వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 16

వైశాఖ పురాణం – 16వ అధ్యాయం – యముని పరాజయము

Vaisakha Puranam - Day 16

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 16వ అధ్యాయం చాలా విశేషమైనది. ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుందనే సందేశాన్ని ఇస్తుంది. ఇక్ష్వాకు వంశానికి (Ikshvaku Dynasty) చెందిన కీర్తిమంతుడు అనే రాజు తన ప్రజలందరినీ వైశాఖ వ్రతం ఆచరించమని ప్రోత్సహించాడు. వైశాఖ వ్రత మహిమ వల్ల ప్రజలు ధార్మిక జీవితాలు గడిపి, చివరికి స్వర్గాన్ని చేరుకున్నారు. దీనివల్ల యమలోకం (Yama Loka) ఖాళీగా మారింది. కోపంతో రగిలిన యమధర్మరాజు కీర్తిమంతునిపై దండెత్తి ఓడిపోయాడు. యమ సేవకులు కూడా కీర్తిమంతుని వీరత్వానికి భయపడి పారిపోయారు. యమధర్మరాజు కూడా ఓడిపోయి, తన తప్పిదాన్ని గ్రహించాడు.

బోధన: ధర్మమే విజయం

ఓటమి తరువాత యమధర్మరాజు బ్రహ్మదేవుని (Lord Brahma) వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు వివరించాడు. బ్రహ్మదేవుడు కీర్తిమంతుడు ధర్మబద్ధమైన పాలన అందించడం వల్లనే ప్రజలు ఎక్కువ కాలం జీవించారని, వైశాఖ వ్రతం ఫలితంగా స్వర్గాన్ని (Heaven) పొందారని వివరించాడు. తన తప్పు తెలుసుకున్న యమధర్మరాజు క్షమాపణ కోరాడు. ధర్మబద్ధమైన పాలన వల్ల మరణం ఆలస్యమవుతుందని, ప్రజలకు సుఖసంతోషాలు కలుగుతాయని బ్రహ్మ వివరించాడు. ఈ కథ ద్వారా ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుందనే సందేశాన్ని వైశాఖ పురాణం మనకు అందిస్తుంది.  వైశాఖ పురాణం – 16 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 16) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 16

వైశాఖ పురాణం – 16వ అధ్యాయం – యముని పరాజయము

అప్పుడు నారదమహర్షి (Narada Muni) యమలోకమునకు వెళ్లెను. యమలోక స్థితిని జూచెను. యమధర్మరాజా! (Yama Dharmaraja) నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును (Chitragupta) ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటం మాని ముని వలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమిటి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను. నారదమహర్షీ! భూలోకమున ఇక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణు భక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖ వ్రతమును (Vaisakha Vrut) అవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందు వలన ప్రతి వారును భక్తివలననో దండన భయముననో తప్పక వైశాఖమాస (Vaisakha Masam) వ్రతమును ధర్మములను ఆచరించుచూ చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణు లోకమును (Vishnu Lokam) చేరుచున్నారు. ఇందు వలన నరకమునకు వచ్చువారెవరును లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకమునకే పోవుచున్నారు. 

ఇందువలన నేను మ్రోడైన మానువలెనుంటిని. నాకు యిట్టిస్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పినపనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినడి ఏమియని అడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.

యమ ధర్మరాజు తన వాహనమైన మహిషమును ఎక్కి భయంకర ఆకారముతో యమ దండమును ధరించి భీకరులగు యేబదికోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమ ధర్మరాజని తెలిసికొని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో (Brahmastra) మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమ దండమును చూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.

అప్పుడు శ్రీహరి (Sri Hari) తన భక్తుడు అగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును (Sudarshana Chakra) పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తి హీనములగావించి మరలించి యమునిపై మరలెను. విష్ణు భక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను.

అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శనచక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును, విషాదమును పొందెను.

అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు, అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపముకల, ఇతిహాస పురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు (Purnima), అమావాస్యలు (Amavasya), సుఖదుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమోగుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.

ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూచి సభ లోనివారు క్షణమైన తీరికయుండని ఇతాడు ఇక్కడికి ఎందులకు వచ్చెను. తల వంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోనివారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని ఇట్లు సభలోనున్న భూతములు, దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమ ధర్మరాజు బ్రహ్మ పాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని ఏడ్చెను. స్వామీ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవమునందితిని. 

మానవుల పుణ్యపాపముల దెలుపుపటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై ఉండెను. దీనిని చూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా? చెడు చేసిన వాడు చెడును పొందక తప్పునాయని సభ లోనివారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.

వాయువు సభలోని వారిని నిశ్శబ్ద పరచి బ్రహ్మ పాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు, దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పనినిన్ను చేసికొనకుండ అడ్డ్గించిన వారెవరు? ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము? నీవెందులకు వచ్చితివి? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయము లేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మ రాజు ‘అయ్యో’ అని అతి దీనముగ బలికెను.

వైశాఖ పురాణం 16వ అధ్యాయం సంపూర్ణం.

Read more Puranas:

Leave a Comment