Kanakadhara Stotram | కనకధారా స్తోత్రం
శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులు చే రచించబడిన సంస్కృత స్తోత్రం Kanakadhara Stotram – కనకధారా స్తోత్రం లేదా సువర్ణ ధారా స్తోత్రం. ఈ స్తోత్రము లోన పదాలు మరియు భావ సౌందర్యము వలన అత్యంత ప్రాచుర్యము కలిగిన లక్ష్మీదేవి స్తోత్రములలో ఇది ఒకటి. శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులు 21 శ్లోకాలతో రూపొందించిన స్తోత్రాన్ని (Vishnu) విష్ణు పత్ని అగు Lakshmi Devi – శ్రీ లక్ష్మీదేవికి అంకితం చేశాడు.
Kanakadhara Stotram – కనకధారా స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రకారము ఓక రోజు శంకరాచార్యుల వారు బ్రహ్మోపదేశం (Upanayanam) అనంతరం, విధిలో భాగంగా మధ్యాహ్న భోజనం కోసం ఒక ఇంటికి బిక్షకు వెళ్లగా, నిరుపేద బ్రాహ్మణ ఇల్లాలు ఇంట భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహారపదార్ధాలు ఉండవు. ఇల్లు అంతటా వెతికిన ఆమెకు ఒక ఉసిరికాయ మాత్రమే లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు భక్తితో ఉసిరికాయను శంకరునికి సమర్పించింది. పరిస్థితి గ్రహించిన శంకరుడు (Lakshmi Devi) శ్రీ లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకథారాస్తవము చెప్పగా ఆ పేదరాలి యింట లక్ష్మిదేవి కటాక్షముతో ఆ ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి.
అందువల్ల కనకధారా స్తోత్రం (Kanakadhara Stotram) ప్రతినిత్యం పఠించేవారికి సిరి సంపద కలుగుతుందని ప్రతీతి. తప్పక ప్రతినిత్యము పఠించతగ్గ స్తోత్రము.
Kanakadhara Stotram Telugu | కనకధారా స్తోత్రం తెలుగులో
వందే వందారు మందారమిందిరానందకందలమ్ ।
అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని ।
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం-
ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ ।
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి ।
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥
కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన ।
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥
విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి ।
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥
ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే ।
దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 8 ॥
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-
మస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే ।
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి ।
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥
శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై ।
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 11 ॥
నమోఽస్తు నాళీకనిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై ।
నమోఽస్తు సోమామృతసోదరాయై
నమోఽస్తు నారాయణవల్లభాయై ॥ 12 ॥
నమోఽస్తు హేమాంబుజపీఠికాయై
నమోఽస్తు భూమండలనాయికాయై ।
నమోఽస్తు దేవాదిదయాపరాయై
నమోఽస్తు శారంగాయుధవల్లభాయై ॥ 13 ॥
నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై ।
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥
నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై ।
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజవల్లభాయై ॥ 15 ॥
సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి ।
త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ॥ 16 ॥
యత్కటాక్షసముపాసనావిధిః
సేవకస్య సకలార్థసంపదః ।
సంతనోతి వచనాంగమానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే ॥ 17 ॥
సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 18 ॥
దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్ ।
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథగృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ ॥ 19 ॥
కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితైరపాంగైః ।
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 20 ॥
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ।
గుణాధికా గురుతరభాగ్యభాగినో
భవంతి తే భువి బుధభావితాశయాః ॥ 21 ॥
సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ ।
Also Read Click Here
- Shyamala Dandakam | శ్యామలా దండకం
- సరస్వతీ స్తోత్రం | Saraswati Stotram
- Hanuman Chalisa Telugu | హనుమాన్ చాలీసా తెలుగు
- Dharma Shasta Bhujanga Stotram | ధర్మ శాస్తా భుజంగ స్తోత్రం
- Maha Shasta Anugraha Kavacham | మహాశాస్తా అనుగ్రహ కవచం
- Sri Bharati Tirtha Kruta – Dharma Shasta Stotram
- Bhutanatha Dasakam | భూతనాథ దశకం
- Ayyappa Swamy Pancharatnam | అయ్యప్ప పంచరత్నం