వైశాఖ పురాణం |Vaisakha Puranam

వైశాఖ పురాణం విశేషాలు మరియు విశిష్టతలు

Vaisakha Puranam

వైశాఖ పురాణం – Vaisakha Puranam నందు నారదుడు రాజర్షి (Narada Muni) అంబరీషుడితో, తాను పూర్వం బ్రహ్మ (Brahma) దగ్గర మాసాల మహిమ గురించి తెలుసుకున్నానని చెప్పాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు (Maha Vishnu) లక్ష్మీదేవికి మాసాల ధర్మాలను వివరిస్తున్నాడట. ఆ విషయాలనే ఇప్పుడు అంబరీషుడికి చెప్పబోతున్నాడు.

అన్ని మాసాలలో కార్తీక మాసం (Karthika Masam), మాఘ మాసం (Magha Masam), వైశాఖాలు చాలా ఉత్తమమైనవి. వాటిలో కూడా వైశాఖ మాసం (Vaisakha Masam) అత్యుత్తమమైనది. ఈ మాసం మనకు సర్వ శుభాలు కలుగజేస్తుంది. వైశాఖ మాసంలో చేసే స్నానాలు, పూజలు, దానాలు పాపాలను పోగొడతాయి. దేవతలు కూడా ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలను గౌరవిస్తారు.

అన్ని విద్యల్లో వేదవిద్య, అన్ని మంత్రాల్లో ఓంకారం (Omkara), అన్ని వృక్షాల్లో కల్పవృక్షం (Kalpavriksha), అన్ని ధేనువుల్లో కామధేనువు (Kamadhenu), అన్ని సర్పాలలో శేషుడు, అన్ని పక్షుల్లో గరుత్మంతుడు, అన్ని దేవతల్లో శ్రీమహావిష్ణువు (Lord Vishnu), అన్ని వర్ణాల్లో బ్రాహ్మణుడు (Brahmin), అన్నింటికంటే ప్రాణం, అన్ని బంధాలకు భార్య, అన్ని నదుల్లో గంగానది (Ganga River), అన్ని కాంతుల్లో సూర్యుడు, అన్ని ఆయుధాల్లో చక్రం, అన్ని లోహాల్లో బంగారం (Gold), అన్ని భక్తుల్లో రుద్రుడు, అన్ని రత్నాల్లో కౌస్తుభం లాగే, అన్ని ధర్మాలకు వైశాఖ మాసం ఉత్తమమైనది. అందుకే దీన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. విష్ణువును ప్రీతిపర్చే మాసాల్లో వైశాఖ మాసానికి సాటిలేదు.

వైశాఖ మాసంలో సూర్యుడు మేష రాశిలో ఉండగా, సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేస్తే, శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో (Lakshmi Devi) కలిసి ఆ భక్తుడిని అత్యంత ఆనందంతో ఆశీర్వదిస్తారు.

వైశాఖ మాసంలో కేవలం ఒక్కసారే స్నానం, పూజ చేసినా పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరుతారు. వారం రోజులు పూజలు, స్నానాలు చేస్తే వేల సంఖ్యలో అశ్వమేధ యాగాలు (Ashwamedha Yagna) చేసినంత పుణ్యం లభిస్తుంది. స్నానం చేయలేని పరిస్థితి ఉండి కానీ స్నానం చేయాలనే సంకల్పం బలంగా ఉంటే, నూరు అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే, నదీ స్నానం చేయలేకపోయినా కూడా, స్నానం చేయాలనే సంకల్పంతో కొంత దూరం ప్రయాణించినా విష్ణు సాక్షాత్కారం లభిస్తుంది.

వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో పుణ్య కార్యాలు చేయడం వల్ల పాపాలు తొలగి, విష్ణు ఆశీర్వాదం లభిస్తుంది. స్నానం చేయలేకపోయినా స్నాన సంకల్పం దృఢంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. నారద మహర్షి అంబరీషునికి వివరించిన వైశాఖ పురాణము విశిష్ఠతలను, కథలను వివిధ అధ్యాయాలుగా విభజించబడినది. అధ్యయ వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నవి. 

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు: 

1 . వైశాఖమాస ప్రశంస

2 . వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి  ఫలితములు

3 . వివిధ దానములు – వాటి మహత్యములు

4 . వైశాఖ ధర్మ ప్రశంస

5 . వైశాఖమాస విశిష్టత

6 . జలదాన మహత్యము – గృహగోధికా కథ

7 . వైశాకమాస  దానములు

8 . పిశాచ మోక్షము

9 . సతీదేహ త్యాగము

10 . దక్షయజ్ఞనాశము కామదహనము

11 . రతి దుఃఖము – దేవతల ఊరడింపు

12 . కుమార జననము

13 . అశూన్య శయన వ్రతము

14 . ఛత్రదాన మహిమ

15 . వైశాకవ్రత మహిమ

16 . యముని పరాజయము

17 . యమదుఃఖ నిరూపణము

18 . విష్ణువు యముని ఊరడించుట

19 . పిశాచత్వ విముక్తి

20 . పాంచాలరాజు రాజ్యప్రాప్తి

21 . పాంచాలరాజు సాయుజ్యము

22 . దంతిల కోహల శాపవిముక్తి

23 . కిరాతుని పూరజన్మ

24 . వాయుశాపము

25 . భాగవత ధర్మములు

26 . వాల్మీకి జన్మ

27 . కలిధర్మములు – పితృముక్తి

28 . అక్షయతృతీయ విశిష్టత

29 . శునీ మోక్షప్రాప్తి

30 . పుష్కరిణి – ఫలశ్రుతి

ముగింపు శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసం నందు సూర్యోదయం నందు నదీస్నానంను ఆచరించి, పూజలను, జపాలను మరియు దానములను ఆచరించి వైశాఖ పురాణం – Vaisakha Puranam ను పఠించినచో శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెంది వైకుంఠ ప్రాప్తి చేరువగుదురు.

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥

Read more Puranas:

Leave a Comment