రామసభ |Rama Sabha

రామ రాజ్య స్థాపన: ఘనమైన రామసభ

Rama Sabha

రామాయణంలోని అత్యంత శుభప్రదమైన ఘట్టాలలో ఒకటి “రామసభ – Rama Sabha”. రావణుడిపై విజయం సాధించి, సీతా మాతని కాపాడిన తరువాత, 14 సంవత్సరాల వనవాసాన్ని పూర్తి చేసుకుని, శ్రీరాముడు (Sri Rama) అయోధ్యకు తిరిగి వస్తాడు. రాముడి రాకను అయోధ్యా వాసులు పండుగలా జరుపుకుంటారు. అయోధ్య నగరము (Ayodhya) అంతయూ దీపాలను వెలిగించి సంబరాలు మిన్నందుతాయి. ఈ పునరాగమనం తరువాత జరిగే రాముడి పట్టాభిషేకమే “రామసభ”గా పేరుగాంచింది.

రామసభ కేవలం రాజ్యాభిషేకం మాత్రమే కాదు, అది ధర్మం గెలుపుకు, సత్యం అసత్యంపై విజయానికి చిహ్నం. ఈ ఘట్టం రామాయణంలోని (Ramayan) అనేక విశేషాలను మనకు చాటుతూ ఉంటుంది.

రామసభ యొక్క వైభవం:

  • అతిథుల సంగమం: రామసభకు రాముడి (Sri Ram) కుటుంబ సభ్యులు, స్నేహితులు, వానర సేన, దేవతలు, ఋషులు, రాక్షస ప్రముఖులు సహా అనేక మంది పెద్దలు హాజరయ్యారు. భరతుడు (Bharata), శత్రుఘ్నుడు (Shatrughan), హనుమంతుడు (Hanuman Ji), లక్ష్మణుడు (Lakshman)వంటి వారందరూ ఈ పుణ్య ఘట్టానికి సాక్షులుగా ఉన్నారు.
  • పట్టాభిషేకం: వేద (Veda) మంత్రాల నడుమ, పవిత్ర జలాలతో అభిషేకం జరిపించి శ్రీరాముడు అయోధ్య రాజ్యానికి చక్రవర్తిగా (King) పట్టాభిషేకం చేయబడ్డాడు. రాముడిని చక్రవర్తిగా చూసి అందరూ ఆనందంతో కేకలు వేశారు. రాజధాని అంతా పండుగ వాతావరణంలో హర్షాతిరేకంగా గడిపారు.
  • రాముడి ఆదర్శ పాలన: రామసభ రాముడి “రామరాజ్యం” యొక్క ప్రారంభానికి సూచన. రాముడు ధర్మరాజుగా పేరుగాంచాడు. ఆయన పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భద్రతతో జీవించారు.
  • శాంతిసందేశం: రామసభ రాజ్యంలో శాంతి (Peace), సమృద్ధి నెలకొల్పాలని, ప్రజలందరినీ సమానంగా చూడాలనే సందేశాన్ని ఇస్తుంది. ప్రజల పాలనకు ఎంతటి కష్టాలు ఎదురైనా ధర్మం పంతలోనే  నడవాలని రామ రాజ్యం తెలియజేస్తుంది.
  • సభా వైభవం: రాజప్రసాదం అంతా అలంకరించబడి ఉంటుంది. విలువైన వస్త్రాలు, పుష్పాలు, ఆభరణాలతో సభా స్థలిని అలంకారం చేయబడి ఉంటాయి. రాజనీతిజ్ఞలు, దేశ విదేశాల నుండి వచ్చిన ప్రతినిధులు సభలో ఆసీనులయ్యారు. వేద పండితులు, మహర్షులు పవిత్ర మంత్రాలును పఠిస్తారు. రాముడి పట్టాభిషేక సమయంలో వేదఘోష మోగుతూ ఉంటుంది.

రామసభ యొక్క ప్రాముఖ్యత:

రామాయణం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన గొప్ప కావ్యం. రామసభ ఈ కావ్యంలోని గుర్తుండిపోయే ఘట్టాలలో ఒకటి. ఈ ఘట్టం మనకు నీతి బోధనలు బోధిస్తుంది.

  • ధర్మం యొక్క విజయం: రామసభ ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుందనే దానికి నిదర్శనం. శ్రీరాముడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపి, అధర్మాన్ని పరాజయం చేశాడు.
  • క్షమ గుణం యొక్క ప్రాముఖ్యత: రామాయణంలో రాముడు, సీత (Sita Devi), లక్ష్మణుడు వంటి పాత్రలు కష్టాలు, వియోగం ఎదుర్కొన్నప్పటికీ క్షమా గుణాన్ని ప్రదర్శిస్తాయి. రామసభ మనకు క్షమ ఎంత అవసరమో బోధిస్తుంది.
  • సరైన పాలన: రామరాజ్యం రాజు తన ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనే సూత్రాన్ని బోధిస్తుంది. శ్రీరాముడు న్యాయ పాలనకు రాజుగా నిలుస్తాడు. రామసభ ద్వారా రాజులు ఎలా పాలించాలో తెలిపే ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.

రామాయణంలోని రామసభ జీవితంలో ఆచరించాల్సిన మంచి గుణాలను మరియు సూత్రాలను బోధించే గొప్ప గ్రంథం.

Rama Sabha Telugu

రామసభ తెలుగు

రాజసభ, రఘు రామసభ
సీతా కాంత కల్యాణ సభ ।
అరిషడ్వర్గములరయు సభ
పరమపదంబును ఒసగు సభ ॥ (రాజసభ)

వేదాంతులకే జ్ఞాన సభ
విప్రవరులకే దాన సభ ।
దుర్జనులకు విరోధి సభ
సజ్జనులకు సంతోష సభ ॥ (రాజసభ)

సురలు, అసురులు కొలచు సభ
అమరులు, రుద్రులు పొగడు సభ ।
వెరువక హరివిల్లు విరచు సభ
జనకుని మది మెప్పించు సభ ॥ (రాజసభ)

భక్తి జ్ఞానములొసగు సభ
సృష్టి రహితులై నిలచు సభ ।
ఉత్తమ పురుషుల ముక్తి సభ
చిత్త విశ్రాంతినొసగు సభ ॥ (రాజసభ)

గం-ధర్వులు గానము చేయు సభ
రం-భాదులు నాట్యములాడు సభ ।
పుష్ప వర్షములు కురియు సభ
పూజ్యులైన మునులుండు సభ ॥ (రాజసభ)

Credits: @chitranagraj2957

Read More Latest Post:

Leave a Comment