వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో కరవీర పుష్పాలను శివ, కేశవులకు సమర్పించిన వారు వైకుంఠాన్ని (Vaikuntha) చేరుకుంటారు. భగవద్గీతను కొంత భాగం చదివిన వారికి విష్ణులోకం లభిస్తుంది. ఒక్క శ్లోకం లేదా ఒక్క పదం కూడా కంఠస్థం చేసినా విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పూజించి, శ్రీ విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు (Amla Tree) నీడలో భోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ, తాంబూలములతో సత్కరించాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ (Purana) కాలక్షేపం చేయాలి. ఇలా చేయడం వల్ల బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మం నుండి విముక్తి పొందాడు.” అని చెప్పారు.
జనకుడు, “మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగింది? దానికి గల కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు…
కిరాతుడు, ఎలుకలకు మోక్షం:
“రాజా! కావేరి నది (Kaveri River) తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. అతను చిన్నతనం నుండి భయం భక్తి లేక గారాబంగా పెరిగాడు. దీనివల్ల నీచ సహవాసాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలను చూసిన తండ్రి ఒక రోజు అతన్ని పిలిచి కార్తీక మాసంలో మంచి పనులు చేయాలని సలహా ఇచ్చాడు. కానీ శివశర్మ తండ్రి మాట వినలేదు. దీంతో తండ్రి కోపంతో శివశర్మను ఎలుకగా (Rat) మారమని శపించాడు.
శివశర్మ ఎలుక రూపంలో అడవిలో నివసిస్తుండగా, ఒక రోజు విశ్వామిత్రుడు (Vishvamitra) అక్కడకు వచ్చి కార్తీక పురాణాన్ని చెప్పసాగాడు. శివశర్మ కూడా ఆ కథను విన్నాడు. పురాణ శ్రవణం వల్ల అతను తన పాపాలను తెలుసుకొని పశ్చాత్తాపపడి తన మానవ రూపాన్ని తిరిగి పొందాడు.” కార్తీక పురాణం – 5వ అధ్యాయము (Karthika Puranam – Day 5) నందు ఈ క్రింది విధముగా …
Karthika Puranam – Day 5
“వనభోజన మహత్యం“
వశిష్టుడు తిరిగి జనకమహారాజుతో ఇలా అంటున్నాడు. “ఓ జనక మహారాజా! కార్తీక మాసం నందు స్నాన, దాన పూజానంతరమున శివాలయమున నందు కానీ విష్ణాలయము నందు కానీ శ్రీమద్ భగవద్గీతా పారాయణము తప్పక చేయాలి. అలా చేసినవారి సర్వ పాపములును నివ్రుత్తి అగును. ఈ కార్తీక మాసము నందు కరవీర పుష్పములను శివ కేశవులకు భక్తితో సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళెదరు. శ్రీమద్ భగవద్గీత కొంత వరకు పఠించిన వారికీ విష్ణు లోకం ప్రాప్తిస్తుంది. ఒక్క శ్లోకములో ఒక్క పదమైననూ కంఠస్థం చేసిన అట్లయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక మాసం నందు పెద్ద ఉసిరికాయలతో (Amla) నిండి ఉన్న ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామమును యదోచితంగా పూజించి, శ్రీ విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన భోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ, తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజ రూపం కలిగింది” అని చెప్పారు. అది విన్న జనకుడు “ముని వర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగింది? దానికి గల కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు…
కిరాతుడు, ఎలుకలకు మోక్షం
రాజా! కావేరి నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుంచి భయం భక్తి లేక గారాబంగా పెరిగాడు. దీనివల్ల నీచ సహవాసాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలు చూసిన తండ్రి ఒక రోజు అతన్ని పిలిచి “బిడ్డా, నీ అపచారాలకు అంతు లేకుండా పోతోంది. నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకొంటున్నారు. నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తిరగలేకపోతున్నాను. కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నువ్వు బుద్ధిగా ఉండు. నదిలో స్నానం చేయి. శివకేశవులను (స్మరించి, సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి. నీ పాపాలు తొలగిపోయే అవకాశాలుంటాయి. నీకు మోక్షం ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. దానికి ఆ పిల్లాడు మూర్ఖముగా “స్నానం చేస్తే ఒంటిమీద మురికి పోతుంది. అంతే, దానికి వేరే ఏమైనా వస్తుందా? స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా? గుళ్లో దీపం పెడితే లాభమేమిటి? ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా?” అని ఎదురు ప్రశ్నలు వేశాడు.
దాంతో ఆ బ్రాహ్మడు “ఓరీ నీచుడా! కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేస్తున్నావు. నీ అంతటి కొడుకు నాకెందుకు? నీవు అడవిలో ఉన్న రావి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో బదుకుదువు గాక” అని శపించాడు. ఆ శాపంతో గజ గజా వణికిపోయిన శివశర్మ తండ్రి పాదాలపై పడి, “నన్ను క్షమించండి. అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని, దైవకార్యాలను చులకన చేశాను. నాకు ఇప్పుడు పశ్చాత్తాపమైంది. నాకు శాపవిమోచనం చెప్పండి” అని కోరాడు. అంతట ఆయన “బిడ్డా! నా శాపం అనుభవించక తప్పదు. అయితే నీవు ఎలుక రూపంలో ఉన్నా. కార్తీక మాసం మహత్యాన్ని వింటే నీకు పూర్వ దేహ స్థితి కలిగి ముక్తిని పొందుతావు” అని ఊరడించాడు.
తండ్రి శాపముతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి, అడవికి పోయి, చెట్టు తొర్రలో నివసిస్తూ, పండ్లు తింటూ బ్రతకసాగాడు. కావేరీ నదీతీరాన ఉన్న రావిచెట్టు తొర్రలో అతను నివాసము ఏర్పరుచుకోవడం వల్ల నదీ స్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం కింద విశ్రమించేవారు. నదీ స్నానం చేసేవారు రామాయణ (Ramayan), మహాభారతాలు (Mahabharata), పురాణ గాథల్ని చెప్పుకొనేవారు. కార్తీక మాసంలో ఒకానొక రోజున మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు. ప్రయాణ బడలిక వల్ల ఆ రావి చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో తన శిష్యులకు కార్తీకపురాణ (Karthika Puranam) విశేషాన్ని బోధిస్తున్నారు. చెట్టు తొర్రలో ఎలుక రూపంలో నివసించుచూ ఉన్న శివశర్మ కూడా ఆ కథను విన్నాడు. రుషి దగ్గర ఉన్న పూజా సామాగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమో అని చెట్టు మొదట నక్కి చూస్తున్నాడు. అంతలో ఒక కిరాతకుడు చెట్టు క్రింద ఉన్న వారిని దూరం నుంచి చూసి “ఓహో! ఈ రోజు నా పంట పండింది. ఈ బాటసారులను దోచుకుంటే డబ్బేడబ్బు” ఆలోచించసాగాడు. అతనలా ఆలోచిస్తూ దగ్గరకు వచ్చేసరికి మునులను చూశాడు. ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది. వారందరికీ నమస్కరించి “మహానుభావులారా! మీరెవరు? ఎందుకు ఇక్కడకు వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసు పులకించిపోతోంది” అని అన్నాడు. అంతట విశ్వామిత్రుడు “ఓ కిరాతకా! మేం కావేరీ నదీ స్నానమాచరించేందుకు ఇక్కడకొచ్చాం. ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం. నువ్వుకూడా ఇక్కడ కూర్చొని వినవచ్చు” అన్నారు.
అటు ఎలుక, ఇటు కిరాతకుడు శ్రద్ధగా కథ వినసాగారు. కథ వింటుండగా, కిరాతకుడికి తన పూర్వజన్మ వృంతాతమంతా జ్ఞాపకమొచ్చింది. పురాణ శ్రవణం తర్వాత ఋషులకు దండం పెట్టి, సాష్టాంగం చేసి, వెళ్లిపోయాడు. ఎలుక కూడా పురాణను అంతా వినడం, చెట్టు క్రింద దొరికిన ఫలాలను బుజించడం వల్ల తన స్వరూపాన్ని పొందగలిగింది. ఎలుక రూపం నుండి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో “మునివర్యా! ధన్యుడను అయ్యాను. మీవల్ల నేను మూషిక రూపం నుండి విముక్తి పొందాను” అని తన వృత్తాంతమంతా చెప్పాడు.
“కాబట్టి జనక మహారాజా! (Janaka) ఈ లోకమునందు సిరిసంపదలు, పరమున మోక్షాన్ని కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి, ఇతరులకు వినిపించాలి. బంధుమిత్రులతో కలిసి వన భోజనమును ఆచరించాలి” అని వివరించారు.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము.
“ఓం నమః శివాయ“
Also Read