Sharada Prarthana | శారదా ప్రార్థన

శారదా ప్రార్థన: జ్ఞాన దేవతను ఆరాధించే దివ్య మార్గం

Sharada Prarthana

విద్య, జ్ఞానం, కళలకు అధిపతి అయిన శారదాదేవిని కొలుచుకోవడానికి “శారదా ప్రార్థన – Sharada Prarthana” ఒక అద్భుతమైన మార్గం. శారదా దేవిను సరస్వతీ దేవి (Saraswati Devi) యొక్క రూపము. విద్యార్థులు, కళాకారులు, జ్ఞానాన్ని ఆరాధించే వారందరూ ఈ ప్రార్థన చేస్తారు. ఇది మనస్సును ఏకాగ్రపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి, విద్య అభ్యసించడంలో విజయం సాధించడానికి సహాయపడుతుంది.

ఈ పవిత్రమైన శారదా దేవి ప్రార్థనను శ్రీ ఆది శంకరాచార్యులు (Adi Shankaracharya) చే రచించిబడినది.

Sharada Prarthana యొక్క ప్రాముఖ్యత:

  • జ్ఞానప్రదాయిని: శారదాదేవిని (Sharada Devi) వేదమాత, జ్ఞానప్రదాయిని అని కొలుస్తారు. ఈ ప్రార్థన చేయడం ద్వారా ఆమె కృపాకటాక్షం ఉండి, విద్యలో అభివృద్ధి సాధించడానికి, కొత్త విషయాలు సులభంగా నేర్చుకోవడానికి సహాయపడుతుంది.
  • ఏకాగ్రత మరియు స్మరణశక్తి: పరీక్షలు లేదా ముఖ్యమైన ప్రదర్శనలకు ముందు చాలా మంది విద్యార్థులు మరియు కళాకారులు శారదా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే సమయంలో దేవి పై దృష్టి పెట్టడం వల్ల మనస్సు ఏకాగ్రత (Concentration) సాధిస్తుంది. ఇది చదువులో మెరుగుదలకు, విషయాలను స్మరించుకోవడానికి సహాయపడుతుంది.
  • ఆత్మవిశ్వాసం పెంపు: శారదాదేవిని ప్రార్థించడం ద్వారా విద్యార్థులు తమ సామర్థ్యాల పట్ల ఆత్మవిశ్వాసం (Self Confidence) పెంచుకోవచ్చు. కష్టమైన సమస్యలను పరిష్కరించే బలం లభిస్తుంది. విజయం సాధించే నిశ్చయ శక్తి నిండి పూర్తి అవుతారు.
  • శుభారంభానికి సూచన: కొత్త విద్య అభ్యసించడం ప్రారంభించే ముందు లేదా పరీక్షలు, పోటీలు వంటి ముఖ్య ఘటనాలకు ముందు శారదా ప్రార్థన చేయడం సాంప్రదాయం. ఇది శుభారంభానికి సూచనగా నిలిచి, విజయానికి దారి తీస్తుందని నమ్మకం.
  • ఆధ్యాత్మిక అభివృద్ధి: జ్ఞానం అనేది ఆధ్యాత్మిక అభివృద్ధికి మొదటి మెట్టు. శారదాదేవిని ప్రార్థించడం వల్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మోక్షం మార్గాన్ని అన్వేషించడానికి దోహదపడుతుంది

ముగింపు: 

శారదా ప్రార్థన అనేది జీవితంలో విజయం సాధించడానికి, జ్ఞానం సంపాదించడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి ఒక అద్భుతమైన మార్గం. మనస్సును ఏకాగ్రపరచడానికి, జ్ఞాపకశక్తిని (Memory) పెంచడానికి, విద్యలో ప్రగతి సాధించడానికి ఇది సహాయపడుతుంది.

శ్రీ జ్ఞానప్రదాయాయై నమః

Sharada Prarthana Telugu

శారదా ప్రార్థన తెలుగు

నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని 

త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే  || 1 || 

యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవీ విధివల్లభా 

భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ   || 2 || 

నమామి యామినీనాథలేఖాలంకృతకుంతలాం 

భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీం  || 3 || 

భద్రకాల్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః  

వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ  || 4 || 

బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ 

సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః   || 5 || 

యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్ 

జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః    || 6 || 

యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా 

యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః   || 7 || 

ఇతి శ్రీశారదాప్రార్థనా సమాప్తా.

Credits: @srimoolasthanayellammadevo4537

Read More Latest Post:

Leave a Comment