ఏకాదశముఖి హనుమాన్ కవచం |Ekadash Mukhi Hanuman Kavacham

ఏకాదశముఖి హనుమాన్ కవచం: అపార శక్తిని అందించే రక్షణ కవచం

Ekadash Mukhi Hanuman Kavacham

“ఏకాదశముఖి హనుమాన్ కవచం – Ekadash Mukhi Hanuman Kavacham ” పఠనం శ్రీరామచంద్రుడి నిజమైన భక్తుడైన హనుమంతుడు తన అపార శక్తిని, ధైర్యం మరియు నిస్వార్థ సేవను చాటి చెప్పిన ఆంజనేయ స్వామిను (Anjaneya Swamy) కొలిచేందుకు ఉత్తమమైన మరియు శక్తివంతమైన మార్గము. 

ఏకాదశముఖి హనుమాన్ కవచం అనగా?

“ఏకాదశముఖి హనుమాన్ కవచం” అనేది హనుమంతుడి 11 ముఖాల స్తోత్రం. ఈ కవచం సంస్కృత (Sanskrit) భాషలో రచించబడింది. “కవచం” అంటే రక్షణ (Protection) అని అర్థం. కావున, ఏకాదశముఖి హనుమాన్ కవచం పఠించడం వల్ల భక్తులకు శత్రువులు, భయాలు, మరియు ఇతర కష్టాల నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం.

Ekadash Mukhi Hanuman Kavacham విశిష్టత:

  • 11 ముఖాల స్తుతి: ఈ కవచంలో హనుమంతుడి 11 ముఖాల స్తుతి ఉంటుంది. ప్రతి ముఖం ఒక నిర్దిష్ట దిక్కును, గుణాన్ని లేదా శక్తిని సూచిస్తుంది. ఉదాహరణకు, వానరుడి ముఖం బలం మరియు ధైర్యాన్ని, నరసింహ (Narasimha) ముఖం కోపాన్ని మరియు రక్షణను సూచిస్తుంది.
  • అపార రక్షణ: ఈ కవచం పఠించడం వల్ల భయాలు, శత్రువులు, మరియు గ్రహ దోషాల నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం.
  • విజయం సాధన: విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం వంటి రంగాలలో విజయం సాధించడానికి కూడా ఈ కవచాన్ని పఠిస్తారు.

ఏకాదశముఖి హనుమాన్ కవచం నందు ప్రతి శ్లోకంలో హనుమంతుడి (Hanuman Ji) ఒక ముఖం యొక్క వర్ణన మరియు స్తుతి ఉంటుంది. అందులో శ్రీదేవ్యువాచతో మొదలై కరన్యాసం, అంగన్యాసం, ధ్యానం, దిగ్బంధ, మాలామంత్రం మరియు ఫలశ్రుతితో అంతము అవుతుంది. 

నియమ నిష్ఠ:

ఏకాదశముఖి హనుమాన్ కవచం యొక్క పూర్తి ప్రయోజనాలు పొందాలంటే, దీన్ని నియమ నిష్ఠగా పఠించడం చాలా ముఖ్యం. ప్రతి రోజూ లేదా వారానికి ఒక నిర్ణీత సమయంలో క్రమం తప్పకుండా పఠించడానికి క్రమంగా అలవాటు చేసుకోవచ్చు.

ఏకాదశముఖి హనుమాన్ కవచం ప్రయోజనాలు:

ఏకాదశముఖి హనుమాన్ కవచం పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

  • భయ నివారణ: ఈ కవచం పఠించడం వల్ల భయాలు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
  • శత్రు నివారణ: శత్రువుల బాధలు తొలగిపోవడానికి కూడా ఈ కవచాన్ని పఠిస్తారు.
  • ఆధ్యాత్మిక పరిణామం: హనుమంతుడి భక్తి ద్వారా మన ఆధ్యాత్మిక పరిణామం సాధ్యమవుతుంది.
  • బలం మరియు ధైర్యం: హనుమంతుడిని ఆరాధించడం వల్ల మనలో బలం మరియు దైర్యం కలుగుతుంది. 

ముగింపు: 

శ్రీరామ భక్తుడైన (Sri Ram) హనుమంతుడు అనేక రూపాలను కలిగి ఆంజనేయ, మారుతి (Maruti), భజరంగబలి (Bajrangbali), వాయుపుత్ర (Vayuputra) అనేక పేర్లతో కూడిఉన్న శక్తివంతమైన దేవుడు. ఏకాదశముఖి హనుమాన్ కవచం ఆయన 11 ముఖాలను స్తుతిస్తూ, భక్తులకు రక్షణ మరియు శక్తిని అందించే ఒక ప్రత్యేకమైన స్తోత్రం. ఏకాదశముఖి హనుమాన్ కవచం కేవలం రక్షణ కవచం మాత్రమే కాకుండా, మన ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. ఈ కవచాన్ని పఠించడం ద్వారా హనుమంతుడి ఆశీస్సులు పొంది, జీవితంలో విజయం సాధించడానికి మరియు కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుంది. 

Ekadash Mukhi Hanuman Kavacham Telugu 

ఏకాదశముఖి హనుమాన్ కవచం తెలుగు

(రుద్రయామలతః)

శ్రీదేవ్యువాచ
శైవాని గాణపత్యాని శాక్తాని వైష్ణవాని చ ।
కవచాని చ సౌరాణి యాని చాన్యాని తాని చ ॥ 1॥
శ్రుతాని దేవదేవేశ త్వద్వక్త్రాన్నిఃసృతాని చ ।
కించిదన్యత్తు దేవానాం కవచం యది కథ్యతే ॥ 2॥

ఈశ్వర ఉవాచ
శ‍ఋణు దేవి ప్రవక్ష్యామి సావధానావధారయ ।
హనుమత్కవచం పుణ్యం మహాపాతకనాశనమ్ ॥ 3॥
ఏతద్గుహ్యతమం లోకే శీఘ్రం సిద్ధికరం పరమ్ ।
జయో యస్య ప్రగానేన లోకత్రయజితో భవేత్ ॥ 4॥

ఓం అస్య శ్రీఏకాదశవక్త్రహనుమత్కవచమాలామంత్రస్య
వీరరామచంద్ర ఋషిః । అనుష్టుప్ఛందః । శ్రీమహావీరహనుమాన్ రుద్రో దేవతా ।
హ్రీం బీజమ్ । హ్రౌం శక్తిః । స్ఫేం కీలకమ్ ।
సర్వదూతస్తంభనార్థం జిహ్వాకీలనార్థం,
మోహనార్థం రాజముఖీదేవతావశ్యార్థం
బ్రహ్మరాక్షసశాకినీడాకినీభూతప్రేతాదిబాధాపరిహారార్థం
శ్రీహనుమద్దివ్యకవచాఖ్యమాలామంత్రజపే వినియోగః ।

అథ కరన్యాసః ।
ఓం హ్రౌం ఆంజనేయాయ అంగుష్ఠభ్యాం నమః ।
ఓం స్ఫేం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః ।
ఓం స్ఫేం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః ।
ఓం స్ఫేం అంజనీగర్భాయ అనామికాభ్యాం నమః ।
ఓం స్ఫేం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం హ్రౌం బ్రహ్మాస్త్రాదినివారణాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః ।

అథ అంగన్యాసః ।
ఓం హ్రౌం ఆంజనేయాయ హృదయాయ నమః ।
ఓం స్ఫేం రుద్రమూర్తయే శిరసే స్వాహా ।
ఓం స్ఫేం వాయుపుత్రాయ శిఖాయై వషట్ ।
ఓం హ్రౌం అంజనీగర్భాయ కవచాయ హుమ్ ।
ఓం స్ఫేం రామదూతాయ నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం హ్రౌం బ్రహ్మాస్త్రాదినివారణాయ అస్త్రాయ ఫట్ ।
ఇతి న్యాసః ।

అథ ధ్యానమ్ ।
ఓం ధ్యాయేద్రణే హనుమంతమేకాదశముఖాంబుజమ్ ।
ధ్యాయేత్తం రావణోపేతం దశబాహుం త్రిలోచనం
హాహాకారైః సదర్పైశ్చ కంపయంతం జగత్త్రయమ్ ।
బ్రహ్మాదివందితం దేవం కపికోటిసమన్వితం
ఏవం ధ్యాత్వా జపేద్దేవి కవచం పరమాద్భుతమ్ ॥

దిగ్బంధాః
ఓం ఇంద్రదిగ్భాగే గజారూఢహనుమతే బ్రహ్మాస్త్రశక్తిసహితాయ
చౌరవ్యాఘ్రపిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

ఓం అగ్నిదిగ్భాగే మేషారుఢహనుమతే అస్త్రశక్తిసహితాయ చౌరవ్యాఘ్ర-
పిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

ఓం యమదిగ్భాగే మహిషారూఢహనుమతే ఖడ్గశక్తిసహితాయ చౌరవ్యాఘ్ర-
పిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

ఓం నిఋర్తిదిగ్భాగే నరారూఢహనుమతే ఖడ్గశక్తిసహితాయ చౌరవ్యాఘ్ర-
పిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

ఓం వరుణదిగ్భాగే మకరారూఢహనుమతే ప్రాణశక్తిసహితాయ
చౌరవ్యాఘ్ర పిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

ఓం వాయుదిగ్భాగే మృగారూఢహనుమతే అంకుశశక్తిసహితాయ
చౌరవ్యాఘ్రపిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

ఓం కుబేరదిగ్భాగే అశ్వారూఢహనుమతే గదాశక్తిసహితాయ
చౌరవ్యాఘ్ర పిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

ఓం ఈశానదిగ్భాగే రాక్షసారూఢహనుమతే పర్వతశక్తిసహితాయ
చౌరవ్యాఘ్ర పిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

ఓం అంతరిక్షదిగ్భాగే వర్తులహనుమతే ముద్గరశక్తిసహితాయ
చౌరవ్యాఘ్ర పిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

ఓం భూమిదిగ్భాగే వృశ్చికారూఢహనుమతే వజ్రశక్తిసహితాయ
చౌరవ్యాఘ్ర పిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

ఓం వజ్రమండలే హంసారూఢహనుమతే వజ్రశక్తిసహితాయ చౌరవ్యాఘ్ర-
పిశాచబ్రహ్మరాక్షసశాకినీడాకినీవేతాలసమూహోచ్చాటనాయ
మాం రక్ష రక్ష స్వాహా ।

చదవండి - హనుమాన్ చాలీసా తెలుగు
శ్రీ హనుమదష్టకం తెలుగు

Leave a Comment